KTR: కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
ABN, Publish Date - Sep 22 , 2024 | 06:08 PM
కాంగ్రెస్ ప్రభుత్వంలో తమ అభిమానులు ఉన్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్లకుంట్ల తారక రామారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏం జరిగినా తమకు తెలుస్తుందని చెప్పారు తప్పకుండా అన్నీ బయటకు వస్తాయని , అన్నీ బయట పెడతామని కేటీఆర్ హెచ్చరించారు.
హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్లకుంట్ల తారక రామారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ(ఆదివారం) తెలంగాణ భవన్‌లో కేటీఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వంలో తమ అభిమానులు ఉన్నారని. ఏం జరిగినా తమకు తెలుస్తుందని చెప్పారు తప్పకుండా అన్నీ బయటకు వస్తాయని , అన్నీ బయట పెడతామని కేటీఆర్ హెచ్చరించారు.
రేవంత్ రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉండాలి..
ముఖ్యమంత్రి పదవికి రేవంత్ రెడ్డి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉండాలని అన్నారు. రేవంత్ రెడ్డి పదవిని లాక్కోడానికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చవాన్, కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్ప ఉద్యోగాలు పోయినట్లే రేవంత్ కూడా తన ఉద్యోగం కోల్పోబోతున్నాడని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
సీఎం కుటుంబ సభ్యుల అవినీతిని తేలుస్తాం..
తన బావమరిదికి అక్రమంగా టెండర్లు కట్టబెట్టిన వ్యవహారం రేవంత్ మెడకు చుట్టుకుంటుందని కేటీఆర్ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి తరచుగా చెబుతున్న ఫోర్త్ సిటీ కాదని.. ముచ్చర్ల ఫోర్ బ్రదర్స్ సిటీ అని ఆరోపించారు. పదేళ్లు ప్రభుత్వాన్ని నడిపిన తమకు ఎక్కడ అవినీతి జరుగుతుందో తెలియదా? అని అన్నారు. కొడంగల్ లిఫ్ట్ కథ సహా.. సీఎం కుటుంబ సభ్యుల అవినీతిని తేలుస్తామని కేటీఆర్ అన్నారు. బావమరిది వ్యవహారంలో ఇరికిపోయానని సీఎంకు కూడా తెలుసునని అన్నారు. చట్టాలే కాదు.. చుట్టరికాలు కూడా ప్రభుత్వ పెద్దలకు తెలియనట్లుందని కేటీఆర్ విమర్శించారు. చిత్తశుద్ధి ఉంటే హైకోర్టు సీజే వద్దకు మంత్రి పొంగులేటి తనతో కలిసి రావాలని కేటీఆర్ సవాల్ విసిరారు.
Updated Date - Sep 22 , 2024 | 06:16 PM