ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Minister Uttam: వరద నష్ట్రాన్ని త్వరగా అంచనా వేయండి.. మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు

ABN, Publish Date - Sep 03 , 2024 | 10:07 PM

లంగాణలో నాలుగు రోజులుగా భారీ వర్షాలు పడుతున్నాయి. వానలు కుండపోతగా కురుస్తుండటంతో రాష్ట్రంలోని ప్రధాన చెరువులు అన్ని పొంగి ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పలు కాలనీలు జలమయం అయ్యాయి. దీంతో ప్రజలు నరకయాతన పడుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం సహాయక చర్యలను ముమ్మరం చేసింది. సహాయక చర్యల్లో భాగంగా హుజూర్ నగర్ నియోజకవర్గంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విస్తృతంగా పర్యటించి బాధితులకు ధైర్యం చెప్పారు.

Minister Uttam Kumar Reddy

సూర్యాపేట : తెలంగాణలో నాలుగు రోజులుగా భారీ వర్షాలు పడుతున్నాయి. వానలు కుండపోతగా కురుస్తుండటంతో రాష్ట్రంలోని ప్రధాన చెరువులు అన్ని పొంగి ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పలు కాలనీలు జలమయం అయ్యాయి. దీంతో ప్రజలు నరకయాతన పడుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం సహాయక చర్యలను ముమ్మరం చేసింది. సహాయక చర్యల్లో భాగంగా హుజూర్ నగర్ నియోజకవర్గంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈరోజు(మంగళవారం) విస్తృతంగా పర్యటించి బాధితులకు ధైర్యం చెప్పారు.


హుజుర్‌నగర్ పట్టణంలోని దద్దనాల చెరువు, బురుగ్గడ్డ గ్రామంలోని నల్ల చెరువును మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సందర్శించారు. చెరువుకింద పొలాలు ఇసుక మేటలతో, రాళ్లు రప్పలతో, మట్టి దిబ్బలతో నిండిపోయిన అంశంపై నష్టం తాలూకు వివరాలు సేకరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మఠంపల్లి మండలం చౌటపల్లి ఊర చెరువును మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించారు. మఠంపల్లి మండలంలో వర్షపు ఉధృతికి దెబ్బతిన్న ప్రాంతాల్లో పర్యటించి బాదితులకు అండగా ఉంటామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు.


బీఆర్ఎస్ నేతలపై దాడి మంత్రి తుమ్మల ఏమన్నారంటే..?

ఖమ్మం: బీఅర్ఎస్ మాజీమంత్రులపై దాడులు స్థానిక నేతల మధ్య గొడవలు అని మంత్రి తుమ్మలనాగేశ్వరరావు తెలిపారు. తన నలభై ఏళ్ల రాజకీయ జీవితం ప్రజలకు తెలుసునని స్పష్టం చేశారు. చిల్లర గొడవలతో రాజకీయం కరెక్ట్ కాదని హెచ్చరించారు. ఎవ్వరు ప్రేరేపించినా దాడులు సరైంది కాదని అన్నారు. వరద బాధితులకు సహాయ చర్యలు చేసే క్రమంలో రాజకీయ వివాదాలు మంచిది కాదని తేల్చిచెప్పారు. వరంగల్ డిక్లరేష‌న్‌లో ఏఐసీసీ అత్రనేత రాహుల్ గాంధీ వాగ్దానంతో రైతు రుణమాఫీ చేశామని తెలిపారు. ప్రాజెక్టులు నిండి రైతులు సంతోషంగా ఉన్నవేళ భారీ వర్షాలు ఉపద్రవంలా వచ్చాయని ఆందోళనవ వ్యక్తం చేశారు.


మున్నేరు ప్రాంతంలో 40 సెంటి మీటర్ల వర్షం ఈ వందేళ్లలో ఎన్నడూ కురవలేదని వివరించారు. రైతుల చేతికి పంట అందే దశలో పంటలు నష్టపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. రూ. కోటి 18 లక్షల ఎకరాల్లో పంటలు సాగులో ఉన్నాయని చెప్పారు. లక్షన్నర ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని వాపోయారు. విత్తనాలు, ఎరువులు రైతులకు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాలో పంట నష్టం ఎక్కువగా వాటిల్లిందని చెప్పారు. ఖమ్మం మున్నేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయ చర్యలు వేగంగా సాగుతున్నాయని తెలిపారు. ఖమ్మం పది డివిజన్స్‌లో వరద ముంపు వాటిల్లిందని అన్నారు.


ఈ రోజులోగా శానిటేషన్ మంచినీరు సరఫరా అవుతుందని తెలిపారు. ఖమ్మం నగరంలో విద్యుత్ పునరుద్ధరణ పనులు యుద్ధ ప్రాతిపదికన సాగుతున్నాయని వివరించారు. వరద బాధితులకు నిత్యావసర సరుకుల పంపిణీ సాగుతుందని తెలిపారు. వరద బాధితులకు పలు స్వచ్ఛంద సంస్థలు భోజనాలు అందిస్తున్నాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.


ఎల్లంపల్లి పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేస్తాంఫ మంత్రి శ్రీధర్ బాబు

మంచిర్యాల : శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోని పెండింగ్ పనులను త్వరలోనే పూర్తి చేస్తామని మంత్రి శ్రీధర్ బాబు హామీ ఇచ్చారు. వరదల నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగానే తాము పర్యటిస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ హయాంలో నిర్మించిన ఈ ప్రాజెక్టును బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదు, ప్రారంభోత్సవం కూడా జరుపలేదని విమర్శలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి ప్రాజెక్టుకు ప్రారంభోత్సవం చేస్తామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.


భారీ వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎమ్మెల్యే యెన్నం శ్రీనినాస్ రెడ్డి

మహబూబ్ నగర్: పట్టణంలో 2053 వరకు తాగునీటి సమస్యలు లేకుండా చేసేందుకు రూ. 110 కోట్లతో ప్రణాళికలు సిద్దం చేశామని ఎమ్మెల్యే యెన్నం శ్రీనినాస్ రెడ్డి తెలిపారు. వాతావరణశాఖ సూచనతో మరో రెండుమూడు రోజులు పట్టణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 2014 నుంచి ఇప్పటి వరకు జరిగిన నిర్మాణాలు, ఆక్రమణలపై అదికారులు వివరాలు సేకరిస్తున్నారని చెప్పారు. మహబూబ్ నగర్ పట్టణంలో కూడా హైడ్రా తరహా చర్యలు చేపడతామని తెలిపారు. రాజకీయ జోక్యం లేకుంటే అధికారులు వారిపని వాళ్లు చేసుకుంటారని స్పష్టం చేశారు.. అధికారుల పనిలో తమ జోక్యం ఉండదని ఎమ్మెల్యే యెన్నం శ్రీనినాస్ రెడ్డి స్పష్టం చేశారు.

Updated Date - Sep 03 , 2024 | 10:15 PM

Advertising
Advertising