ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Minister Ponguleti :బీఆర్ఎస్ నేతలు అలా చేస్తే తీవ్ర పరిణామాలు.. మంత్రి పొంగులేటి మాస్ వార్నింగ్

ABN, Publish Date - Nov 14 , 2024 | 03:08 PM

బీఆర్ఎస్ నేతలకు మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. రైతులను రెచ్చగొట్టలని చూస్తే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. తమ ప్రభుత్వం రైతు సంక్షేమానికి కట్టుబడి ఉందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు.

Ponguleti Srinivasa Reddy

హైదరాబాద్: రైతుల‌ను న‌ష్టపెట్టాల‌న్నది తమ ప్రభుత్వ ఉద్దేశం కాదని మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి అన్నారు. వారి స‌మ‌స్యల‌ను విన‌డానికి, ప‌రిష్కరించ‌డానికి ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుందని తెలిపారు. రైతుల ముసుగులో అధికారుల‌ను చంపే ప్రయ‌త్నం చేయ‌డం మంచి ప‌ద్ధతి కాదని అన్నారు. ల‌గ‌చ‌ర్ల సంఘ‌ట‌ను ప్రభుత్వం సీరియ‌స్‌గా తీసుకుంటుందని అన్నారు. ఈ రోజు అధికారుల‌పై దాడి జ‌రిగిన‌ట్లుగానే ..రేపు రాజ‌కీయ నాయ‌కులు, ప్రజ‌లపై దాడి జ‌రిగితే ప్రభుత్వం ఉపేక్షించ‌దని మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి హెచ్చరించారు.


ఇవాళ(గురువారం) గాంధీభవన్‌లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ... వికారాబాద్ జిల్లాకు ఫస్ట్ మేజిస్ట్రేట్‌గా ఉన్న క‌లెక్టర్‌పైనే హ‌త్యాయ‌త్నం చేయ‌డానికి కుట్ర ప‌న్నారని ఆరోపించారు. అధికారుల మీద దాడి జరగడం మ‌న‌మీద మ‌నం దాడి చేసుకునట్లేనని అన్నారు. రైతుల ముసుగులో కొంత‌మంది గులాబీ గూండాలు శాంతి భ‌ద్రత‌ల‌కు విఘాతం క‌లిగించే ప్రయ‌త్నం చేస్తున్నారని విమర్శలు చేశారు. కుట్రపూరితంగా అధికారుల‌ను రైతుల‌కు దూరం చేసే ప్రయ‌త్నం కొంత‌మంది చేస్తున్నారని మండిపడ్డారు. గులాబీ గూండాల కుట్రల‌ను రైతాంగం అర్ధం చేసుకోవాలని మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి అన్నారు.


ప్రజ‌ల‌ను కాపాడుకున్నట్లే, అధికారుల‌ను కాపాడుకోలేక‌పోతే ప‌ని చేయ‌డానికి ఏ అధికారి ముందుకు వ‌స్తారని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో కూడా ఇదే ప‌ద్ధతి పాటించారా అని నిలదీశారు. ఏం త‌ప్పుచేశార‌ని ఆనాడు ఖ‌మ్మంలో మిర్చి రైతుల‌కు సంకెళ్లు వేసి జైల్లో పెట్టారని ప్రశ్నించారు. మ‌ల్లన్నసాగ‌ర్‌లో రైతుల‌ను దేశ‌ద్రోహులుగా చిత్రీక‌రించారని ఆరోపించారు. పిల్లా, పాపా, ముస‌లి అనే తేడా లేకుండా రాత్రికి రాత్రి వారిని అరెస్ట్ చేసి సంకెళ్లు వేసిన సంగ‌తి మ‌రిచారా అని ప్రశ్నించారు. కేటీఆర్ నియోజ‌క‌వ‌ర్గం సిరిసిల్లలో ద‌ళితుల‌కు బేడీలు వేసిన సంగ‌తి మ‌రిచిపోయారా అని నిలదీశారు. ల‌గ‌చ‌ర్లలో ఆ ప‌రిస్ధితి లేదు క‌దా అని మంత్ర పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రశ్నించారు.


ఈ వార్తలు కూడా చదవండి

Hyderabad: ఫోన్ ట్యాపింగ్ కేసు.. చిరుమర్తి లింగయ్య కీలక విషయాలు వెల్లడి..

BJP: మిడి మిడి జ్ఞానంతో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు: కిషన్ రెడ్డి

HYDRA: ‘హైడ్రా’ రూటు మారింది.. కూల్చివేతలకు తాత్కాలిక విరామం

Read Latest Telangana News and TELUGU NEWS

Updated Date - Nov 14 , 2024 | 03:17 PM