Minister Seethakka: విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు.. అధికారులకు మంత్రి సీతక్క వార్నింగ్
ABN, Publish Date - Oct 26 , 2024 | 03:42 PM
తెలంగాణలో ఎక్కడా తాగునీటి సరఫరాలో సమస్య రానీయకూడదని మంత్రి సీతక్క ఆదేశించారు. శుద్ధి చేసిన నీరే సరఫరా అయ్యేలా చూడాలని సూచించారు. రిజర్వాయర్లలో సరిపోయినంత నీటి నిలువలు ఉన్నాయని.. వాటిని సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు.
హైదరాబాద్: కోట్లాదిమంది ప్రాణాలు మిషన్ భగీరథ సిబ్బంది చేతిలో ఉన్నాయని.. అందుకే అధికారులు అంతా బాధ్యతతో పనిచేయాలని మంత్రి సీతక్క అన్నారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. గత వేసవికాలంలో నీటి ఎద్దడి ఉన్నా ఎలాంటి సమస్య లేకుండా తాగునీటిని అందించామని స్పష్టం చేశారు. 13456 మంచినీటి సహాయకులకు శిక్షణ ఇచ్చామని గుర్తుచేశారు.
ALSO READ: Hyderabad: 'పాలు తాగే పిల్లాడున్నాడు.. వదిలేయండి ప్లీజ్'.. బెటాలియన్ పోలీసుల నిరసనల్లో తల్లి ఆవేదన
ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నెంబర్‌ను త్వరలో అందుబాటులోకి తెస్తామని అన్నారు. ఎర్ర మంజిల్‌లోని మిషన్ భగీరథ కార్యాలయంలో జిల్లాల వారీగా అధికారులతో మంత్రి సీతక్క ఇవాళ(శనివారం) సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాల వారీగా గ్రామీణ మంచి నీటి సరఫరా వ్యవస్థ పనితీరుపై సమీక్షించారు. ఈ సమావేశానికి పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ కార్యదర్శి లోకేష్ కుమార్, మిషన్ భగీరథ ఈఎన్సీ కృపాకర్ రెడ్డి, CE, SE,EEలు హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ... తెలంగాణలో ఎక్కడా తాగునీటి సరఫరాలో సమస్య రానీయ కూడదని ఆదేశించారు. శుద్ధి చేసిన నీరే సరఫరా అయ్యేలా చూడాలని సూచించారు. రిజర్వాయర్లలో సరిపోయినంత నీటి నిల్వలు ఉన్నాయని.. వాటిని సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. లోకల్ సోర్స్‌ల మీద దృష్టి పెట్టాలని అన్నారు. ప్రతి ఐదు, ఆరు నియోజకవర్గాలను ఒక యూనిట్‌గా ప్రణాళికలు రూపొందించాలని అన్నారు. చాలా గ్రామాల్లో మిషన్ భగీరథ నీరు వస్తున్నా ప్రజలు బోర్లు వేయించాలని, ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేయాలని కోరారు. మిషన్ భగీరథపై వేల కోట్లు ఖర్చుపెట్టిన తర్వాత బోర్ల మీద, ఆర్వో ప్లాంట్ల మీద ప్రజలు డిపెండ్ అవుతున్నారని అన్నారు.
ALSO READ: Jaggareddy: ఎవ్వరినీ వదలా... మీడియాపై జగ్గారెడ్డి ఫైర్
ప్రతి గృహానికి నల్లా నీరు అందేలా చర్యలు...
‘‘ఆ విధానం పోయేలా మిషన్ భగీరథ సిబ్బంది పని చేయాలి. మిషన్ భగీరథ నీళ్లపై ప్రజలకు నమ్మకం కలిగించాలి. ప్రతి గృహానికి నల్లా నీరు అందేలా చర్యలు చేపట్టాలి.మిషన్ భగీరథ ట్యాంకులను తరచూ శుభ్ర పరచాలి. మిషన్ భాగీరథ పైప్ లైన్ల లీకేజీని అరికట్టాలి. తాగునీటి సరఫరాపై అన్ని గ్రామాల నుంచి నెలవారీగా నివేదికలు తెప్పించండి.నీటి సరఫరాలో సమస్య తలెత్తుతున్న ఉట్నూర్ వంటి ప్రాంతాల్లో అదనపు సిబ్బందిని డిప్యూట్ చేయండి. క్షేత్రస్థాయిలో ఏ చిన్న సమస్య తలెత్తినా పై అధికారులకు సమాచారం ఇవ్వాలి. ఏ నెలలో ఏ పని చేయాలో క్యాలెండర్‌ను రూపొందించుకోవాలి. ప్రతి ఏఈ చేతిలో యాక్షన్ ప్లాన్ ఉండాలి. ఆయా గ్రామాల్లో ఏదన్నా సమస్యతో మిషన్ భగీరథ నీరు రాకపోతే ప్రత్యామ్నాయం చేసుకోవాలి. మోటు పాట్లు సవరించుకొని పనితనాన్ని మెరుగుపరుచుకోవాలి’’ అని మంత్రి సీతక్క పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
Lawrence Bishnoi: జైల్లో గ్యాంగ్‌స్టర్ ఇంటర్వ్యూ.. డీఎస్పీ సహా ఏడుగురు పోలీసులపై వేటు
TG Police: పోలీసు, పొలిటికల్ వర్గాల్లో సంచలనంగా మారిన అజ్ఞాత వ్యక్తి లేఖ..
Read Latest Telangana News And Telugu News
Updated Date - Oct 26 , 2024 | 03:47 PM