Hussain Sagar: నిండుకుండలా హుస్సేన్ సాగర్.. ప్రజలను అలర్ట్ చేసిన అధికారులు
ABN, Publish Date - Aug 20 , 2024 | 12:09 PM
హైదరాబాద్‌లో నిన్నటి నుంచి కురుస్తున్న వర్షాలకు హుస్సేన్‌సాగర్ నిండుకుండలా మారింది. ఎగువ ప్రాంతాల నుంచి హుస్సేన్ సాగర్‌కు వరద భారీగా పోటెత్తుతుంది. హుస్సేన్ సాగర్ వద్ద నీటిమట్టాన్ని జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీలత అధికారులు పరిశీలించారు.
హైదరాబాద్: హైదరాబాద్‌లో నిన్నటి నుంచి కురుస్తున్న వర్షాలకు హుస్సేన్‌సాగర్ నిండుకుండలా మారింది. ఎగువ ప్రాంతాల నుంచి హుస్సేన్ సాగర్‌కు వరద భారీగా పోటెత్తుతుంది. హుస్సేన్ సాగర్ వద్ద నీటిమట్టాన్ని జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీలత అధికారులు పరిశీలించారు. సాగర్ దిగువన ఉన్న కాలనీలోని ప్రజలను అప్రమతంగా ఉండాలంటూ హెచ్చరికలు జారీ చేశారు.
బంజారా, పికెట్, కూకట్‌పల్లి నాలాల నుంచి హుస్సేన్ సాగర్‌లోకి వరద భారీగా వస్తుంది. సాగర్‌లో ఫుల్ ట్యాంక్ లెవెల్‌కు నీటి మట్టం చేరింది. హుస్సేన్ సాగర్ ప్రస్తుత 513.40 మీటర్ల నీటిమట్టం ఉంది. హుస్సేన్ సాగర్ ఫుల్ ట్యాంక్ లెవెల్ 513.41 మీటర్లు నిండుకుంటుంది. ప్లువీస్ గేట్ ఓపెన్ చేసి మూసీలోకి అధికారులు నీటిని విడుదల చేశారు.
అలాగే తూముల ద్వారా హుస్సేన్ సాగర్ నుంచి నీటిని మూసీలోకి అధికారులు వదులుతున్నారు. హుస్సేన్ సాగర్ నీటి మట్టాన్ని ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షిస్తున్నారు. హుస్సేన్ సాగర్ ఇన్ ఫ్లో 1850 క్యూసెక్కులు కాగా... ఔట్ ఫ్లో 1600 క్యూసెక్కులుగా ఉంది. మూసీ పరివాహక ప్రాంత ప్రజలను జీహెచ్ఎంసీ అప్రమత్తం చేసింది.
Updated Date - Aug 20 , 2024 | 12:13 PM