Hyderabad: ఘోరం.. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య..
ABN, Publish Date - Oct 27 , 2024 | 09:47 AM
కర్ణాటక రాష్ట్రం కొడుగు కాఫీ ఎస్టేట్‌లో సగం కాలిన మృతదేహాన్ని కూలీలు గుర్తించారు. వెంటనే ఆ సమాచారాన్ని స్థానిక పోలీసులకు అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు.
హైదరాబాద్: మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అని మరోసారి రుజువు అయ్యింది. ఓ మహిళ ఆస్తి కోసం భర్తను హత్య చేసిన ఉదంతం హైదరాబాద్ నగరంలో వెలుగు చూసింది. ప్రియుడితో కలిసి పక్కా పథకం ప్రకారం భర్తను అతి కిరాతకంగా హత్య చేసింది. డబ్బులు కోసం విచక్షణ కోల్పోయి దారుణానికి ఒడికట్టింది.
కర్ణాటక రాష్ట్రం కొడుగు కాఫీ ఎస్టేట్‌లో సగం కాలిన మృతదేహాన్ని కూలీలు గుర్తించారు. వెంటనే ఆ సమాచారాన్ని స్థానిక పోలీసులకు అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హత్యకు గురైన వ్యక్తి హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త రమేశ్ కుమార్(54)గా పోలీసులు గుర్తించారు. వెంటనే బృందాలు ఏర్పడి విచారణ వేగవంతం చేశారు.
కేసు దర్యాప్తులో భాగంగా కర్ణాటక పోలీసులు సంచలన విషయాలు గుర్తించారు. ఆస్తి కోసం రమేశ్‌ను భార్య నిహారికనే హత్య చేసినట్లుగా తేల్చారు. రూ.8కోట్ల ఆస్తి కోసం ప్రియుడు డాక్టర్ నిఖిల్ మైరెడ్డితో కలిసి రమేశ్‌ను ఆమె హతమార్చినట్లు తెలిపారు. వీరిద్దరూ రాణా అనే మరో వ్యక్తి సహాయం తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ముగ్గురూ కలిసి ఉప్పల్- భువనగిరి ప్రాంతంలో వ్యాపారవేత్తను హత్య చేశారని కర్ణాటక పోలీసులు తెలిపారు. అనంతరం మృతదేహాన్ని నిందితులు మెర్సిడెస్ బెంజ్ కారులో కర్ణాటక పరిధిలోని కొడగు కాఫీ ఎస్టేట్‌కు తరలించారని పేర్కొన్నారు.
అక్కడ పెట్రోల్ పోసి నిప్పంటించి కాల్చివేసే ప్రయత్నం చేశారని వెల్లడించారు. దహనం చేసిన తర్వాత నిందితులు పరారయ్యారని తెలిపారు. అయితే హత్య అనంతరం రాణా అనే నిందితుడు హర్యానా రాష్ట్రానికి పారిపోగా, తమ బృందాలు ఓ టీ స్టాల్ వద్ద నిందితుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. నిహారిక యాదాద్రికి చెందిన మహిళ కాగా.. ఆమె ప్రియుడు డాక్టర్ నిఖిల్‌ది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లా అని కర్ణాటక పోలీసులు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి:
TG Police: 39 మంది కానిస్టేబుళ్ల సస్పెన్షన్..
TGRTC: ఇంటికే ఆర్టీసీ కార్గో...
Updated Date - Oct 27 , 2024 | 09:49 AM