ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Seethakka: ఏడాది సంబరాల్లో మంత్రి సీతక్కకు రేవంత్‌ రెడ్డి అదిరిపోయే గిఫ్ట్‌

ABN, Publish Date - Nov 28 , 2024 | 10:06 PM

ములుగు నియోజకవర్గంలో కొత్తగా మల్లంపల్లి మండలం ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. మల్లంపల్లి మండలం ఏర్పాటు చేస్తూ రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల్లో ఇచ్చిన మాటను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క నిలబెట్టుకున్నారు.

ములుగు: ములుగు నియోజకవర్గంలో కొత్తగా మల్లంపల్లి మండలం ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. మల్లంపల్లి మండలం ఏర్పాటు చేస్తూ రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల్లో ఇచ్చిన మాటను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క నిలబెట్టుకున్నారు. మంత్రిగా ఏడాదిలోపే మల్లంపల్లి మండలాన్ని ఏర్పాటుకు మంత్రి సీతక్క కృషిచేశారు. మల్లంపల్లి ప్రాంత ప్రజల పదేళ్ల ఆకాంక్షను మంత్రి సీతక్క నెరవేర్చారు.


కొత్తగా మల్లంపల్లి మండల ఏర్పాటు చేసిన సీఎం రేవంత్ రెడ్డి, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్‌చార్జ్ , రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలకు మంత్రి సీతక్క ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ... మల్లంపల్లి ప్రత్యేక మండలం కోసం ప్రజల 10 సంవత్సరాలుగా ఎన్నో పోరాటాలు చేశారని అన్నారు. ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి పాదయాత్ర చేసి మల్లంపల్లి మండల ఏర్పాటు చేస్తామని మాటిచ్చారని గుర్తుచేశారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మండలం కోసం అలుపెరగని పోరాటం చేసి మండలాన్ని సాధించుకున్న మల్లంపల్లి ప్రాంత ప్రజలకు శుభాకాంక్షలు చెప్పారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే మల్లంపల్లి మండలం ఏర్పాటు చేసిన సీఎం రేవంత్ రెడ్డికి మల్లంపల్లి ప్రాంత ప్రజల తరఫున ధన్యవాదాలు తెలిపారు. త్వరగా జీవో రావడానికి కృషి చేసిన మంచి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - Nov 28 , 2024 | 10:06 PM