ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: వారిని బయటకు తీసుకువచ్చే వరకూ పోరాటం చేస్తాం: కేటీఆర్..

ABN, Publish Date - Dec 07 , 2024 | 03:04 PM

బీఆర్ఎస్ పుట్టిన తర్వాత పార్టీ ఇప్పుడే అత్యంత గడ్డుకాలాన్ని ఎదుర్కొంటుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. గత ఎన్నికల్లో తాము అధికారం మాత్రమే కోల్పోయామని, కానీ నాయకులు, కార్యకర్తల్లో పోరాట పటిమ చావలేదని ఆయన చెప్పారు.

హైదరాబాద్: రానున్న అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారని మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. రేపు (ఆదివారం) పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కేసీఆర్ సంయుక్త సమావేశం నిర్వహిస్తారని కేటీఆర్ వెల్లడించారు. తెలంగాణ ప్రజా సమస్యలపై సభలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఆయన చెప్పారు. ఆశావర్కర్ల సమస్యలపై సైతం అసెంబ్లీలో చర్చ లేవనెత్తుతామని ఆయన అన్నారు. కళాకారులు, పుస్తకాలు, వివిధ రూపాల్లో ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్ వద్ద కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.


ఆ పరిస్థితి ఇప్పుడే వచ్చింది..

బీఆర్ఎస్ పుట్టిన తర్వాత పార్టీ ఇప్పుడే అత్యంత గడ్డుకాలాన్ని ఎదుర్కొంటుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. గత ఎన్నికల్లో తాము అధికారం మాత్రమే కోల్పోయామని, కానీ నాయకులు, కార్యకర్తల్లో పోరాట పటిమ చావలేదని ఆయన చెప్పారు. గతేడాది తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో తాము ఊహించని ఫలితాలు వచ్చాయన్నారు కేటీఆర్. కాంగ్రెస్ అడ్డగోలు హామీల వల్లే తాము అధికారం కోల్పోయామని చెప్పారు. కేవలం నాలుగు లక్షల ఓట్లు మాత్రమే కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్‌కు తక్కువగా వచ్చాయన్నారు. కేసీఆర్ తొంటి ఎముక విరగటం, పార్లమెంట్ ఎన్నికల ముందు కవిత జైలుకు వెళ్లడంతో ఇబ్బందులు పడ్డామని చెప్పారు. పది మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడినా.. ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటామని అన్నారు. పోరాటాల నుంచే బీఆర్ఎస్ పుట్టుకొచ్చిందని ఆయన చెప్పారు.


బిల్లులు చెల్లించరా?

కాంగ్రెస్ ప్రభుత్వంపై తెలంగాణలో వ్యతిరేకత పెరిగిందని మాజీ మంత్రి కేటీఆర్ చెప్పారు. మూడు నాలుగేళ్ల తర్వాత వచ్చే వ్యతిరేకత ఏడాది లోపలే వచ్చిందని అన్నారు. రానున్న ఎన్నికల్లో కొంచెం కష్టపడితే అధికారం బీఆర్ఎస్‌దే అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అధికారంలో ఉండి కూడా గాంధీ భవన్ బోసిపోతోందని మాజీ మంత్రి ఎద్దేవా చేశారు. కానీ తెలంగాణ భవన్ మాత్రం కళకళలాడుతోందని చెప్పారు. లగచర్ల బాధితులను త్వరలో బయటకు తీసుకొస్తామని కేటీఆర్ చెప్పారు. తాజా మాజీ సర్పంచ్‌లకు అండగా ఉంటామని ఆయన ఉద్ఘాటించారు. రానున్న పంచాయతీ ఎన్నికల లోపే బిల్లులు ఇప్పించాలని మాజీ సర్పంచ్‌లు కోరుతున్నారని చెప్పారు. వారి కోరిక మేరకు బిల్లులు వెంటనే చెల్లించాలని మాజీ మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు.


ఇవి కూడా చదవండి...

CM REVANTH REDDY: అవనిపై అగ్ర భాగాన తెలంగాణను నిలుపుతా

Hyderabad: హైదరాబాద్‌ను దేశ 2వ రాజధానిగా ప్రకటించాలి..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Dec 07 , 2024 | 03:08 PM