ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Minister Prabhakar: జర్నలిస్ట్‌ల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది

ABN, Publish Date - Sep 08 , 2024 | 06:44 PM

జర్నలిస్ట్‌ల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న జర్నలిస్ట్ కుటుంబాలకు కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్త చెప్పిందని అన్నారు. 18 ఏళ్ల సుదీర్ఘ సమయం తర్వాత మాజీ సీజేఐ ఎన్వీ రమణ గొప్ప నిర్ణయం వెలువరించారని మంత్రి పొన్నం ప్రభాకర్ గుర్తుచేశారు.

హైదరాబాద్: జవహర్ లాల్ నెహ్రూ హౌసింగ్ సొసైటీ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ఈరోజు (ఆదివారం) రవీంద్రభారతిలో జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ఇళ్ల పట్టాలను జర్నలిస్టులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మల్లు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, ఎంపీలు చామల కిరణ్ కుమార్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, జర్నలిస్టు సంఘాల నాయకులు, అధికారులు హాజరయ్యారు.


ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ... జర్నలిస్ట్‌ల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న జర్నలిస్ట్ కుటుంబాలకు కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్త చెప్పిందని అన్నారు. 18 ఏళ్ల సుదీర్ఘ సమయం తర్వాత మాజీ సీజేఐ ఎన్వీ రమణ గొప్ప నిర్ణయం వెలువరించారని మంత్రి పొన్నం ప్రభాకర్ గుర్తుచేశారు.


తెలంగాణలో మార్పు ఇందిరమ్మ రాజ్యంతోనే సాధ్యం : మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

గతంలో ముఖ్యమంత్రిని జర్నలిస్టులు కలవాలంటే చాలా నెలలు ఎదురు చూసే పరిస్థితి ఉండేదని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. జర్నలి‌స్ట్‌లు కనీసం తమ అభిప్రాయాలను సీఎంకు చెప్పే పరిస్థితి ఉండేది కాదని అన్నారు. పత్రికలు, జర్నలిస్ట్‌లను కించపరిచేలా మాట్లాడే సంస్కృతికి గత ప్రభుత్వంలో పెద్దలు శ్రీకారం చుట్టారని విమర్శలు చేశారు.


ప్రశ్నిస్తే జర్నలిస్ట్‌ల మీద కేసులు పెట్టే పరిస్థితి ఉండేదని తెలిపారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఎలాంటి అనుమానాలు ఉన్నా నేరుగా తమను అడగవచ్చు అని చెప్పారు. జర్నలిస్టులు ముఖ్యమంత్రిని కలవలన్న ఇప్పుడు ఆపేవారు లేరని అన్నారు. హైడ్రాపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోందని వివరించారు. తెలంగాణలో మార్పు ఇందిరమ్మ రాజ్యంతోనే సాధ్యమైందని అన్నారు.


జర్నలిస్ట్‌లకు కాంగ్రెస్ అండగా ఉంటుందని మాట ఇచ్చి నిలబెట్టుకుంటున్నామని అన్నారు. రూ. 31 వేల కోట్లను రైతులకు రుణమాఫీ చేసి చూపించామని స్పష్టం చేశారు.ప్రభుత్వం వద్ద డబ్బులు లేకున్నా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పెద్ద మనసు చేసుకుని రైతులకు న్యాయం చేశారని వివరించారు. రుణమాఫీ, వరదలను కూడా బీఆర్ఎస్ నేతలు చిల్లర రాజకీయాల కోసం వాడుకున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు రెండు సార్లు కర్రు కాల్చి వాత పెట్టిన బీఆర్ఎస్ నేతలకు బుద్ధి రావడం లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వార్నింగ్ ఇచ్చారు.

Updated Date - Sep 08 , 2024 | 06:47 PM

Advertising
Advertising