Jaggareddy: కూల్చివేతల పేరిట అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించకండి.. జగ్గారెడ్డి వార్నింగ్
ABN, Publish Date - Sep 29 , 2024 | 10:31 PM
హైడ్రా అధికారులకు సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అల్టిమేటం జారీ చేశారు. హైడ్రా పేరుతో సంగారెడ్డి నియోజకవర్గ ప్రజల్లో అనవసర భయాందోళనలు సృష్టించకండి అని హెచ్చరించారు. సంగారెడ్డి నియోజకవర్గంలో కూల్చివేతల పేరిట అధికారులు అతుత్సాహం ప్రదర్శించకండి అని అన్నారు.
సంగారెడ్డి జిల్లా: హైడ్రా అధికారులకు సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అల్టిమేటం జారీ చేశారు. హైడ్రా పేరుతో సంగారెడ్డి నియోజకవర్గ ప్రజల్లో అనవసర భయాందోళనలు సృష్టించకండి అని హెచ్చరించారు. సంగారెడ్డి నియోజకవర్గంలో కూల్చివేతల పేరిట అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించకండి అని జగ్గారెడ్డి అన్నారు.
ఇవాళ(ఆదివారం) గాంధీభన్‌లో జగ్గారెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. హైడ్రా ఔటర్ రింగ్ రోడ్డు లోపలికే పరిమితమని చెప్పారు. ఏదైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలకు హైడ్రా విషయంలో ఎలాంటి భయాందోళనలు అక్కర్లేదని స్పష్టం చేశారు.సంగారెడ్డి ప్రజలకు తాను అండగా ఉంటానని జగ్గారెడ్డి హామీ ఇచ్చారు.
ప్రజల్లో అవగాహన కల్పించాల్సింది..
కూలగొట్టే ముందు హైడ్రా అక్కడి వాస్తవ పరిస్థితులు ప్రజలకు తెలియజేస్తే ఇంత ఇబ్బంది అయ్యేది కాదని ఎమ్మెల్యే దానం నాగేందర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. చిన్న చిన్న ఘటనలు ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తున్నాయన్నారు. ఒక చిన్నారి తన పుస్తకాలు ఇంట్లో ఉన్నాయని బోరున ఎడ్చిందని... ఈ ఘటన తనకు చాలా బాధ అనిపించిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇలాంటి పనులు చేసినప్పుడు ఎవరూ మాట్లాడలేదని అన్నారు.
నిజనిర్దారణ కమిటీ వేయాలి..
హైడ్రా కూల్చివేతలపై నిజనిర్దారణ కమిటీ వేయాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరుతానని, హైడ్రా కాస్త ముందే మెల్కోంటే ప్రజల్లో అభద్రతా భావం వచ్చేది కాదని ఎమ్మెల్యే దానం నాగేందర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. మూసీలో ఆక్రమణలు ఉన్నాయని మంత్రిగా కేటీఆర్ చెప్పలేదా అని ప్రశ్నించారు. అక్రమకట్టడాలను కూల్చేస్తామని కేసీఆర్ ప్రకటించిన విషయాన్ని మర్చిపోయారా అని నిలదీశారు. అక్రమ కట్టడాలకు బీఆర్ఎస్ హాయాంలో విచ్చలవిడిగా పర్మిషన్ ఇచ్చారని, కూల్చివేతలపై కాంగ్రెస్ పార్టీ కూడా మరింత లోతుగా ప్రజలకు అవగాహన కల్పించాలని ఎమ్మెల్యే దానం నాగేందర్ సూచించారు.
పేదల ఇళ్లను కూల్చకూడదు..
మూసీ సుందరీకరణ పేరుతో పేదల ఇళ్లను కూల్చడం సరికాదని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. మురికివాడల జోలికి వెళ్లొద్దని ముందే చెప్పానని.. జలవిహార్, ఐమాక్స్ లాంటివి చాలా ఉన్నాయన్నారు. మూసీ నిర్వాసితులకు కౌన్సిలింగ్ ఇచ్చి.. ప్రత్యామ్నాయ ఏర్పాట్ల తర్వాత ఖాళీ చేయించాల్సిందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇళ్లకు రెడ్‌మార్క్ చేయడం కచ్చితంగా తొందరపాటు చర్యే అని అన్నారు. కూల్చిన ఇళ్లకు అక్కడే నివాసాలు కల్పిస్తే మంచిదని, ఈ అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళతానని దానం నాగేందర్ అన్నారు.
Updated Date - Sep 29 , 2024 | 10:39 PM