Minister Ponguleti : రెవెన్యూ సమస్యలపై మంత్రి పొంగులేటి ప్రత్యేక దృష్టి
ABN , Publish Date - Aug 25 , 2024 | 08:46 AM
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గరి నుంచి ప్రతిశాఖలోనూ వడివడిగా చర్యలు చేపడుతుంది. కీలకమైన రెవెన్యూ శాఖ ప్రక్షాళన దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఇందులో భాగంగానే ప్రభుత్వం ఈ శాఖపై నిరంతరం పర్యవేక్షిస్తుంది.
హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గరి నుంచి ప్రతిశాఖలోనూ వడివడిగా చర్యలు చేపడుతుంది. కీలకమైన రెవెన్యూ శాఖ ప్రక్షాళన దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఇందులో భాగంగానే ప్రభుత్వం ఈ శాఖపై నిరంతరం పర్యవేక్షిస్తుంది. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Minister Ponguleti Srinivasa Reddy) ఈరోజు(ఆదివారం) రాష్ట్రంలోని సబ్ రిజిస్ట్రార్ లతో కీలక సమావేశం నిర్వహించనున్నారు.
ఉదయం 10.30గంటలకు జూబ్లిహిల్స్ లోని ఎంసీహెచ్‌ఆర్డీలో భేటీ కానున్నారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ కుమార్ మిట్టల్, సబ్ రిజిస్ట్రార్లు రిజిస్ట్రార్లు,డీఐజీలు, జాయింట్ డీజీలు, ఐజీ,అదనపు ఐజీ స్థాయీ అధికారులు హాజరు కానున్నారు. భూముల మార్కెట్ విలువ పెంపుపై ప్రధానంగా చర్చించనున్నారు. ఉద్యోగుల సమస్యలు, బకాయిలతో పాటు, ఇతర రాష్ట్రాల్లో పర్యటించి వచ్చిన బృందాల నివేదికలపై చర్చించనున్నారు.