Minister Ponguleti: అందుకే ఆ చట్టం తీసుకువచ్చాం.. మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు
ABN, Publish Date - Dec 20 , 2024 | 11:21 AM
ఆర్ఓఆర్ 2024 చట్టంపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అసెంబ్లీలో కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో తెచ్చిన ధరణి లాంటి చట్టం గత రాచరిక పాలనలో ఉండేదన్నారు. తప్పు ఒకరు చేస్తే శిక్ష మాత్రం అమాయక ప్రజలు అనుభవించారని అన్నారు.
హైదరాబాద్: మంత్రులు అసెంబ్లీలో లేరని మాజీ మంత్రి హరీష్‌రావు అనడం అన్యాయమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. తాను సభలో ఉన్నానని.. గమనించాలని అన్నారు. హరీష్‌రావు వ్యాఖ్యలపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కౌంటర్ ఇచ్చారు. 2020 ఆర్ఓఆర్ చట్టం వల్ల లక్షలాదిమంది రైతులకు నష్టం జరిగిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. నష్టపోయిన రైతులందరికీ భరోసా కల్పించేలా కొత్త చట్టాన్ని తీసుకువస్తున్నామని స్పష్టం చేశారు.
బీఆర్ఎస్ సభ్యుల ఆందోళన మధ్యనే ఆర్ఓఆర్ 2024 చట్టంపై సభలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రసంగించారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో తెచ్చిన ధరణి లాంటి చట్టం గత రాచరిక పాలనలో ఉండేదన్నారు. తప్పు ఒకరు చేస్తే శిక్ష మాత్రం అమాయక ప్రజలు అనుభవించారని అన్నారు. ధరణి తప్పుడు రికార్డు వల్ల సిద్దిపేట జిల్లాలో మద్దెల కిష్టయ్య అనే రైతు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. ధరణి తెచ్చి దళిత, గిరిజన, మైనార్టీ, బీసీలకు చెందిన వేల ఎకరాల భూములను గత పాలనలో తన్నుకుపోయారని ఆరోపించారు. తాము తెస్తున్న భూభారతి నిజమైన ప్రజల చట్టమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉద్ఘాటించారు.
ఈ వార్తలు కూడా చదవండి
Lagacharla Case: సంగారెడ్డి సెంట్రల్ జైలు నుంచి విడుదల కానున్న లగచర్ల రైతులు
TG NEWS: నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. పదిమందికి తీవ్ర గాయాలు
NTR Statue: ఓఆర్‌ఆర్ వద్ద వంద అడుగుల ఎన్టీఆర్ విగ్రహం
Read Latest Telangana News and Telugu News
Updated Date - Dec 20 , 2024 | 11:23 AM