ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Kavitha: కవితకు 'ఈడీ' మరో ఊహించని షాక్!

ABN, Publish Date - Mar 24 , 2024 | 03:16 PM

Kavitha Arrest: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవితను (MLC Kavitha) ఈడీ ఇప్పట్లో వదిలేలా లేదు.!. లెక్కలు తేల్చాల్సిందేనని గట్టిగానే ఉన్నారు అధికారులు. ఇప్పటికే ఈడీ సమన్లు ఇవ్వడం, విచారణ, అరెస్ట్.. కస్టడీ.. మళ్లీ సోదాలు ఇలా వరుస షాకులిచ్చిన అధికారులు త్వరలో మరో కీలక పరిణామంతో తెలంగాణలోకి రాబోతున్నట్లుగా తెలుస్తోంది..

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవితను (MLC Kavitha) ఈడీ ఇప్పట్లో వదిలేలా లేదు.!. లెక్కలు తేల్చాల్సిందేనని గట్టిగానే ఉన్నారు అధికారులు. ఇప్పటికే ఈడీ సమన్లు ఇవ్వడం, విచారణ, అరెస్ట్.. కస్టడీ.. మళ్లీ సోదాలు ఇలా వరుస షాకులిచ్చిన అధికారులు త్వరలో మరో కీలక పరిణామంతో తెలంగాణలోకి రాబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటి వరకూ హైదరాబాద్ వేదికగా కవిత ఇంట్లో, బంధువుల ఇళ్లలో వరుస సోదాలు నిర్వహించిన ఈడీ.. కీలక పత్రాలు స్వాధీనం చేసుకోవడం, కస్టడీలో జరిగిన విచారణలోనూ కీలక సమాచారం సేకరించినట్లుగా తెలుస్తోంది. తవ్వేకొద్దీ కవితకు సంబంధించిన లింకులన్నీ ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. అందుకే ఇక మరింత స్పీడ్ పెంచి నిజామాబాద్‌పై ఫుల్ ఫోకస్ ఈడీ (ED) ఫోకస్ పెట్టిందని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి.

AP Elections: ఓటమికంటే జగన్‌ను వెంటాడుతున్న మరో భయం!?


లెక్కలు తీస్తున్నారు..!

నిజామాబాద్‌లో కవితకు ఉన్న ఆస్తులెన్ని..? ఏయే వ్యాపారాల్లో భాగస్వామిగా ఉన్నారు..? కవిత బినామీలు ఎవరు..? ఇలా అన్ని కోణాల్లోనూ ఈడీ సోదాలు జరపబోతున్నట్లు లీకులు వస్తున్నాయి. అయితే.. ఈ మధ్య జరిగిన సోదాలతో నిజామాబాద్‌కు లింకులు ఉన్నాయని తెలియవచ్చింది. దీంతో కవిత ఆస్తుల వ్యవహారాలపై సెంట్రల్ ఇంటెలిజెన్స్ వర్గాలు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. ఇది పూర్తవ్వగానే.. కవితకు ఎక్కడెక్కడ వ్యాపారాలు ఉన్నాయని ఆరా తీసేందుకు ఈడీ రంగం సిద్ధం చేసిందట. అంతేకాదు.. కవిత భర్త, బంధువులు, కవితకు సన్నిహితంగా ఉండే వారి వివరాలను సైతం వెలికితీస్తున్నారు. ఇప్పటికే కవిత మేనల్లుడు మేక శరణ్ పేరు తెరపైకి రావడం.. విచారణలో అతనెవరు అని అడిగితే ఎలాంటి సమాధానం రాకపోవడంతో ఈడీ అధికారులకు మరిన్ని సందేహాలు వస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే మళ్లీ సోదాలు షురూ చేయాలని ఈడీ అధికారులు భావిస్తున్నారట. మొత్తానికి చూస్తే.. కవిత త్వరలోనే మరో ఝలక్ తగలనుందని స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Mar 24 , 2024 | 03:16 PM

Advertising
Advertising