ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Minister Tummala: రుణమాఫీ పథకం-2024పై మంత్రి తుమ్మల సమీక్ష..

ABN, Publish Date - Aug 23 , 2024 | 07:10 PM

రైతు రుణమాఫీ(Rythu Runa Mafi) చేయడంలో క్షేత్రస్థాయిలో తలెత్తిన సమస్యలు పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Tummala Nageswara Rao) తెలిపారు. సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా రూపొందించిన మెుబైల్ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తుమ్మల వెల్లడించారు.

హైదరాబాద్: రైతు రుణమాఫీ(Rythu Runa Mafi) చేయడంలో క్షేత్రస్థాయిలో తలెత్తిన సమస్యలు పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Tummala Nageswara Rao) తెలిపారు. సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా రూపొందించిన మెుబైల్ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తుమ్మల వెల్లడించారు. ఈ మేరకు రుణమాఫీ పథకం-2024పై అధికారులతో మంత్రి తుమ్మల సమీక్షా సమావేశం నిర్వహించారు.


ఈ సందర్భంగా రైతు రుణమాఫీ సమస్యలు పరిష్కరించే దిశగా చేపట్టిన చర్యలను మంత్రి తుమ్మల అధికారులను అడిగి తెలుసుకున్నారు. రూ.2లక్షలలోపు కుటుంబ నిర్ధారణ లేని 4,24,873 ఖాతాదారుల సమాచారాన్ని సేకరించేందుకు వీలుగా కొత్త యాప్ తీసుకువచ్చినట్లు మంత్రి తెలిపారు. వ్యవసాయాధికారులు స్వయంగా రైతుల ఇళ్లకు వెళ్లిగాని లేదా రైతు వేదికలు, కార్యాలయాల్లో అందుబాటులో ఉండి వారి ఫిర్యాదులు స్వీకరించాలని మంత్రి అధికారులను ఆదేశించారు.


వివరాలు తప్పుగా నమోదైన 1,44,545 ఖాతాలకు సంబంధించి ఇప్పటికే 41,322అకౌంట్లు సరి చేసినట్లు మంత్రి వెల్లడించారు. వివిధ బ్యాంకుల్లో ఉన్న ఖాతాదారుల అకౌంట్లలో ప్రభుత్వం జమ చేసే మొత్తాలను అన్నదాతలకు అందేటట్లు చర్యలు తీసుకోవాల్సిందిగా తుమ్మల ఆదేశాలు జారీ చేశారు. రెన్యువల్ అయిన ఖాతాలకు సొమ్మును తిరిగి చెల్లించేలా, మాఫీ అయిన అకౌంట్లకు సంబంధించి తిరిగి కొత్త రుణాలు మంజూరు చేసే విధంగా బ్యాంకు అధికారులు చర్యలు చేపట్టాలని మంత్రి తుమ్మల సూచించారు.

Updated Date - Aug 23 , 2024 | 07:48 PM

Advertising
Advertising
<