ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

KAVITHA: కేసీఆర్ జోలికి వస్తే తాటతీస్తాం.. కవిత మాస్ వార్నింగ్

ABN, Publish Date - Dec 02 , 2024 | 08:07 PM

బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపై కేసులు పెట్టి వేధిస్తే ఊరుకోబోమని ఎమ్మెల్సీ కవిత హెచ్చరించారు. ముఖ్యమంత్రి, మంత్రులు అదే పనిగా తిట్ల పరిపాలన చేస్తున్నారని ఎద్దేవా చేశారు. జిల్లాల్లో పర్యటిస్తానని బీఆర్ఎస్ శ్రేణులు అండగా ఉంటానని అధైర్యపడవద్దని కవిత చెప్పారు.

హైదరాబాద్: తమ పార్టీ శ్రేణులపై కేసులు పెట్టి వేధిస్తే ఊరుకోమని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వార్నింగ్ ఇచ్చారు. కేసీఆర్ మొక్క అని రేవంత్ వ్యాఖ్యానించడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. కేసీఆర్ మొక్క కాదు పీకేయడానికి.. కేసీఆర్ ఒక వేగు చుక్క అని ఉద్ఘటించారు. రేవంత్ గురువులకే చుక్కలు చూపించి..తెలంగాణ సాధించిన శక్తి కేసీఆర్‌ అని తెలిపారు. కేసీఆర్ పాలనలో నిధులు వరదలై పారేవని... ఇప్పుడు తెలంగాణలో తిట్లు పారుతున్నాయని ఎమ్మెల్సీ కవిత ఎద్దేవా చేశారు. ఎమ్మెల్సీ కవిత నివాసంలో కోరుట్ల నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం ఇవాళ(సోమవారం) జరిగింది. ఈ సమావేశంలో జగిత్యాల జిల్లా అధ్యక్షుడు విద్యాసాగరరావు, కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు.


బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపై కేసులు పెట్టి వేధిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. ముఖ్యమంత్రి, మంత్రులు అదే పనిగా తిట్ల పరిపాలన చేస్తున్నారని ఎద్దేవా చేశారు. జిల్లాల్లో పర్యటిస్తానని బీఆర్ఎస్ శ్రేణులు అండగా ఉంటానని అధైర్యపడవద్దని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుతామని అన్నారు. డిసెంబర్ 4నుంచి 8వ తేదీ వరకు పలు జిల్లాల్లో పర్యటిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ జాగృతి ఉమ్మడి జిల్లాల వారీగా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కవిత అధ్యక్షతన ఈ సమావేశాలు జరగనున్నాయి. ఈ మేరకు ఓ షెడ్యూల్‌ను ప్రకటించారు. డిసెంబర్ 4వ తేదీన వరంగల్ - నిజామాబాద్, డిసెంబర్ 5న కరీంనగర్- నల్గొండ, డిసెంబర్ 6న రంగారెడ్డి - ఆదిలాబాద్, డిసెంబర్ 7న హైదరాబాద్ - ఖమ్మం, డిసెంబర్ 8న మెదక్ - మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో కవిత పర్యటనలు ఉండనున్నాయి.

Updated Date - Dec 02 , 2024 | 08:07 PM