ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Srinivas Goud: కుల గణన సర్వే కోసం ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలి

ABN, Publish Date - Nov 02 , 2024 | 02:15 PM

బీసీ కులగణనలో భవిష్యత్‌లో ఎలాంటి న్యాయపరమైన చిక్కులు తలెత్తినా రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తాము న్యాయనిపుణులతో చర్చించి డ్రాఫ్ట్ రూపొందించామని తెలిపారు. ఆ చట్టంతో బీసీ కులగణనకు ఎలాంటి చిక్కులు రావు దాన్ని ప్రభుత్వానికి పంపుతామని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.

హైదరాబాద్: బీసీ కుల గణనకు రాజ్యాంగంలో కల్పించిన ఆర్టికల్ నెంబర్ 242 ,343ల ప్రకారం పకడ్భందీగా అమలు చేయాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిందని అన్నారు. చాలా రోజుల తర్వాత బీసీ జనాభా లెక్కించడానికి బీసీ కమిషన్ ఏర్పాటు చేశారని చెప్పారు. ఇవాళ(శనివారం) తెలంగాణ భవన్‌లో శ్రీనివాస్‌గౌడ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ... తెలంగాణ హైకోర్టు కులగణన సర్వే కోసం ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని సూచించిందని అన్నారు. చట్టాన్ని తయారు చేసుకోకుండా సర్వే చేస్తున్నారని శ్రీనివాస్ గౌడ్ అన్నారు.


రెండు వేర్వేరు జీవోలు ఇచ్చారని చెప్పారు. మళ్లీ కాలయాపన జరిగే ప్రమాదం ఉందని అట్టడుగు వర్గాల్లో ఆందోళన ఉందని చెప్పారు. బీహార్, మహారాష్ట్ర, కర్ణాటకలో చేసిన కుల గణనపై చేసిన తప్పిదాలే ఇక్కడ చేస్తున్నారని.. అది సమంజసం కాదని చెప్పారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ కుల గణన ఓ ఎక్స్ రే లాంటిదని అంటున్నారు ..తాము ఎంఆర్ఐ లాంటిదని తాము అంటున్నామని శ్రీనివాస్ గౌడ్ అన్నారు.


కులాలు ,ఉపకులాల జనాభా సర్వేతో కచ్చితంగా తేలుతుందని తెలిపారు. తప్పిదాలు చేయకుండా సెన్సస్ జాగ్రత్తగా చేయాలని సూచించారు. బీసీ కమిషన్ జిల్లాల్లో పర్యటనలను జిల్లా కలెక్టర్లు ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. బీసీ కమిషన్‌ను అవమానించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. లీగల్‌‌గా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. సుప్రీంకోర్టు , హైకోర్టు మాజీ న్యాయ మూర్తులతో సమావేశం ఏర్పాటు చేసి సలహాలు తీసుకోవాలని తెలిపారు. అఖిలపక్ష సమావేశం , ఆసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేసి కుల గణనకు ఎలాంటి అడ్డంకులు లేకుండా చేసుకోవాలని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.


భవిష్యత్‌లో ఎలాంటి న్యాయపరమైన చిక్కులు తలెత్తినా రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు. తాము న్యాయనిపుణులతో చర్చించి డ్రాఫ్ట్ రూపొందించామని వివరించారు. ఆ చట్టంతో బీసీ కులగణనకు ఎలాంటి చిక్కులు రావు దాన్ని ప్రభుత్వానికి పంపుతామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం జనగణనకు చట్ట బద్ధత కల్పించినట్లే బీసీ కుల గణనకు చట్టబద్దత ఉండాలని కోరారు. రేవంత్ ప్రభుత్వం భేషజాలకు పోకుండా తమ సూచనలు, సలహాలు పరిగణనలోకి తీసుకోవాలని శ్రీనివాస్ గౌడ్ కోరారు.

Updated Date - Nov 02 , 2024 | 02:48 PM