ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Jaggareddy: అప్పుడు ఆయన కాళ్లు మొక్కి.. ఇప్పుడు విమర్శలా..?

ABN, Publish Date - Jan 26 , 2024 | 08:47 PM

ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యమకారులపై ఒక్క బుల్లెట్ వాడకుండా.. కాంగ్రెస్ పార్టీ సహకరించిందని కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి (Jaggareddy) అన్నారు.

హైదరాబాద్: ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యమకారులపై ఒక్క బుల్లెట్ వాడకుండా.. కాంగ్రెస్ పార్టీ సహకరించిందని కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి (Jaggareddy) అన్నారు. శుక్రవారం నాడు గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఉద్యమంలో కాంగ్రెస్ పెద్దన్న పాత్ర పోషించిందని.. లబ్ధి పొందింది మాత్రం మాజీ సీఎం కేసీఆర్ అని చెప్పారు. పోరాటంలో భాగంగానే సమష్టి నిర్ణయం మేరకు జేఏసీ ఏర్పడిందని తెలిపారు. పెద్ద మనిషిగా ఆ రోజు జేఏసీ చైర్మన్‌గా కోదండరాంను పెట్టినట్లు గుర్తుచేశారు. తెలంగాణ ఉద్యమంలో కోదండరాం.. భీష్మ పాత్ర పోషించారని తెలిపారు. మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు.. ఈ రోజు కోదండరాం ఎమ్మెల్సీ నిర్ణయంపై వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఉద్యమ సమయంలో వారు కోదండరాన్ని దేవుడిలా భావించి కాళ్లు మొక్కారని.. ఇప్పుడు విమర్శలు చేస్తున్నారన్నారు. 9 ఏళ్ల కాలంలో కోదండరాంకు కనీసం ఒక్క అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా అవమానించారని జగ్గారెడ్డి ధ్వజమెత్తారు.

తాము దాదాగిరి చేస్తే తట్టుకోలేరు

బీఆర్ఎస్ తొమ్మిదేళ్ల కాలంలో చేయలేని పనిని రేవంత్ చేశాడని..కేటీఆర్‌, హరీష్ రావుకు సిగ్గనిపిస్తాలేదా అని ప్రశ్నించారు. కోదండరాంను ఎమ్మెల్సీగా అమోదించి నందుకు..గవర్నర్‌ను కాంగ్రెస్ తరపున అభినందిస్తున్నానని తెలిపారు. గవర్నర్ నిర్ణయాన్ని తెలంగాణ ప్రజలు హర్షిస్తున్నారన్నారు. కేసీఆర్, హరీష్ రావులు.. ఈ నిర్ణయం పట్ల గవర్నర్‌కు కృతజ్ఞతలు తెలపాలన్నారు. తాము తొడ కొడితే కేటీఆర్ గుండె అదురుతది.. తాము దాదాగిరి చేస్తే తట్టుకోలేవని హెచ్చరించారు. జగ్గారెడ్డికి అధికారం లెకముందే.. నా తడాక చూపించానని హెచ్చరించారు. బీజేపీ, కాంగ్రెస్‌లు రాజకీయంగా బద్ధ శత్రువులని చెప్పారు. ఢిల్లీ లిక్కర్ కేసులో కవితను ఎందుకు అరెస్ట్ చేయలేదని నిలదీశారు. బీజేపీతో ఫెవికల్ బంధం కేసీఆర్‌దా.. కాంగ్రెస్ దా అనేది తెలంగాణ ప్రజలకు తెలుసునని జగ్గారెడ్డి అన్నారు.

Updated Date - Jan 26 , 2024 | 08:47 PM

Advertising
Advertising