ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

TG NEWS: సాఫ్ట్‌వేర్ కంపెనీ భవనంలో అనుకోని ఘటన.. ఏం జరిగిందంటే..

ABN, Publish Date - Dec 21 , 2024 | 08:24 AM

ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీ భవనంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అగ్నిప్రమాదంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఈ ఘటన మాదాపూర్‌లో జరిగింది.

హైదరాబాద్: మాదాపూర్‌లో ఇవాళ(శనివారం) భారీ అగ్నిప్రమాదం జరిగింది. మాదాపూర్ ఇనార్బిట్ మాల్ వద్ద ఉన్న ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీ భవనంలో ఈ సంఘటన సంభవించింది. ఆ భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పొగ దట్టంగా వ్యాపించడంతో అక్కడున్న వారు ఉక్కిరి బిక్కరి అయ్యారు. అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు.


5 అంతస్తుల బిల్డింగ్‌లోని ఓ రెస్టారెంట్‌లో మంటలు చెలరేగాయి. గ్యాస్ సిలిండర్లు పేలినట్లు పోలీసులు తెలిపారు. పేలుడు ధాటికి పక్కన ఉన్న కంపెనీల అద్దాలు కూడా ధ్వంసం అయ్యాయి. పక్క కంపెనీలో ఉన్న ఐటీ ఉద్యోగులు కొందరికి గాయాలయ్యాయి. పేలుడు సంభవించిన రెస్టారెంట్‌కి ఎదురుగా విరాట్ కోహ్లీకి చెందిన రెస్టారెంట్ ఉన్నట్లు సమాచారం. మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. బిల్డింగ్‌కు పూర్తిగా మంటలు వ్యాపించాయి. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగిందా.. మరే ఏ ఇతర కారణాల వల్ల ఈ భారీ అగ్నిప్రమాదం జరిగిందనే దానిపై పోలీసులు విచారిస్తున్నారు. స్థానికులను అక్కడి నుంచి దూరంగా పంపించి వేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.


అగ్నిప్రమాదంపై పూర్తి దర్యాప్తు : రంగారెడ్డి డీఎఫ్‌ఓ కరిముల్లా ఖాన్

మాదాపూర్‌లో జరిగిన అగ్నిప్రమాదంపై పూర్తి దర్యాప్తు చేస్తున్నామని రంగారెడ్డి డీఎఫ్‌ఓ కరిముల్లా ఖాన్ తెలిపారు. ఏబీఎన్‌తో ఆయన మాట్లాడారు. ఇవాళ ఉదయం 6:12 నిమిషాలకు అగ్నిప్రమాదం జరిగినట్లు సమాచారం అందిందని తెలిపారు. సమాచారం అందిన 4 నిమిషాల్లో అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారని అన్నారు. అగ్నిప్రమాదం జరిగిన బిల్డింగ్ G+5గా ఉందని తెలిపారు. బిల్డింగ్ నాలుగో ఫ్లోర్‌లో మంటలు చెలరేగాయని. అందులో కిచెన్, బార్ ఉన్నాయని చెప్పారు.


బ్రంటో స్కై లిఫ్ట్‌తో పాటు మొత్తం నాలుగు ఫైర్ వెహికల్స్ ద్వారా ఫైర్ కంట్రోల్ చేశామన్నారు. నిజంగా బ్లాస్టింగ్ జరిగిందా లేదా ఇప్పుడే చెప్పలేమన్నారు. కిచెన్‌లోకి వెళ్లి ప్రమాదం ఎలా జరిగిందో తెలుసుకునే అవకాశం లేకుండా పోయిందన్నారు. తీవ్రత ఎక్కువగా ఉండటంతో స్ప్రింక్లర్స్ ఓపెన్ అయినా ఫైర్ కంట్రోల్ అవ్వలేదని అన్నారు. బ్లాస్టింగ్ తీవ్రత వల్ల పక్క బిల్డింగ్ అద్దాలు కూడా ధ్వంసం అయ్యాయని చెప్పారు. పక్క బిల్డింగ్‌లో పని చేసే ఉద్యోగులు ఇద్దరికీ స్వల్ప గాయాలు అయ్యాయని రంగారెడ్డి డీఎఫ్‌ఓ కరిముల్లా ఖాన్ తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

CM Revanth Reddy: తండ్రీకొడుకులు నేరగాళ్లు

MahaKumbh Mela: మహాకుంభ మేళాకు 14 ప్రత్యేక రైళ్లు

Neethu Bai: ఈ కిలాడీ లేడి.. మహా ముదురు.. టార్గెట్ ఫిక్స్ చేస్తే ...

Read Latest Telangana News and Telugu News

Updated Date - Dec 21 , 2024 | 10:48 AM