ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

BRS: సీఎం రేవంత్‌రెడ్డి రెడ్డి ఏడాది పాలనపై హరీష్‌రావు తీవ్ర విమర్శలు

ABN, Publish Date - Dec 02 , 2024 | 12:54 PM

రేవంత్ రెడ్డి ఏడాది పాలనపై బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర విమర్శలు చేశారు. మాటలు మార్చటంలో రేవంత్ రెడ్డి పీహెచ్‌డీ చేశారని.. రెండు కాదు.. మూడో మాట కూడా మార్చగల నేర్పరి అని, పూటకో పార్టీ మార్చటం రేవంత్ రెడ్డికి వె‌న్నతో పెట్టిన విద్య అని, రాక్షసులు అన్న నోటితోనే.. దేవత అని పొగడగల సామర్థ్యం రేవంత్ రెడ్డి సొంతమని విమర్శించారు.

హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఏడాది పాలనపై బీఆర్ఎస్ సీనియర్ నేత (BRS Leader), మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao) తీవ్ర విమర్శలు చేశారు. ‘నాడు నేడు’ పేరుతో.. ఎన్నికల ప్రచారంలో సీఎం ఇచ్చిన హామీలను స్క్రీన్‌లో ప్రదర్శించారు. ముఖ్యమంత్రికి సిగ్గు ఎగ్గు లేదంటూ ఫైర్ అయ్యారు. ఈ సందర్బంగా సోమవారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. మాటలు మార్చటంలో రేవంత్ రెడ్డి పీహెచ్‌డీ చేశారని.. రెండు కాదు.. మూడో మాట కూడా మార్చగల నేర్పరి అని, పూటకో పార్టీ మార్చటం రేవంత్ రెడ్డికి వె‌న్నతో పెట్టిన విద్య అని, రాక్షసులు అన్న నోటితోనే.. దేవత అని పొగడగల సామర్థ్యం రేవంత్ రెడ్డి సొంతమని విమర్శించారు. ఏడాది పాలనలో కూల్చివేతలు తప్ప.. రేవంత్ నిర్మించినవి లేవని, తనది కూడా పోలీస్ కుటంబం అన్న సీఎం.. పోలీస్ కుటుంబాలను రాచిరంపాన పెడుతున్నారని తీవ్రస్థాయిలో ఆరోపించారు.


ఎవరు తలమాసినోడో సీఎంకు తెలుసు..

ఏడాది పాలనలో రైతుబంధు,బతుకమ్మ చీరలు, ఎల్ఆర్ఎస్, కాళేశ్వరం ప్రాజెక్ట్ సహా.. ప్రతి అంశంపై సీఎం రేవంత్ రెడ్డి మాట మార్చారని, ఆడపిల్లను మోసం చేయటమంటే పాపం చేసినట్లు తెలంగాణ సమాజం భావిస్తుందని హరీష్ రావు అన్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట ప్రకారం ఎల్ఆర్ఎస్ కట్టొద్దని ప్రజలను కోరుతున్నామని, పోటీ పరీక్షల విషయంలో ముఖ్యమంత్రిది‌.. డబుల్ కాదు.. ట్రిపుల్ స్టాండర్డ్ అని, పార్టీ ఫిరాయింపుల విషయంలో సైతం రేవంత్ రెడ్డి మాట మార్చారని విమర్శించారు. సీఎం ప్రారంభించబోయే.. కోకాకోలా కంపెనీకి సరఫరా అయ్యే నీళ్ళు కూడా కాళేశ్వరం నీళ్ళేనని అన్నారు. పోటీ పరీక్షల వాయిదా విషయంలో ఎవరు తలకమాసినోడో రేవంత్ రెడ్డికు తెలుసునని అన్నారు.

సోనియా గాంధీ కూడా బలయ్యారు..

సీఎం రేవంత్ రెడ్డి డబుల్ స్టాండర్డ్‌కు.. సోనియా గాంధీ కూడా బలయ్యారని, పచ్చ పార్టీలో ఉన్నప్పడు సోనియా బలిదేవత.. మూడు రంగుల జెండా పట్టగానే దేవత అయ్యారని, అవసరమైతే కాళ్ళు పట్టుకోవటం.. తర్వాత కాళ్ళు గుంజటం ముఖ్యమంత్రి నైజమని హరీష్ రావు విమర్శించారు. రాళ్ళు వేయటం... పువ్వులు వేయటంలో కూడా సిఎం దిట్టని.. సమగ్ర సర్వేపై అప్పట్లో విమర్శలు చేసిన రేవంత్ రెడ్డి.. ఇప్పుడు అడ్డమైన ప్రశ్నలు వేయటం లేదా అని ప్రశ్నించారు. కూల్చివేతల విషయంలో ఆనాడు ఏం మాట్లాడారు.‌ ఇప్పుడు ఏం చేస్తున్నారని నిలదీశారు. నాడు మద్యం వద్దని మాట్లాడారని.. ఇప్పుడు మద్యమే ప్రభుత్వానికి మాద్యమైందన్నారు. ఎవరు తాగుబోతుల తెలంగాణ చేస్తున్నారో సీఎం రేవంత్ రెడ్ది చెప్పాలని హరీష్ రావు అన్నారు.


సీఎం రేవంత్ రెడ్డి అపరిచితుడు

రేవంత్ రెడ్డి ఏడాది పాలన.. మోసం దగా.. వంచనకు నిలువెత్తు నిదర్శనమని.. సీఎం భాషతో పిల్లలు చెడిపోతారని తల్లిదండ్రులు భావిస్తున్నారని హరీష్ రావు అన్నారు. నక్సలైట్లు ఉండాలని గతంలో చెప్పిన రేవంత్ రెడ్డి‌..‌ ఇప్పుడు వద్దు అంటున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక.. తెలంగాణలో మూడో ఫేక్ ఎన్‌కౌంటర్ జరిగిందని ఆరోపించారు. ఫార్మాసిటీ కాదని లెఫ్ట్ పార్టీల నేతలకు చెప్పి.. ఇప్పుడు మాట మార్చారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నోటికి మెక్కాలన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అపరిచితుడని అన్నారు. రైతు బరోసా ఒక పంటకు కాదని.. రెండు పంటలకు ఇవ్వాలని అన్నారు. ప్రజాస్వామ్య పునరుద్ధరణ పేరుతో.. ప్రజాస్వామ్య హననం జరుగుతోందని, మూసీ ప్రక్షాళనకు రూ. లక్షా 50 వేల కోట్లు అని.. తర్వాత ఎవరన్నారని సీఎం దబాయిస్తున్నారని అన్నారు. ప్రభుత్వ సలహాదారులపై గతంలో హైకోర్టుకు వెళ్ళిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఇప్పుడు ఎలా నియమించారని హరీష్ రావు ప్రశ్నించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పెళ్లి వ్యవహారంతోనే మనస్థాపానికి గురై...

పులి జాడ కోసం కాగజ్‌నగర్ అడవుల్లో అన్వేషణ

కార్తీక మాసం చివరి రోజు పోలి పాడ్యమి..

ములుగు ఏజన్సీలో టెన్షన్ టెన్షన్..

చంద్రబాబుతో పవన్ కల్యాణ్ కీలక భేటీ

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Dec 02 , 2024 | 12:56 PM