ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

HYDRA: హైడ్రా కూల్చివేతలు మళ్లీ స్టార్ట్.. టెన్షన్ టెన్షన్

ABN, Publish Date - Dec 03 , 2024 | 05:13 PM

అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా.. అల్మాస్ గూడలో మంగళవారం ఉదయం నుంచి మొదలుపెట్టిన కూల్చివేతలు ఏకధాటిగా కొనసాగాయి. హైడ్రా కూల్చివేతలతో ప్రజలు భయాందోళలనలు చెందుతున్నారు.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో చెరువులపై అక్రమ నిర్మాణాల కూల్చివేతల కోసం కాంగ్రెస్ సర్కార్ (Congress Govt) తీసుకున్న సంచలన నిర్ణయమే హైడ్రా (HYDRA). ఎఫ్టీఎల్‌, బఫర్ జోన్ పరిధిలో ఉన్న చాలా అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చి వేసింది. రాష్ట్ర చరిత్రలోనే హైడ్రా ఏర్పాటు చేసిన 100 రోజుల వ్యవధిలోనే 300 అక్రమ నిర్మాణాలకు పైగా నేలమట్టం చేసింది. ప్రభుత్వ ఆస్తులు, చెరువుల పరిరక్షణ కోసం జూలై 19వ తేదీన హైడ్రాను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీవో 99ను తీసుకువచ్చింది. దీంతో జూలై 26 నుంచి కూల్చివేతలను మొదలుపెట్టింది హైడ్రా. ఇప్పటి వరకు 30 ప్రాంతాల్లో 300 ఆక్రమణలను కూల్చివేసింది. 100 రోజుల్లో 120 ఎకరాలను ప్రభుత్వానికి అప్పగింది. జీహెచ్‌ఎంసీతో పాటు 27 మున్సిపాలిటీలు, 33 గ్రామాల్లో హైడ్రా దూకుడు మామూలుగా లేదు. హీరో నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చివేతతో దేశవ్యాప్తంగా హైడ్రా పేరు మారుమోగిపోయింది.


అల్మాస్‌గూడలో హైడ్రా కూల్చివేతలు

బడంగ్ పేట మున్సిపల్ కార్పొరేషన్ అల్మాస్‌గూడలో ఇవాళ(మంగళవారం) హైడ్రా అధికారులు కూల్చివేతలు చేపట్టారు. అల్మస్‌గూడాలో కబ్జాకు గురైన పార్కును హైడ్రా అధికారులు కాపాడారు. పిల్లల ఆట పరికరాలను తొలగించి ఆ స్థలం తనదంటూ ఓ వ్యక్తి కంటైనర్ ఏర్పాటు చేయడంతో స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. వెంటనే స్థానికంగా లేఅవుట్లను పరిశీలించి.. పార్కు స్థలంగా హైడ్రా అధికారులు గుర్తించారు. కంటైనర్ తొలగించి పార్కు స్థలాన్ని కాలనీవాసులకు హైడ్రా అధికారులు అప్పగించారు.


తీవ్ర వ్యతిరేకత రావడంతో..

అయితే.. హైడ్రా కూల్చివేతలపై ప్రజలు హడెలెత్తిపోయారు. ఎప్పుడు ఎవరి ఇంటిని కూల్చివేస్తారో అని భయాందోళనలో గడిపారు ప్రజలు. హైడ్రా కూల్చివేతలపై పలు చోట్ల తీవ్రమైన వ్యతిరేకత కూడా వచ్చింది. పలువురు న్యాయస్థానాలను ఆశ్రయించగా.. హైడ్రా చట్టబద్ధతపై కోర్టు కూడా ప్రశ్నించింది. జీవో 99‌పై స్టే ఇవ్వాలంటూ అనేక మంది హైకోర్టులో పిటిషన్‌లు వేశారు. ఈ క్రమంలో హైడ్రాకు ఎదురవుతున్న ఆటంకాలు తొలగిస్తూ ప్రభుత్వం ప్రత్యేక ఆర్డినెన్స్ రూపకల్పన చేసింది. ఈ ఆర్డినెన్స్‌ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోద ముద్ర వేశారు.


ఏకధాటిగా కూల్చివేతలు..

నగరంలోని కూకట్‌పల్లి, అమీన్‌పూర్‌ మునిసిపాలిటీలోని కిష్టారెడ్డిపేట, పటేల్‌గూడలో ప్రభుత్వ భూముల్లోని నిర్మాణాలను హైడ్రా నేలమట్టం చేసిన విషయం తెలిసిందే. కూకట్‌పల్లి శాంతినగర్‌లోని నల్లచెరువు ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌ పరిధిలో నాలుగు ఎకరాల విస్తీర్ణంలో, కిష్టారెడ్డిపేటలోని ఎకరంపైగా, పటేల్‌గూడలోని మూడు ఎకరాలకుపైగా విస్తీర్ణంలోని నిర్మాణాలను కూల్చివేసింది. మూడు ప్రాంతాల్లోని 8ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఆక్రమణలు, భవనాలు తొలగించింది హైడ్రా. ఈ సమయంలో హైడ్రాపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. తమ సామాన్లను కూడా తీసుకునే సమయం ఇవ్వకుండా నిర్మాణాలు నేలమట్టం చేశారని బాధితులు లబోదిబోమన్నారు. అప్పులు చేసి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే తాము హైడ్రా చర్యతో రూ.లక్షల్లో నష్టపోయి రోడ్డున పడ్డాయని ఆవేదన చెందారు. అలాగే అమీన్ పూర్‌లో హైడ్రా బిగ్ ఆపరేషన్‌ను నిర్వహించింది. పగలు రాత్రి కూల్చివేతలు చేపట్టింది. దాదాపు17 గంటలపాటు హైడ్రా నాన్ స్టాప్ కూల్చివేతలు చేపట్టింది. ఓ హాస్పిటల్, రెండు అపార్ట్ మెంట్లు కూల్చివేసి ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుంది. పటేల్ గుడాలో 16 విల్లాలను కూల్చివేసింది.


పూర్తిస్థాయిలో బాధ్యతలు...

ఇటీవల ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ బాధ్యతలను పూర్తిస్థాయిలో హైడ్రాకు అప్పగిస్తూ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. గ్రేటర్ పరిధిలోని అక్రమ కట్టడాలన్నీ కూల్చివేసే పవర్ హైడ్రాకు ఇచ్చింది. ఈ మేరకు జీవో నెంబర్ 199ను ప్రభుత్వం విడుదల చేసింది. జీహెచ్ఎంసీ చట్టంలో పలుమార్పులు చేసింది. జీహెచ్ఎంసీ చట్టంలో మున్సిపల్ శాఖలో 374B ప్రత్యేక సెక్షన్ చేర్చింది. దీంతో బల్దియాతో పాటు 27 మున్సిపాలిటీలు, 33 గ్రామాల పరిధిలో హైడ్రా దూకుడు పెంచనుంది. ఇక నుంచి జీహెచ్ఎంసీ పరిధిలో ప్రభుత్వ ఆస్తులను పరిరక్షిస్తారు. అక్రమ కట్టడాలకు నోటిసులు జారీ నుంచి కూల్చివేతల వరకు అన్నీ హైడ్రా చేయనుంది.


హైడ్రాకు జీహెచ్ఎంసీ అధికారుల బదిలీ..

తాజాగా ప్రభుత్వ అనుమతితో కట్టిన నిర్మాణాలను కూల్చమని హైడ్రా స్పష్టం చేసింది. అలాగే జీహెచ్‌ఎంసీ పరిధిలోని పలు అధికారాలను హైడ్రాకు బదలాయిస్తూ రాష్ట్ర పురపాలక శాఖ ఉత్తర్వులు (జీవో-191) జారీ చేసింది. జీవో 191తో హైడ్రా కు ప్రభుత్వం ఫుల్ పవర్స్ ఇచ్చేసింది. జీహెచ్‌ఎంసీ చట్టంలోని 374 బీ అధికారులను హైడ్రాకు బదలాయిస్తూ తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకుంది. జీహెచ్‌ఎంసీ-1955 చట్టంలోని సెక్షన్‌ 374-బీ ప్రకారం చెరువులు, పార్కులు, ప్రభుత్వ ఖాళీ స్థలాలు, రోడ్లు, డ్రైన్‌ల పరిరక్షించాల్సి ఉంటుంది. ఈ అధికారాలను హైడ్రాకు బదిలీ చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం.. మంత్రివర్గ ఆమోదంతో ఆర్డినెన్సు ప్రతిపాదనలను గవర్నర్‌కు పంపింది. దీనిని ఆమోదిస్తూ ఈ నెల 3వ తేదీన గవర్నర్‌.. గెజిట్‌ విడుదల చేశారు. ఈ మేరకు తాజాగా పురపాలక శాఖ జీవో 191ను జారీ చేసింది. ఆర్డినెన్స్‌, జీవో జారీతో హైడ్రా చర్యలకు సంబంధించి న్యాయపరమైన ఇబ్బందులు ఉండవని అధికార వర్గాలు చెబుతున్నాయి. దీంతో పాటు సిటీలో వరద ముంపు సమస్య పరిష్కారం, ట్రాఫిక్ నియంత్రణ, చెట్ల సంరక్షణపైనా హైడ్రా ఫోకస్ చేయనుంది.


ఈ వార్తలు కూడా చదవండి...

BRS: కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ఆసక్తికర కామెంట్స్

MLA: ‘పది’ విద్యార్థులకు బంపరాఫర్ ఇచ్చిన ఎమ్మెల్యే.. అదేంటో తెలిస్తే..

Pushpa‌ 2: పుష్ప 2 టికెట్ ధరలు పెంపుపై హైకోర్టులో విచారణ.. ఏం జరిగిందంటే..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Dec 03 , 2024 | 05:17 PM