Hyderabad: మీరు ఎన్ని రోజులు చెప్తే అన్ని రోజులు నిర్వహించాలా: భట్టి విక్రమార్క..
ABN, Publish Date - Dec 16 , 2024 | 05:34 PM
తెలంగాణ రాష్ట్ర అప్పులపై మాజీ మంత్రి కేటీఆర్, బీఆర్ఎస్ నేతలు నిజాలు తెలుసుకోవాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హితబోధ చేశారు. ప్రస్తుతం రాష్ట్ర అప్పులు రూ.7.20 లక్షల కోట్లు ఉన్నాయని మంత్రి వెల్లడించారు. కార్పొరేషన్ లోన్లతో కలిసి మొత్తం లెక్కలు బయటపెట్టాల్సిన అవసరం ఉందని మంత్రి అభిప్రాయపడ్డారు.
హైదరాబాద్: ప్రతిపక్షాలు ప్రచారం చేసినట్లు హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ రంగం పడిపోలేదని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. హైదరాబాద్- బెంగుళూరుకు ఇన్వెస్టర్లు వస్తున్నారని మంత్రి వెల్లడించారు. హైడ్రాపై మొదట్లో తప్పుడు ప్రచారం జరిగిందని, అందువల్లే ప్రజలు ఆందోళనకు గురయ్యారని మంత్రి చెప్పారు. ప్రస్తుతం హైడ్రా భయం ప్రజల్లో లేదని, ప్రతిపక్షాలు చేసిన ఆరోపణల్లో నిజం లేదని ఇప్పుడు తేలిందని పొంగులేటి అన్నారు.
అదానీపై మా విధానం అదే..
తెలంగాణ రాష్ట్ర అప్పులపై మాజీ మంత్రి కేటీఆర్, బీఆర్ఎస్ నేతలు నిజాలు తెలుసుకోవాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హితబోధ చేశారు. ప్రస్తుతం రాష్ట్ర అప్పులు రూ.7.20 లక్షల కోట్లు ఉన్నాయని మంత్రి వెల్లడించారు. కార్పొరేషన్ లోన్లతో కలిసి మొత్తం లెక్కలు బయటపెట్టాల్సిన అవసరం ఉందని మంత్రి అభిప్రాయపడ్డారు. కార్పొరేషన్ పేరుతో చేసే అప్పులు సైతం ప్రభుత్వ ఖాతాల్లోకే వస్తాయనే విషయం కేటీఆర్ తెలుసుకోవాలని ఎద్దేవా చేశారు. శాసనసభలో ఎవరి పాత్ర వారిదేనని, ప్రివిలేజ్ మోషన్ ఇవ్వడం వాళ్ల హక్కంటూఆయన చెప్పారు. అసెంబ్లీకి కేసీఆర్ రాకుండా కొసరు నేతలను పంపుతున్నారని మంత్రి మండిపడ్డారు. అసెంబ్లీకి కేసీఆర్ వస్తే ఆయనతో కూర్చొని మాట్లాడాలనే కోరిక తనకు వ్యక్తిగతంగా ఉన్నట్లు పొంగులేటి చెప్పుకొచ్చారు. కేటీఆర్ ఆరోపించినట్లు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్‌లో ఆదాయం తగ్గలేదని, పెరుగుతోందని మంత్రి చెప్పారు. కాంగ్రెస్ ఏడాది పాలనా కాలంపై ప్రజల్లో ఎలాంటి వ్యతిరేకత లేదని అన్నారు. వైఎస్ఆర్ హయాంలోనూ ఇలానే ప్రచారం జరిగిందని మంత్రి మండిపడ్డారు. పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ విషయంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ పాలసీనే రాష్ట్రంలో అమలు జరుగుతోందని మంత్రి పొంగులేటి వెల్లడించారు.
ఎన్ని రోజులంటే..
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను మరో ఐదు రోజులపాటు నిర్వహించాలని శాసనసభా స్పీకర్ గడ్డం ప్రసాద్ వెల్లడించారు. ఈనెల 21 వరకూ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నట్లు బీఏసీ ప్రకటించింది. ఇవాళ (సోమవారం) మధ్యాహ్నం అసెంబ్లీలోని స్పీకర్ ఛాంబర్‌లో బీఏసీ సమావేశమైంది. ఈ సమావేశంలో అదానీ, రేవంత్ రెడ్డి ఉన్న టీషర్ట్స్ గురించి కాంగ్రెస్, బీఆర్ఎస్ సభ్యుల మధ్య వాడీవేడి చర్చ జరిగింది. టీషర్ట్స్ వేసుకుని వస్తే తప్పేంటని బీఆర్‌ఎస్ సభ్యులు ప్రశ్నించారు. పార్లమెంట్‌కు రాహుల్ గాంధీ టీషర్ట్స్ వేసుకుని వెళ్లడం లేదా అంటూ హరీశ్ రావు ప్రశ్నించారు. అనంతరం సమావేశం నుంచి బీఆర్‌ఎస్, ఎంఐఎం పార్టీలు వాకౌట్ చేశాయి. సభా పనిదినాలు, సబ్జెక్ట్‌పై క్లారిటీ ఇవ్వనందుకే వాకౌట్ చేసినట్లు ఆ పార్టీల నేతలు తెలిపారు.
నాకు తెలియదా?
అయితే అసెంబ్లీ నిబంధనల మేరకే బీఏసీ సమావేశం జరిగిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. బీఏసీలో బీఆర్ఎస్ వ్యవహరించిన తీరు సరిగ్గా లేదంటూ భట్టి మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్ని రోజులు నడుపాలన్నది స్పీకర్ నిర్ణయిస్తారని, పదేళ్లు పాలించిన వారికి ఈ విషయం తెలియదా? అంటూ ఎద్దేవా చేశారు. మాజీ మంత్రి హరీశ్ రావు చెప్పినట్లే సభా పనిదినాలు ఉండాలంటే ఎలా అని డిప్యూటీ సీఎం మండిపడ్డారు. తాను ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందో తెలియదా? అంటూ ధ్వజమెత్తారు. ఇప్పుడు కూడా సభ ఎన్ని రోజులు జరపాలో స్పీకరే నిర్ణయిస్తారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి:
KTR: లగచర్ల ఘటనపై చర్చ పెట్టమంటే పారిపోయారు: కేటీఆర్..
Hyderabad: సినిమా షూటింగ్‌లో గాయపడ్డ రెబల్ స్టార్ ప్రభాస్..
BRS: రేవంత్ సర్కార్‌పై మరో ప్లాన్‌కు సిద్ధమైన బీఆర్‌ఎస్
Updated Date - Dec 16 , 2024 | 05:36 PM