ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Kishan Reddy: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై కిషన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు

ABN, Publish Date - Oct 27 , 2024 | 03:14 PM

దేశాభివృద్ధిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ది కీలక పాత్ర అని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి తెలిపారు. అడ్వాన్స్‌డ్ టెక్నాలజీతో వినియోగదారులకు మరిన్ని సేవలు అందుబాటులోకి వచ్చాయని కిషన్‌రెడ్డి వెల్లడించారు.

హైదరాబాద్: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మీ సేవల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అడ్వాన్స్‌డ్ టెక్నాలజీని వీలైనంత ఎక్కువగా వినియోగించాలని సూచించారు. దేశాభివృద్ధిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ది కీలక పాత్ర అని వివరించారు. అడ్వాన్స్‌డ్ టెక్నాలజీతో వినియోగదారులకు మరిన్ని సేవలు అందుబాటులోకి వచ్చాయని వెల్లడించారు. సికింద్రాబాద్, సిక్ విలేజ్, గాయత్రీ గార్డెన్ LPG డిస్ట్రిబ్యూటర్స్ 2024- సమ్మిట్ ఇవాళ(ఆదివారం) జరిగింది. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.


ALSO READ: KTR.. ఈ అంశంలో రేవంత్ రెడ్డి రికార్డ్ సాధించారు: కేటీఆర్

కరోనా సమయంలో దీటుగా సేవలు...

సిలిండర్ బుక్ చేసుకోవడం, డెలివరీని ట్రాకింగ్ చేయడం, బిల్ పేమెంట్ చేయడం వంటి వాటిలో ఇప్పటికే సాంకేతికత వచ్చిందని గుర్తుచేశారు. ఎనర్జీ సెక్టార్‌లో సుస్థిరత కోసం ప్రభుత్వాలు లాంగ్-టర్మ్ కమిట్‌మెంట్ పూర్తి చేయడంలో సహకారం చాలా అవసరమని తెలిపారు. కరోనా సమయంలో ఫ్రంట్ లైన్ వర్కర్స్ దీటుగా ప్రజలకు ఇంటివద్దకే సిలిండర్లు అందించి సేవలు అందించారని తెలిపారు. వినియోగదారులకు భద్రతతో కూడిన సేవలు అందిస్తునందుకు అభినందించారు. వచ్చే 25సంవత్సరాల్లో భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలబెట్టాలనే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వం పని చేస్తుందని చెప్పారు. దేశంలోని 140కోట్ల మంది ప్రజల భాగస్వామ్యం మోదీ ప్రభుత్వానికి అవసరమని తెలిపారు. భారతదేశంలోయూత్ పాపులేషన్ ఎక్కువగా ఉందని అన్నారు. ఈ సమయంలో యువ శక్తిని వాడుకుని ప్రపంచంలోనే అగ్ర దేశంగా భారత్ ఎదగాలని అన్నారు. అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలంటే యువతతో పాటు డిస్టిబ్యూటర్స్ భాగస్వామ్యం కావాలని కిషన్‌రెడ్డి వెల్లడించారు.


మోదీ సర్కార్ లక్ష్యమిదే..

‘‘LPG అంటే ‘లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్’ అని అందరికీ తెలుసు. కానీ నా దృష్టిలో మాత్రం LPG అంటే ‘లైఫ్‌లైన్ ఫర్ ప్రాస్పరిటీ & గ్రోత్’ పేదల జీవితాల్లో వెలుగులు తీసుకురావడంతో LPG సిలిండర్ల పాత్ర కీలకం. కట్టెలపొయ్యి బాధ నుంచి విముక్తి కల్పిస్తూ.. ప్రజలందరి జీవితాల్లో వెలుగులు తీసుకొచ్చేదే LPG. అందరికీ.. LPG సదుపాయాన్ని కల్పించడం, మారుమూల ప్రాంతాల వారికి సిలిండర్లు చేరవేయడం పెద్ద టాస్క్. ఈ బిగ్ టాస్క్‌ను.. కంప్లీట్ చేయడంలో LPG అందిస్తున్న సంస్థలు పోషిస్తున్న పాత్రను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ప్రజలందరికీ అందుబాటు ధరల్లో, భద్రతతో కూడిన ఇంధనం అందుబాటులో ఉంచాలనేది మోదీ సర్కారు లక్ష్యం. ఎల్పీజీ ద్వారా కాలుష్య రహిత పద్ధతిలో వంట చేసుకోవడంతో పాటు ఆరోగ్యం కాపాడుకోవడం, పర్యావరణ పరిరక్షణ, కట్టెలు-కిరోసిన్ కోసం పరిగెత్తాల్సిన అవసరం లేకపోవడం, ఆర్థిక ప్రగతికి కూడా బాటలు పడతాయి. అందుకే.. LPG - ‘లైఫ్‌లైన్ ఫర్ ప్రాస్పరిటీ & గ్రోత్’ అని అన్నాను. కట్టెలపొయ్యి పొగతో మన దేశంలో పేద అక్కాచెల్లెళ్ల కళ్లలో నీళ్లు రాకూడదనే లక్ష్యంతో ప్రధాని మోదీ ‘ప్రధానమంత్రి ఉజ్వల యోజన’ పథకాన్ని తీసుకువచ్చారు. దేశవ్యాప్తంగా.. 10 కోట్లకు పైగా ఉన్న పేద మహిళలకు ‘ఉజ్వల పథకం’లో భాగంగా ఉచితంగా సిలిండర్ కనెక్షన్లు ఇచ్చారు. తెలంగాణ నుంచి 15 లక్షలకు పైగా మహిళా లబ్ధిదారులు ఉన్నారు. మహిళలకు పొగనుంచి విముక్తి.. స్వేచ్ఛను కల్పించినప్పుడే మొదట కుటుంబం, ఆ తర్వాత సమాజం ముందడుగు వేస్తుంది. అందుకే మోదీ మహిళాసాధికారత కల్పించే విషయంలో.. కట్టెలపొయ్యి నుంచి విముక్తికి ప్రయారిటీ ఇచ్చారు. మోదీ ఆలోచనకు మీరు కార్యరూపాన్ని ఇచ్చారు’’ అని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు..


అప్పుడే అభివృద్ధి చెందిన సమాజాన్ని నిర్మించుకోగలం

‘‘ఈ పథకం విజయవంతం కావడం వెనక మనం.. ‘ఎల్పీజీ సబ్సిడీ’ని స్వచ్ఛందంగా వదులుకున్న వారిని అభినందించాలి. ఈ వేదిక ద్వారా సబ్సిడీ వదులుకున్న వారందరికీ మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. సబ్సిడీని వారు వదులుకున్నందుకు.. పేదలకు ఉచితంగా, మధ్యతరగతికి సబ్సిడీతో సిలిండర్లు ఇవ్వడం వీలైంది. సమాజం భాగస్వామ్యం ఉంటే.. మన దేశాన్ని మరింత అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లవచ్చనే దానికి ఇదొక ఉదాహరణ. మన తోటివారికి ఎంత సహాయం చేస్తాం అనేదే.. మన దగ్గరున్న సంపదకు కొలమానం. డబ్బులున్న వారు.. పేదలకు ఇలాంటి సహాయం చేస్తున్నప్పుడే.. మనం బలమైన, అభివృద్ధి చెందిన సమాజాన్ని నిర్మించుకోగలం. ‘ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన’ పథకం ద్వారా.. దాదాపు 30 కోట్ల మంది ఉజ్వల లబ్ధిదారులకు.. కరోనా సమయంలో ఉచితంగా ఎల్పీజీ రీఫిల్స్ ఇచ్చాం. వీటిని కరోనా సమయంలో ప్రజలకు చేరవేయడంలో LPG అందిస్తున్న సంస్థల సహకారాన్ని దేశం ఎప్పటికీ మరిచిపోదు. కన్జూమర్ సర్వీస్, సెక్యూరిటీ చెకప్స్ వంటివాటిలో మీపై చాలా ఒత్తిడి ఉంటుంది. అయినా రాజీ పడకుండా పనిచేస్తున్నారు’’ అని కిషన్‌రెడ్డి వెల్లడించారు.


గ్రామీణ మహిళల సాధికారతకు బాటలు...

‘‘తెలంగాణలో దాదాపు ఇవాళ 90శాతం ఇళ్లలో ఎల్పీజీ సిలిండర్లు ఉన్నాయి. క్లీన్ ఎనర్జీ వినియోగించే విషయంలో వినియోగదారులు, సేవలందించడంలో డిస్ట్రిబ్యూటర్ల కమిట్మెంట్ కు నిదర్శనం. ఇటీవల వచ్చిన ఓ అంచనా ప్రకారం.. గ్రామీణ మహిళలు సిలిండర్ల ద్వారా.. తమ వంట సమయంలో 60% ఆదా చేసుకుంటున్నారు. ఆ సమయాన్ని ఇతర ఆర్థికాభివృద్ధి కార్యక్రమాలకు వాడుతున్నారని వెల్లడైంది. LPG సిలిండర్ల ద్వారా.. గ్రామీణ మహిళల సాధికారతకు బాటలు పడుతున్నాయనడానికి ఇదొక నిదర్శనం. గ్రామీణ ప్రాతాల్లో 12 లక్షల కనెక్షన్లు ఉన్నాయనేది ఒక అంచనా.. ఇంకా చాలా మంది ఎల్పీజీలోకి మారుతున్నారు. దీంతో డిస్ట్రిబ్యూటర్లు కూడా పెరగాల్సి వస్తుంది. దీంతో ఉద్యోగాలు కూడా పెరుగుతాయి’’ అని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

Bhatti Vikramarka: మహిళాభివృద్ధిలో దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలువనుంది

Rave party: కేటీఆర్ బావమరిది ఫాంహౌస్‌లో రేవ్ పార్టీ.. భగ్నం చేసిన పోలీసులు..

AV Ranganath: అనుమతులుంటే కూల్చం

KTR: ‘సుద్దపూస.. ఇప్పుడేమంటాడో’.. కేటీఆర్‌పై కేంద్ర మంత్రి హాట్ కామెంట్స్..

Read Latest Telangana News and Telugu News

Updated Date - Oct 27 , 2024 | 03:16 PM