ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Minister Uttam: రామ మందిరం అంశాన్ని బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఈవెంట్‌గా మారుస్తున్నారు

ABN, Publish Date - Jan 13 , 2024 | 07:37 PM

తామంతా రామ భక్తులమేనని రామ మందిరం అంశాన్ని బీజేపీ ( BJP ) , ఆర్ఎస్ఎస్ ( RSS ) ఈవెంట్‌గా మారుస్తున్నారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ( Minister Uttam Kumar Reddy ) అన్నారు.

సూర్యాపేట: తామంతా రామ భక్తులమేనని రామ మందిరం అంశాన్ని బీజేపీ ( BJP ) , ఆర్ఎస్ఎస్ ( RSS ) ఈవెంట్‌గా మారుస్తున్నారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ( Minister Uttam Kumar Reddy ) అన్నారు. శనివారం నాడు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంత్రి ఉత్తమ్ మీడియాతో మాట్లాడుతూ... బీజేపీ ఎంపీ బండి సంజయ్ పిచ్చిగా మాట్లాడుతున్నాడని.. ఆయన వ్యాఖ్యలు దురదృష్టకరమన్నారు. శంకరాచార్యులు, మఠాధిపతులు కొంతమంది రామమందిర ప్రతిష్ఠకు దూరంగా ఎందుకు ఉంటున్నారో బండి సంజయ్ సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. పార్లమెంట్ ఎన్నికల్లో సునాయాసంగా విజయం సాధిస్తామని చెప్పారు. మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ లాంటి వారు బరిలోకి దిగినా 13-14 స్థానాల్లో సునాయాసంగా గెలుస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో పాజిటివ్ అభిప్రాయం మరింతగా బలపడుతుందన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అభివృద్ధి యజ్ఞం గతం కంటే మెరుగ్గా కొనసాగుతుందని చెప్పారు. ఆరు గ్యారంటీల అమలుకు కట్టుబడి ఉన్నామన్నారు. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా ఉంటుందన్నారు. రాజకీయ పక్షపాతం లేకుండా సంక్షేమ ఫలాలు అందరికీ అందిస్తామన్నారు. ఉమ్మడి జిల్లాలో పెండింగ్ నీటిపారుదల ప్రాజెక్టులు పూర్తి చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.

Updated Date - Jan 13 , 2024 | 07:37 PM

Advertising
Advertising