ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Delhi Liquor Case: ఢిల్లీ మద్యం మనీలాండరింగ్‌ కేసులో కీలక అప్డేట్

ABN, Publish Date - May 10 , 2024 | 06:08 PM

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో (Delhi Scam Liquor Case) మార్చి 15న కవితను అరెస్టు చేసి... మరుసటి రోజు రౌస్‌ అవెన్యూ సీబీఐ కోర్టు ముందు ఈడీ హాజరుపరిచిన విషయం తెలిసిందే. అయితే ఈ రోజు(శుక్రవారం) ఈ కేసులో ఎన్‌ఫోర్సమెంట్‌ డైరక్టరేట్‌ - ఈడీ ఏడో ఛార్జిషీట్‌ దాఖలు చేసింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, మరో నలుగురు నిందితుల పాత్రపై దర్యాప్తు సంస్థ ఛార్జీషీట్‌ దాఖలు చేసినట్లు తెలుస్తోంది.

ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో (Delhi Scam Liquor Case) మార్చి 15న కవితను అరెస్టు చేసి... మరుసటి రోజు రౌస్‌ అవెన్యూ సీబీఐ కోర్టు ముందు ఈడీ హాజరుపరిచిన విషయం తెలిసిందే. అయితే ఈ రోజు(శుక్రవారం) ఈ కేసులో ఎన్‌ఫోర్సమెంట్‌ డైరక్టరేట్‌ - ఈడీ ఏడో ఛార్జిషీట్‌ దాఖలు చేసింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, మరో నలుగురు నిందితుల పాత్రపై దర్యాప్తు సంస్థ ఛార్జీషీట్‌ దాఖలు చేసినట్లు తెలుస్తోంది.


Delhi Liquor Case: కవితకు జ్యుడీషియల్ కస్టడీని పొడిగించిన కోర్టు

ఢిల్లీ మద్యం విధానం కేసులో సూత్రధారి, పాత్రధారి కవిత అని వాదనల సందర్భంగా ఈడీ కోర్టుకు చెప్పింది. దర్యాప్తు కొనసాగుతోందని, విచారణలో భాగంగా సప్లిమెంటరీ ఛార్జిషీట్‌ దాఖలు చేస‌్తున్నట్లు కోర్టుకు ఈడీ తెలిపింది. కవిత, ఛన్‌ప్రీత్‌ సింగ్‌, దామోదర్‌ శర్మ, ప్రిన్స్‌ కుమార్‌, అర్వింద్‌ సింగ్‌ల పాత్రపై సప్లిమెంటరీ ఛార్జిషీట్‌ దాఖలు చేసింది. 10 రోజుల కస్టడీ అనంతరం... మార్చి 26 నుంచి జ్యుడీషియల్‌ కస్టడీలో తీహాడ్‌ జైల్లో కవిత ఉంటున్నారు.


కాగా... ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో (Delhi Scam Liquor Case) అరెస్ట్ అయ్యి ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై నేడు (శుక్రవారం) ఢిల్లీ హైకోర్టులో విచారణ ముగిసింది. కవిత బెయిల్ పిటిషన్‌పై తదుపరి విచారణను మే 24కు వాయిదా వేస్తూ కోర్టు నిర్ణయించింది. కవిత బెయిల్ పిటిషన్‌పై వాదనలకు ఈడీ సమయం కోరడంతో కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.ఈ కేసులో తనపై నమోదైన మనీ లాండరింగ్ కేసులో ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో మార్చి 15న కవిత అరెస్టయ్యారు. ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా తీహార్ జైలులో ఆమె తీహార్ జైలులో ఉన్న విషయం తెలిసిందే.

Delhi Liquor Case: ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై కీలక అప్‌డేట్

Updated Date - May 10 , 2024 | 06:13 PM

Advertising
Advertising