ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

TS Politics: ఆ ప్రాజెక్టు కట్టిందే మేము.. వారికేం భయపడం: కేటీఆర్

ABN, First Publish Date - 2024-02-10T19:28:32+05:30

కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో ఒక మేడిగడ్డ మాత్రమే కుంగిందని.. దాన్ని భూతద్దంలో పెట్టీ చూపిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు(KTR) అన్నారు.

హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో ఒక మేడిగడ్డ మాత్రమే కుంగిందని.. దాన్ని కాంగ్రెస్ నేతలు భూతద్దంలో పెట్టీ చూపిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు(KTR) అన్నారు. శనివారం నాడు తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... కాంగ్రెస్ నేతలు మూర్ఖులని.. కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టిందే బీఆర్ఎస్ ప్రభుత్వమని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో కాంగ్రెస్‌కు ఏం తెలియదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రపంచంలోనే అతి పెద్ద ప్రాజెక్ట్ అని తెలిపారు. ఆ ప్రాజెక్టును చూడలని అనుకుంటే కాంగ్రెస్ నేతలు వెళ్లి చూడవచ్చని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ డెప్త్ కాంగ్రెస్ నేతలు తెలుసుకుంటే మంచిదని కేటీఆర్ అన్నారు.

ప్రాజెక్టులో చిన్న, చిన్న లోపాలు ఉంటే ఎత్తి చూపాలని.. అంతే కానీ దాన్ని కాంగ్రెస్ నేతలు రాజకీయం కోసం వాడుకుంటున్నారని మండిపడ్డారు. ఇంకా తాము అధికారంలో ఉన్నామని కాంగ్రెస్ నేతలు అనుకుంటున్నారన్నారు. ప్రతి చిన్న విషయాన్ని వారు బట్ట కాల్చి మీదా వేస్తున్నారని మండిపడ్డారు. ప్రాజెక్టులో ఏదైనా తప్పు జరిగితే బయట పెట్టాలని కోరారు. ఐఏఎస్‌ల‌పై ఆరోపణలు వస్తే చర్యలు తీసుకోవాలన్నారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రే ఓటుకు నోటు కేసులో దొరికిన వ్యక్తీ అని ఎద్దేవా చేశారు. ఆయన క్రిమినల్ ఆలోచనలు ఉంటే ఎవరి మీదానైనా చర్యలు తీసుకోవచ్చని కేటీఆర్ తెలిపారు.

Updated Date - 2024-02-10T20:16:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising