ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Harish Rao: విద్యా వ్యవస్థ ఇంకా బలోపేతం కావాలి

ABN, Publish Date - Sep 05 , 2024 | 05:03 PM

విద్యావ్యవస్థ ఇంకా బలోపేతం కావాలని మాజీ మంత్రి, సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హరీష్‎రావు( Harish Rao) అన్నారు. జిల్లా కేంద్రంలోని టీటీసీ భవనంలో గురుపూజోత్సవం సందర్బంగా ఈరోజు(గురువారం) జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో హరీష్‎రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

Harish Rao

సిద్దిపేట జిల్లా: విద్యావ్యవస్థ ఇంకా బలోపేతం కావాలని మాజీ మంత్రి, సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హరీష్‎రావు( Harish Rao) అన్నారు. జిల్లా కేంద్రంలోని టీటీసీ భవనంలో గురుపూజోత్సవం సందర్బంగా ఈరోజు(గురువారం) జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో హరీష్‎రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్‎రావు మాట్లాడుతూ... సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదిన సందర్భంగా గురు పుజోత్సవం జరుపుకుంటారని తెలిపారు.


ALSO Read: Uttam kuamr: మరమ్మతులు, పునరుద్ధరణకు టెండర్లను పిలవండి.. మంత్రి ఉత్తమ్ ఆదేశాలు

ఈ గురువులు అందరికీ గురు పుజోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఉపాధ్యాయులకు సమాజంలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉందని వివరించారు. ఎవరికి దొరకని గౌరవం ఓక ఉపాధ్యాయునికి దొరుకుతుందని అన్నారు. సిద్దిపేట జిల్లా ఉపాధ్యాయులు ఎప్పుడు సిద్దిపేట గౌరవాన్ని కాపాడారని చెప్పారు. రాష్ట్రంలో పదోతరగతి ఫలితాల్లో సిద్దిపేటను రెండో స్థానంలో ఉపాధ్యాయులు నిలిపారని ప్రశంసించారు. రాష్ట్రంలో సిద్దిపేట జిల్లా త్రిబుల్ ఐటీలో మొదటిస్థానంలో ఉందని తెలిపారు. మాజీ సీఎం కేసీఆర్ ప్రభుత్వ తెలంగాణలోని పాఠశాల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టారని చెప్పారు. ‘మన ఊరు - మన బడి’ పథకంలో ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ విద్యా ప్రారంభించామని తెలిపారు.


‘మన ఊరు - మన బడి’ పనులను కాంగ్రెస్ ప్రభుత్వం మధ్యలోనే ఆపేసిందని ఆరోపణలు చేశారు.రాష్ట్రంలో 1700 ప్రభుత్వ పాఠశాలలు ఈ విద్యా సంవత్సరం మూతపడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు.ఉపాధ్యాయులకు సంబంధించిన నాలుగు డీఏలు ఇంకా పెండింగ్‎లో ఉన్నామని..వాటిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాల్లో ఉచిత కరెంటు లేదని.. స్కవెంజరు‎లు లేరని చెప్పారు.‎ విద్యా వలంటీర్లు, ఉపాధ్యాయులు లేక పాఠశాలలు మూతపడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని తీసివేతలు, ఏరివేతలు కోతలు పెడుతున్నారని ఆరోపణలు చేశారు. కేసీఆర్ ప్రభుత్వంలో విద్యా నిలయంగా సిద్దిపేటను మార్చుకున్నామని చెప్పారు. ‎సిద్దిపేట ప్రజలు అన్ని చదువులు చదవాలని అన్ని కోర్సులు అందుబాటులోకి తెచ్చినట్లు హరీష్‎రావు వెల్డడించారు.


ఈ వార్తలు కూడా చదవండి...

Vijayawada Floods: బిగ్ రిలీఫ్.. కోలుకుంటున్న బెజవాడ

Ranganath: హైడ్రా పేరుతో వసూళ్లకు పాల్పడితే జైలే గతి

Read Latest Telangana News And Telugu News

Updated Date - Sep 05 , 2024 | 05:13 PM

Advertising
Advertising