ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

TG Cabinet: ఆ ముగ్గురికి మంత్రి పదవులు..!!

ABN, Publish Date - Jul 01 , 2024 | 08:34 PM

తెలంగాణ మంత్రివర్గ విస్తరణ, మార్పు, చేర్పులపై సర్వత్రా చర్చ జరుగుతోంది. కొత్తగా మంత్రివర్గంలోకి వచ్చేదెవరు..? ఉన్న మంత్రుల శాఖల మార్పు గురించి వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ కీలక అప్ డేట్ ఇచ్చారు. మంత్రివర్గ విస్తరణ ఉంటుందని.. కొందరి మంత్రుల శాఖల మారుతాయని తేల్చి చెప్పారు. మంత్రివర్గంలోకి ముగ్గురి నుంచి నలుగురిని తీసుకునే అవకాశం ఉంటుందని వివరించారు.

Damodara Raja Narasimha

హైదరాబాద్: తెలంగాణ మంత్రివర్గ విస్తరణ, మార్పు, చేర్పులపై సర్వత్రా చర్చ జరుగుతోంది. కొత్తగా మంత్రివర్గంలోకి వచ్చేదెవరు..? ఉన్న మంత్రుల శాఖల మార్పు గురించి వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ (Damodara Raja Narasimha) కీలక అప్ డేట్ ఇచ్చారు. మంత్రివర్గ విస్తరణ ఉంటుందని.. కొందరి మంత్రుల శాఖల మారుతాయని తేల్చి చెప్పారు. మంత్రివర్గంలోకి ముగ్గురి నుంచి నలుగురిని తీసుకునే అవకాశం ఉంటుందని వివరించారు.


ప్రమోషన్

మంత్రివర్గంలో సీతక్కకు ప్రమోషన్ దక్కే అవకాశం ఉంది. ఆమెకు హోం శాఖ మంత్రి పదవి వరించే ఛాన్స్ ఉంది. హోం శాఖను ఇన్నాళ్లూ సీఎం రేవంత్ రెడ్డి వద్ద ఉంది. విస్తరణలో సీతక్కకు కేటాయించేందుకు ఆస్కారం ఉంది. నల్గొండ నుంచి మరో నేత రాజగోపాల్ రెడ్డికి మంత్రివర్గంలో బెర్త్ దక్కనుంది. హైదరాబాద్ నుంచి దానం నాగేందర్, నిజామాబాద్ నుంచి ఓ కీలక నేతకు ఛాన్స్ ఇస్తారని తెలిసింది. ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన పోచారం శ్రీనివాస్ రెడ్డికి మంత్రి పదవి వరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో సీనియర్ నేత తాటిపర్తి జీవన్ రెడ్డి భగ్గుమన్నారు. ఆయనతో మంత్రి శ్రీధర్ బాబు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సంప్రదింపులు జరిపారు. ఆయనకు కూడా మంత్రి పదవి ఆఫర్ చేసినట్టు వార్తలొచ్చాయి. జీవన్ రెడ్డి పేరును మంత్రి దామోదర రాజనర్సింహ ప్రస్తావించలేదు.


రాహుల్ చెప్పారు.. కానీ..!!

అసెంబ్లీ ఎన్నికలకు ముందు పార్టీలో వచ్చే వారికి టికెట్లు లేవని, మంత్రి పదవి ఇవ్వొద్దని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చెప్పారు. కానీ పరిస్థితుల దృష్ట్యా టికెట్ల కేటాయింపు జరిగిందని అంగీకరించారు. కొందరికి మంత్రి పదవి కూడా ఇవ్వబోతున్నామని ఇండికేషన్ ఇచ్చారు. అదేవిధంగా వైద్యరోగ్య శాఖలో ప్రక్షాళన జరగబోతుందని తేల్చి చెప్పారు. వైద్యశాఖలో అడ్మినిస్ట్రేషన్, ఎడ్యుకేషన్ అనే రెండు విభాగాలు మాత్రమే ఉండాలని ఆయన స్పష్టం చేశారు.

Updated Date - Jul 01 , 2024 | 08:34 PM

Advertising
Advertising