ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Mallu Ravi: బీఆర్ఎస్ నేతలు కాళేశ్వరం వెళ్లేందుకు కారణమిదే...?

ABN, Publish Date - Feb 29 , 2024 | 05:27 PM

కథలు చెప్పడానికే బీఆర్ఎస్(BRS) నేతలు కాళేశ్వరం వెళ్తున్నారని ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మల్లు రవి(Mallu Ravi) అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కుంగిపోయిందని గతంలో కేంద్ర ప్రభుత్వం పంపించిన డ్యామ్ సేఫ్టీ అధికారులు ఓ నివేదిక ఇచ్చారని తెలిపారు.

ఢిల్లీ: కథలు చెప్పడానికే బీఆర్ఎస్(BRS) నేతలు కాళేశ్వరం వెళ్తున్నారని ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మల్లు రవి(Mallu Ravi) అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కుంగిపోయిందని గతంలో కేంద్ర ప్రభుత్వం పంపించిన డ్యామ్ సేఫ్టీ అధికారులు ఓ నివేదిక ఇచ్చారని తెలిపారు. డ్యామ్ సేఫ్టీ అధికారులు అడిగితే గత కేసీఆర్ ప్రభుత్వం వివరాలు ఇవ్వలేదని అన్నారు. 2016లో కాళేశ్వరం ప్రాజెక్టుకు మాజీ సీఎం కేసీఆర్(KCR) శంకుస్థాపన చేశారని.. రూ. లక్షా 27 వేల కోట్లతో ఈ ప్రాజెక్టు నిర్మించారని అన్నారు. ప్రాజెక్టు నాణ్యతగా లేకపోవడంతోనే పగుళ్లు వస్తున్నాయని ఈ విషయాన్ని తాము అక్కడకు వెళ్లి చెప్పామని అన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా రూ.10,500 కోట్లు గతంలో విద్యుత్ బిల్లులు వచ్చాయని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వమే కాళేశ్వరం పగ్గుళ్లకు కారణమని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. రైతుల లబ్ధి కోసం గులాబీ పార్టీ చేసింది ఏమీ లేదన్నారు. కేసీఆర్‌ది రాజరిక పరిపాలన అని.. ఆయన హయాంలో జరిగిన అవినీతిని ఎందుకు ఒప్పుకోవడం లేదని ప్రశ్నించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్‌ను గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ మాత్రం కట్టలేదని... ప్రజల నిధులను దుర్వినియోగం చేసిందని మండిపడ్డారు. కేసీఆర్ చెప్పినట్లుగానే కాళేశ్వరం కట్టామని సంబంధిత అంతర్జాతీయ సంస్థ ఎల్ఎన్టీ నిర్వాహకులు ఈ విషయాన్ని చెప్పారని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ సరిగాలేదని ఈ సంస్థ చెప్పిందని మల్లు రవి గుర్తుచేశారు.

ఇవి కూడా చదవండి..

TS News: ఆ స్కామ్‌లో దూకుడు పెంచిన ఏసీబీ .. సంచలన విషయాలు వెలుగులోకి.. ఆ నేతల్లో టెన్షన్

Telangana: బీఆర్ఎస్ కు బిగ్ షాక్.. ఎంపీ రాజీనామా.. ఆ పార్టీలో చేరిక..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Feb 29 , 2024 | 05:29 PM

Advertising
Advertising