TG News: జంట జలాశయాల గేట్ల ఎత్తివేత. .. ప్రజలకు అధికారుల కీలక సూచనలు
ABN, Publish Date - Sep 07 , 2024 | 06:06 PM
తెలంగాణలో బారీ వర్షాలు పడుతన్నాయి. హైదరాబాద్‌లో వర్షాలు దంచికొడుతుండటంతో జంట జలాశయాల గేట్లను జలమండలి అధికారులు. ఎత్తారు. వరద వస్తుండటంతో ఉస్మాన్ సాగర్ 2 గేట్లు, హిమాయత్ సాగర్ ఒక గేటు ఎత్తివేశారు. దీంతో మూసీ పరివాహక ప్రాంత ప్రజలను బల్దియా అప్రమత్తం చేసింది.
హైదరాబాద్: తెలంగాణలో భారీ వర్షాలు పడుతన్నాయి. హైదరాబాద్‌లో వర్షాలు దంచికొడుతుండటంతో జంట జలాశయాల గేట్లను జలమండలి అధికారులు ఎత్తారు. వరద వస్తుండటంతో ఉస్మాన్ సాగర్ 2 గేట్లు, హిమాయత్ సాగర్‌కు చెందిన ఒక గేటును అధికారులు ఎత్తివేశారు. ఈరెండు జలశయాల్లోని నీటిని మూసీలోకి వదిలినట్లు సమాచారం. దీంతో మూసీ పరివాహక ప్రాంత ప్రజలను బల్దియా అప్రమత్తం చేసింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. ఎగువ ప్రాంతాల నుంచి జంట జలాశయాలకు వరద పోటెత్తడంతో అధికారులు ఈరెండు జలాశయాల గేట్లు ఎత్తివేశారు.
తెలంగాణలో మరోసారి భారీ వర్షం
మరోవైపు తెలంగాణకు మరోసారి భారీ వర్ష సూచనలు ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. భద్రాద్రి, ఖమ్మం, భూపాలపల్లి, మహబూబాబాద్.. మెదక్, ములుగు, సూర్యాపేట జిల్లాలకు రెడ్ అలెర్ట్ చేసిన విషయం తెలసిందే. ఆదిలాబాద్, కామారెడ్డి, కరీంనగర్, మంచిర్యాల, నిర్మల్, నల్గొండ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వివరించారు. నిజామాబాద్, సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు.
Updated Date - Sep 07 , 2024 | 06:12 PM