ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

MLA Adi Srinivas: కాంగ్రెస్‌లోకి హరీష్‌రావు.. ఆది శ్రీనివాస్ షాకింగ్ కామెంట్స్

ABN, Publish Date - Dec 02 , 2024 | 08:49 PM

అబద్దాలు మాట్లాడే హరీష్ రావు ఇప్పటి నుంచైనా నిజాలు మాట్లాడాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కోరారు.బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కొప్పడటం వల్ల హరీష్ రావు వార్తలు సైతం మీడియాలో రాలేదన్నారు. హరీష్ రావుకు అన్ని తెలిసినా పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని ఆది శ్రీనివాస్ మండిపడ్డారు.

హైదరాబాద్: మాజీ మంత్రి హరీష్ రావుపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పంచుల వర్షం కురిపించారు. కాళేశ్వరరావు ఇప్పుడు కూలేశ్వరరావుగా మారిపోయారని ఎద్దేవా చేవారు. హరీష్ రావు కాంగ్రెస్‌లోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేసింది నిజం కాదా అని ప్రశ్నించారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిని కలిసి కాంగ్రెస్‌లోకి వస్తానని అడిగింది వాస్తవం కాదా అని నిలదీశారు. హరీష్ ప్రయత్నాలు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కి తెలిసి దూరం పెట్టలేదా అని నిలదీశారు. కేసీఆర్ కొప్పడటం వల్ల హరీష్‌రావు వార్తలు సైతం మీడియాలో రాలేదన్నారు. హరీష్ రావుకు అన్ని తెలిసినా పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని ఆది శ్రీనివాస్ మండిపడ్డారు.


పార్టీ ఫిరాయింపులపై మాట్లాడే అర్హత హరీష్ రావుకు ఎక్కడిదని ప్రశ్నించారు. సీఎల్పీ మీడియా పాయింట్‌లో ఆది శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ.. హరీష్‌రావు మార్ఫింగ్ సినిమా చూపిస్తున్నారని విమర్శలు చేశారు. బీఆర్ఎస్ సినిమా అయిపోయిందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎపిసోడ్ నడుస్తోందని చెప్పారు. రైతుల వడ్డీలు కూడా బీఆర్ఎస్ కట్టలేకపోయిందన్నారు. రైతులు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇస్తున్న మద్దతు చూసి హరీష్‌రావు కళ్లలో నిప్పులు పోసుకుని మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పదేళ్లలో రైతులకు రూ.80 వేల కోట్లు వేశామని హరీష్ అబద్ధాలు చెబుతున్నారని ఆది శ్రీనివాస్ ధ్వజమెత్తారు.


తాము పది మాసాల్లో రూ. 22 వేల కోట్లు రైతులకు రుణమాఫీ చేశామని ఉద్ఘాటించారు. రైతులపై కాంగ్రెస్ పార్టీకి పేటెంట్ హక్కు ఉందన్నారు. వాగులు, వంకలు, కొండలు, కొనలకు కేసీఆర్ ప్రభుత్వం రైతుబంధు వేసిందని ఆరోపించారు. కౌలు రైతులకు సైతం తమ ప్రభుత్వంలో బోనస్ ఇచ్చామని గుర్తుచేశారు. కేసీఆర్ ఇచ్చిన బతుకమ్మ చీరలను పంట చేలల్లో బెదురుకు వాడిన విషయం మర్చిపోవద్దని అన్నారు. గత పదేళ్లలో ఒక్క డీఏస్సీ కూడా ఎందుకు వేయలేదని ఆది శ్రీనివాస్ ప్రశ్నించారు.


కేసీఆర్ చేసిన కుటుంబ సర్వే లాభం ఏంటని నిలదీశారు. తాము ఎవరి లెక్క ఎంతో తేల్చడానికి సర్వే చేస్తున్నామని అన్నారు. బీఆర్ఎస్ నాయకులు బీసీ కుల గణనకు అనుకూలమా.. వ్యతిరేకమా.. చెప్పాలన్నారు. అక్రమ నిర్మాణాలు కూల్చాలని కేసీఆర్ అనలేదా అని నిలదీశారు. హైదరాబాద్ మునిగిపోవాలని బీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారా అని అడిగారు. అబద్దాలు మాట్లాడే హరీష్‌రావు ఇప్పటి నుంచైనా నిజాలు మాట్లాడాలని కోరారు. ఈ సీజన్‌లో కాళేశ్వరం నుంచి ఒక్క చుక్క కూడా వినియోగంలోకి రాలేదని ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు.

Updated Date - Dec 02 , 2024 | 09:26 PM