ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Telangana: కాంగ్రెస్ ప్రభుత్వం టార్గెట్‌గా కేటీఆర్ సంచలన ట్వీట్లు..

ABN, Publish Date - Nov 04 , 2024 | 09:38 AM

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం టార్గెట్‌గా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ట్వీట్లు చేశారు. వరుస పెట్టి విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు సహా.. కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు, రాష్ట్రాభివృద్ధి వంటి అంశాలపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు.

KTR

హైదరాబాద్, నవంబర్ 04: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం టార్గెట్‌గా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ట్వీట్లు చేశారు. వరుస పెట్టి విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు సహా.. కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు, రాష్ట్రాభివృద్ధి వంటి అంశాలపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని వర్గాలను మోసం చేసిందంటూ విమర్శించారు. కాంగ్రెస్ హామీలపై ఢిల్లీ బాబు రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. వంద రోజుల్లో ప్రతి గ్యారెంటీ నెరవేరుతందని చెప్పిన మోసగాళ్లకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యిందని కేటీఆర్ హెచ్చరించారు. ఇప్పటి వరకు 330 రోజులు ముగిసిందని.. ఏడాది నిండడానికి ఇంకా 35 రోజులే మిగిలిందన్నారు.


  • కేటీఆర్ ట్వీట్ సారాంశం యధావిధిగా..

  • ఏడాదికి 35 రోజులు మాత్రమే మిగిలింది-2 లక్షల జాబ్‌లు ఎక్కడ అంటున్నారు నిరుద్యోగులు.

  • ఏడాదికి 35 రోజులే మిగిలింది - ఎకరాకు రూ. 15,000 రైతు భరోసా ఏమైంది అంటున్నారు రైతన్నలు.

  • ఏడాదికి 35 రోజులే మిగిలింది - పెంచిన రూ. 4,000 పెన్షన్ ఎక్కడంటున్నారు అవ్వ తాతలు.

  • ఏడాదికి 35 రోజులే మిగిలింది-నెల నెల ఇస్తామన్న రూ. 2,500 ఎక్కడబోయాయి అంటున్నారు అడబిడ్డలు

  • ఏడాదికి 35 రోజులే మిగిలింది-పెంచి ఇస్తామన్న రూ. 6,000 పెన్షన్ ఎక్కడని నిలదీస్తున్నారు దివ్యాంగ అన్నలు, అక్కలు.

  • ఏడాదికి 35 రోజులే మిగిలింది-ఉద్యోగులు మా పీఆర్సీ ఎక్కడ, మా డీఏలు ఎక్కడని సమ్మెలకు సై అంటున్నారు.

  • ఏడాదికి 35 రోజులే మిగిలింది - కౌలు రైతులు 15,000 ఎక్కడ, రైతు కూలీలు రూ. 12,000 ఎక్కడ అంటున్నారు.

  • ఏడాదికి 35 రోజులే మిగిలింది - తులం బంగారం ఎక్కడా అంటున్నారు మా బంగారు తల్లులు.

  • చెప్పిన హామీలన్నీ బూడిదలో పన్నీరయ్యే - చెప్పని మూసీలో లక్షల కోట్ల మూటలాయే.

  • ఏడాది కాలమంతా అటెన్షన్ డైవర్షన్‌తో పబ్బం గడిపిన మూసి సర్కార్.

  • ఏముంది ఈ ప్రజా పాలనలో గర్వకారణం ధర్నాలు, రాస్తారోకోలు తప్ప?

  • జవాబు చెప్తావా ఢిల్లీ బాబు?

అంటూ తనదైన శైలిలో కాంగ్రెస్ సర్కార్‌పై విరుచుకుపడ్డారు. ఇక మరో ట్వీట్ కూడా పోస్ట్ చేసిన కేటీఆర్.. రైతుల అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. ధాన్యం కొనుగోలు, రైతు బంధు, రైతు భరోసా వంటి పథకాల అమలులో అలసత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు ఇబ్బందుల్లో ఉంటే.. సీఎం, మంత్రులు పెళ్ళిళ్లలో బిజీగా ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.


కేటీఆర్ పోస్టు..

  • నీళ్లల్లో ధాన్యం -ధర్నాలో రైతు-షరతుల్లో మిల్లర్లు.

  • రైతన్న నడ్డివిరిచి గాల్లో విహరిస్తున్న మోసకారి కాంగ్రెస్.

  • దసరా పోయింది, దీపావళి పోయింది, కార్తీకమసమొచ్చినా కానరాని కొనుగోళ్లు.

  • నాడు గింజగింజకు కేసీఆర్ హామీ - నేడు గడియగడియ గండమే.

  • మిల్లర్లతో చర్చలు లేవు - రైతుకు భరోసా కరువు- అన్నదాతను గాలికి వదిలిన గాలి మోటార్ సర్కార్.

  • ధాన్యం కొంటే రూ. 500 బోనస్ - అసలు కొనకుంటే అంతా భోగస్.

  • సమీక్ష లేదు - సమావేశం లేదు - ధాన్యంపై కప్పే కవర్లు లేవు - అసలు సమయమే లేదు.

  • రుణమాఫీ లేదు - రైతుబంధు లేదు - రైతు భీమా లేదు - చివరకు పంట కొనుగోళ్లు లేవు.

  • లేవు లేవు లేవు అసలేమీ లేవు ఈ అసమర్థపు సన్నాసి పాలనలో ఏమిలేవు.

  • జవాబు చెప్తావా ఢిల్లీ బాబు?


మాజీ సర్పంచుల అరెస్ట్‌ వ్యవహారంపై కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. రాష్ట్ర వ్యాప్తంగా మాజీ సర్పంచులను అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. పెండింగ్ బిల్లులు ఇవ్వాలని ఏడాది కాలంగా అడిగినా ఇవ్వకపోవడం సిగ్గుచేటు అని కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ మండిపడ్డారు.

  • రాష్ట్రంలో నిత్యం అరెస్టుల పర్వమే కొనసాగుతోంది.

  • పోలీసులతో సమస్యలను అణగదొక్కాలని చూస్తుంది ప్రభుత్వం.

  • రాష్ట్రంలోని సమస్యలు గాలికి వదిలి ముఖ్యమంత్రి, మంత్రులు ఊరేగుతున్నారు.

  • సర్పంచుల కుంటుంబాలు రోడ్డున పడే దాకా ప్రభుత్వం స్పందించదా.

  • శాంతియుత నిరసనకు పిలుపునిచ్చిన సర్పంచులను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు.

  • పల్లె ప్రగతి పేరిట మేము చేపట్టిన కార్యక్రమాననికి తూట్లు పొడిచి నిధులు విడుదల చేయకుండా ఆపుతున్నారు.

  • అరెస్ట్ చేసిన సర్పంచ్‌లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం.

Updated Date - Nov 04 , 2024 | 09:38 AM