ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Pushpa 2: ఈ వీడియో చూస్తే కనీస జ్ఞానం ఉన్నవాళ్లకు ఏం జరిగిందో తెలుస్తుంది.. అల్లు అర్జున్ ఎపిసోడ్‌పై సీపీ సంచలన వ్యాఖ్యలు

ABN, Publish Date - Dec 22 , 2024 | 04:47 PM

హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఓ సంచలన వీడియో విడుదల చేశారు. ఘటన జరిగిన రోజు అసలు ఏం జరిగింది. పోలీసులు ఎలా వ్యవహారించారనే విషయాలతో కూడిన వీడియోను మీడియాకు రిలీజ్ చేశారు. పోలీసులు అల్లు అర్జున్‌కు ఓ మహిళ మృతి చెందిందనే విషయాన్ని తెలియజేశారని సీఎం రేవంత్ రెడ్డి శాసనసభ వేదికగా ప్రకటించగా..

Allu Arjun

సంధ్య థియేటర్‌లో తొక్కిసలాట ఘటన రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ ఘటనలో హీరో అల్లు అర్జున్ నిర్లక్ష్యం ఉందని పోలీసులు చెబుతుండగా, మరోవైపు తాను ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహారించానని అల్లు అర్జున్ చెబుతున్న వేళ హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఓ సంచలన వీడియో విడుదల చేశారు. ఘటన జరిగిన రోజు అసలు ఏం జరిగింది. పోలీసులు ఎలా వ్యవహారించారనే విషయాలతో కూడిన వీడియోను మీడియాకు రిలీజ్ చేశారు. పోలీసులు అల్లు అర్జున్‌కు ఓ మహిళ మృతి చెందిందనే విషయాన్ని తెలియజేశారని సీఎం రేవంత్ రెడ్డి శాసనసభ వేదికగా ప్రకటించగా.. అల్లు అర్జున్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించారు. తనకు మహిళ చనిపోయిన విషయం మరుసటి రోజు తెలిసిందని చెప్పారు. ఈ విషయంపై పోలీసులు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆరోజు విధుల్లో ఉన్న ఏసీపీ, డీసీపీతో కలిసి సీపీ సీవీ ఆనంద్ మీడియా సమావేశం నిర్వహించారు. డిసెంబర్4 రాత్రి సంధ్య థియేటర్ సమీపంలో భారీగా ఫ్యాన్స్ తరలిరావడంతో తొక్కిసలాట జరిగిందని, ఆ సమయంలో థియేటర్ మేనేజర్ నిర్లక్ష్యంగా వ్యవహారించారని పోలీసులు తెలిపారు. ఘటన నేపథ్యంలో బాలుడికి పోలీసులు సీపీఆర్ చేసిన తీరును వీడియోలో చూపించారు. కేసుకు సంబంధించి విచారణ జరుగుతోందని హైకోర్టులో కేసు ఉండటంతో ఎక్కువ విషయాలు కేసు గురించి మాట్లాడలేమని సీపీ తెలిపారు.


ఏసీపీ ఏం చెప్పారంటే..

డిసెంబర్4వ తేదీన సంధ్య థియేటర్‌కు అల్లు అర్జున్ రావడంతో భారీగా అభిమానులు తరలివచ్చారని, థియేటర్ లోపలకు వెళ్లేందుకు, హీరోను చూసేందుకు ఫ్యాన్స్ ప్రయత్నించడంతో తోపులాట జరిగిందని ఏసీపీ చెప్పారు. తోపులాటలో దురదృష్టవశాత్తు ఓ మహిళ మృతి చెందిందని, ఓ బాలుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారనే విషయాన్ని అల్లు అర్జున్ మేనేజర్‌ సంతోష్‌కు చెప్పామన్నారు. అల్లు అర్జున్‌కు విషయం చెప్పేందుకు ప్రయత్నించగా థియేటర్ యాజమాన్యం, మేనేజర్ అంగీకరించలేదని, తాము సమాచారం చేరవేస్తామని చెప్పి చేరవేయలేదన్నారు. తొక్కిసలాట తర్వాత థియేటర్ నుంచి బయటకు వెళ్లిపోవాలని అల్లు అర్జున్‌కు ఎంత చెపపినా వినిపించుకోలేదన్నారు. డీసీపీ ఆదేశాలతో తాను అల్లు అర్జున్ దగ్గరకు వెళ్లి విషయం చెప్పామన్నారు. సినిమా చూసిన తర్వాత వెళ్తానని చెప్పారని, ఆ తర్వాత 10 నుంచి 15 నిమిషాల సమయం ఇచ్చామన్నారు. చివరకు డీసీపీతో వెళ్లి అల్లు అర్జున్‌ను బయటకు తీసుకువచ్చామని ఏసీపీ తెలిపారు.


ఎస్‌హెచ్‌వో ఆవేదన

ఈ ఘటనపై చిక్కడపల్లి స్టేషన్ హౌస్ ఆఫీసర్ మాట్లాడుతూ.. ఘటనను తన కళ్లతో చూశానని, ఎంతో బాధ వేస్తోందనద్నారు. ఎంతో ప్రయత్నించినా ప్రాణాన్ని కాపాడలేకపోయినట్లు తెలిపారు. ఆ బాధను మాటల్లో చెప్పలేనన్నారు. పిల్లాడు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read More Latest Telugu News Click Here

Updated Date - Dec 22 , 2024 | 05:51 PM