Minister Seethakka: దివ్యాంగులకు పింఛన్ పెంపు ఎప్పుడంటే.. సీతక్క కీలక వ్యాఖ్యలు
ABN, Publish Date - Dec 03 , 2024 | 09:18 PM
తెలంగాణ రాష్ట్రంలో 10 లక్షల మంది దివ్యంగులు ఉన్నారు. వారి సంక్షేమానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రజా ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమం కోసం రూ.50 కోట్లను కేటాయించిందని అన్నారు.
హైదరాబాద్: దివ్యాంగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ స్యూస్ చెప్పింది. త్వరలోనే దివ్యాంగుల పెన్షన్లు పెంచుతామని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ(సీతక్క) హామీ ఇచ్చారు. యూపీఏ ప్రభుత్వం ఇచ్చిన పెన్షన్లనే మోదీ ప్రభుత్వం కొనసాగిస్తుందని తెలిపారు. రవీంద్రభారతిలో జ్యోతి వెలిగించి ఇవాళ(మంగళవారం) అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ వేడుకలను ప్రారంభించారు. ప్రపంచ దివ్యంగుల దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్న ముత్తినేని వీరయ్య, అనిత రామచంద్రన్, శైలజాలకు అభినందనలు చెప్పారు. దివ్యాంగుల సంఘాలకు, కుటుంబ సభ్యులకు పేరుపేరునా అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం శుభాకాంక్షలు చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం గత పదేళ్లుగా వికలాంగుల పింఛన్ పెంచట్లేదని ఆరోపించారు. దివ్యాంగులకు నెలకు రూ.300 పించనే మాత్రమే కేంద్రం ఇస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం దివ్యాంగుల పెన్షన్ పెంచాలని డిమాండ్ చేశారు. పెరిగిన ధరలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం పెన్షన్ల వాటాను పెంచాలని కోరారు. ప్రధాని మోదీకి దగ్గరగా ఉన్న ఎంపీలు, మద్దతుగా ఉండే నాయకులు కేంద్ర ప్రభుత్వం పింఛన్లు పెంచేలాగా చొరవ తీసుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వాలు పింఛన్లు పెంచినా కేంద్ర ప్రభుత్వం ఎందుకు పెంచట్లేదని ప్రశ్నించారు. మహిళల వేషధారణులను కించపరచడం తగదని మంత్రి సీతక్క అన్నారు.
ఆత్మనూన్యత భావానికి గురికావద్దు..
‘‘మనలో ఉన్న లోపాలను చూసి బాధపడొద్దు. బాధను వదిలేసి ముందడుగు వేయాలి. మీ ప్రతిభ చూస్తే మీరు సకలాంగులకు తక్కువేమీ కాదు.చిన్న లోపాన్ని చూసుకుని మానసికంగా కుంగి పోవద్దు. కాళ్లు చేతులు లేకున్నా.. నేడు మీ ప్రతిభను బయటకు తీసుకొచ్చారు. అదే ఆత్మవిశ్వాసంతో అడుగులేయండి.ఆకాశమే హద్దుగా ఎదిగే శక్తి మీ సొంతం. ఆత్మ న్యూనత అవసరం లేదు. అన్ని బాగుండాలి అని కోరుకునే అవకాశం మనకు లేదు. కొందరు దివ్యాంగులుగా పుడతారు, మధ్యలో ప్రమాదాల్లో దివ్యాంగులుగా మారుతారు. అవయవ లోపాలను మన తప్పులుగా భావించి ఆత్మ నూన్యత భావానికి గురికావద్దు. ఆత్మవిశ్వాసంతో అడిగేయండి.ఎంతోమంది ఐఏఎస్ లయ్యారు .తమ మీదస్సుతో ప్రపంచాన్ని మార్చారు. హెలెన్ కెల్లర్ మనకు ఆదర్శవంతంగా ఉన్నారు. దివ్యాంగుల సంక్షేమ హాస్టల్లో చదువుకుని 87 మంది ప్రభుత్వ ఉద్యోగాల్లో సెలెక్ట్ అవ్వడం గొప్ప విషయం .వారి జీవితాలను స్ఫూర్తిగా తీసుకొని ముందడుగు వేయాలి. తెలంగాణ ప్రజా ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమం కోసం రూ.50 కోట్లను కేటాయించింది. గతంలో కేవలం కోటి రూపాయలు కేటాయించేవారు. దివ్యాంగుల సంక్షేమం, ఉపాధి కోసం నిధులు వెచ్చిస్తున్నాం. మీకు ప్రత్యేకంగా జాబ్ పోర్టర్లను అందుబాటులోకి తెచ్చాం. ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు ఇస్తున్నాం. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం. రైతు రుణమాఫీ వంటి వాటికోసం రూ.21 వేల కోట్లు కేటాయించాం. రైతు పంట పండియకపోతే అందరూ ఉపాసం ఉండాల్సి వస్తుంది. అందుకే రైతును ప్రోత్సహించేందుకు రూ.21వేల కోట్ల నిధులు వెచ్చించాం. అందుకే పెన్షన్ పెంపులో కాస్త ఆలస్యం అవుతుంది. ఈ ప్రభుత్వం దివ్యాంగుల కష్టాలు తెలిసిన ప్రభుత్వం. మీ స్వయం ఉపాధి కోసం స్కూటర్లు ఇస్తాం. మీరు ఈర్ష ద్వేషాలు పెంచుకోవద్దు. మనమంతా ఒకే కుటుంబ సభ్యులం. మనల్ని మనం గౌరవించుకోవాలి.. ఒకరికొకరు తోడుగా ఉండి సహకరించుకోవాలి’’ అని మంత్రి సీతక్క తెలిపారు.
ట్రాన్స్‌జెండర్‌ల కోసం ప్రత్యేక క్లినిక్‌లు..
‘‘ఒకరికొకరు చేయుతగా ఉండాలి.. ఐఖ్యతతో అంతా సంతోషం ఉండాలి. పుట్టుక, చావు మన చేతుల్లో లేవు. పుట్టక గిట్టుకకు మధ్య ఉన్న ఈ కాలాన్ని అద్భుతంగా మలుచుకోవడమే మన బాధ్యత. వైఖల్యాన్ని చూసి బాధపడకుండా.. మన శక్తిని బయటకు తీయాలి.. ప్రభుత్వం ఎప్పుడు మీకు అండగా ఉంటుంది. రాష్ట్రంలో 10 లక్షల మంది దివ్యంగులు ఉన్నారు. వారి సంక్షేమానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. తమకున్న శక్తి సామర్థ్యాలను ఉపయోగించి సమాజాభివృద్ధి కోసం మీరు పాటుపడుతున్నారు . ఆత్మస్థైర్యం అనేది అతి ముఖ్యం. ఏదో ఒక రంగంలో పట్టుదలగా రాణించండి. సమాజాభివృద్ధిలో మీ వంతు పాత్ర పోషించండి. ట్రాన్స్‌జెండర్‌ల కోసం ప్రత్యేక క్లినిక్‌లను ఏర్పాటు చేస్తున్నాం. పోలీస్ శాఖలో వారికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాం. ట్రాఫిక్ విభాగంలో వారి సేవలను వినియోగించు కుంటం. ఈనెల 7న ముఖ్యమంత్రి ట్రాఫిక్ విభాగంలో ట్రాన్స్ జెండర్లకు నియామక పత్రాలను అందజేస్తారు. ఆత్మ స్థైర్యంతో అందరూ ముందు అడుగు వేయండి. సూటి పోటు మాటలు అన్న అధైర్య పడొద్దు. కష్టపడి అంగవైకల్యాన్ని జయించండి. మీ విజయాన్ని ప్రపంచమే గర్విస్తోంది. ఐక్యంగా ఆత్మ విశ్వాసంతో ముందుకు సాగండి..ప్రభుత్వం అండగా ఉంటుంది’’ అని మంత్రి సీతక్క పేర్కొన్నారు.‘
Updated Date - Dec 03 , 2024 | 09:35 PM