Konda Surekha: ఫోన్ ట్యాపింగ్‌పై షాకింగ్ విషయాలు బయటపెట్టిన మంత్రి కొండా సురేఖ
ABN, Publish Date - Nov 17 , 2024 | 02:30 PM
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్ అభివృద్ధిపై దృష్టి సారించారని మంత్రి కొండా సురేఖ అన్నారు. లగచర్ల ఘటన కలెక్టర్‌పై దాడి మాజీ మంత్రి కేటీఆర్ పనే అని ఆరోపించారు. కేటీఆర్ వెనక ఉండే దాడి చేయించారని విమర్శలు చేశారు. అమాయకులను బలి చేస్తున్నారని మంత్రి కొండా సురేఖ మండిపడ్డారు.
వరంగల్: కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణను అప్పులపాలు చేసిందని మంత్రి కొండా సురేఖ ఆరోపించారు. ఇవాళ(ఆదివారం) వరంగల్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. దుష్టపాలన అంతమొందించి ఏడాది పాలన సందర్భంగా విజయోత్సవ సభ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా లక్ష మంది మహిళలతో విజయోత్సవ సభ నిర్వహిస్తున్నామని చెప్పారు. వరంగల్‌ను తెలంగాణకు రెండో రాజధాని కోసం అడుగులు పడుతున్నాయని అన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్ అభివృద్ధిపై దృష్టి సారించారని అన్నారు. గతంలో ఇక్కడ నిర్వహించిన రాహుల్ గాంధీ సభ విజయవంతమైందని గుర్తుచేశారు. ఈసభ కూడా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. లగచర్ల ఘటన కలెక్టర్‌పై దాడి మాజీ మంత్రి కేటీఆర్ పనే అని ఆరోపించారు. కేటీఆర్ వెనక ఉండే దాడి చేయించారని విమర్శలు చేశారు. అమాయకులను బలి చేస్తున్నారని మంత్రి కొండా సురేఖ మండిపడ్డారు.
ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించిన అధికారులు విదేశాల్లో దాచారని ఆరోపించారు. బీఆర్ఎస్‌ది తుగ్లక్ పాలన అని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ నేతలకు పిచ్చిపట్టిందని.. సైక్రియాటిస్ట్‌కు చూపించుకోవాలని సెటైర్లు గుప్పించారు. కేటీఆర్ విషయంలో నిజాలు తేల్చిన తర్వాతనే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
అందుకే అధికారులపై దాడులు: మంత్రి సీతక్క
వరంగల్ : బీఆర్ఎస్, బీజేపీ పార్టీకి రాజకీయ లబ్ధి తప్ప వేరే ఆలోచన లేదని.. అందుకే అధికారులపై దాడులు చేస్తున్నారని మంత్రి సీతక్క అన్నారు. తాము మంచి పనులు చేస్తే బీఆర్ఎస్ అడ్డుకుంటోందని చెప్పారు. హైడ్రాకు అడ్డుపడుతున్నారని ధ్వజమెత్తారు. మీరు చేసిన సకల జనుల సర్వే ఏమైందని ప్రశ్నించారు. లిమ్కా బుక్ రికార్డు కోసమే బీఆర్ఎస్ సకల జనుల సర్వే చేసిందని ఎద్దేవా చేశారు. కానీ తాము చేసే కులగణన ప్రభుత్వ పథకాలు సక్రమంగా అందించడానికేనని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీకే మూటలు ఇచ్చిన చరిత్ర ఉందని సంచలన ఆరోపణలు చేశారు. దేశంలో అత్యధికంగా దోచుకున్న పార్టీ బీఆర్ఎస్ అని మంత్రి సీతక్క ఆరోపించారు.
తమకు మూటలు మోసే అలవాటు లేదని తేల్చిచెప్పారు. వాళ్లు అధికారంలో ఉన్నప్పుడు పోలీసులను మెచ్చుకున్నారని.. ఇప్పుడు తిడుతున్నారని చెప్పారు. కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ పెట్టి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజలకు వాస్తవాలు తెలియజేసేందుకే వరంగల్ సభ నిర్వహిస్తున్నామని తెలిపారు.ఉక్కు మహిళ ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా ప్రగతి సభ నిర్వహిస్తున్నామని తెలిపారు.మహిళలకు సంబంధించిన అంశాలను ప్రగతి నివేదికలో వివరిస్తామని అన్నారు. ఆర్టీసీ బస్సులు కూడా మహిళలే నిర్వహించేలా సీఎం రేవంత్‌రెడ్డి చర్యలు చేపడుతున్నారని అన్నారు.మహిళలను కోటీశ్వరులు చేయడమే తమ లక్ష్యమని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ఉచిత బస్సు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రైతు రుణమాఫీ, ఆరోగ్యశ్రీ పెంపు అమలు చేశామని మంత్రి సీతక్క స్పష్టం చేశారు.
Updated Date - Nov 17 , 2024 | 02:39 PM