ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

MLC Vani Devi: కాంగ్రెస్ పాలన అలా ఉంది.. ఎమ్మెల్సీ వాణిదేవి విసుర్లు

ABN, Publish Date - Dec 14 , 2024 | 01:27 PM

ఏడాది కాంగ్రెస్ పాలన పాత చీకటి రోజులను గుర్తు చేస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వాణిదేవి అన్నారు. శిల్ప శాస్త్రం ప్రకారం కేసీఆర్ తెలంగాణ తల్లి విగ్రహాన్ని తయారు చేయించారని చెప్పారు. తెలంగాణ తల్లి గొప్పగా ఉండాలి.. కానీ బీదగా ఉండవద్దని తెలిపారు. ప్రజల భావోద్వేగాలను కాంగ్రెస్ ప్రభుత్వం దెబ్బతీసే కుట్ర చేస్తోందని వాణిదేవి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

హైదరాబాద్: కేసీఆర్ పాలనలో తెలంగాణ స్వర్ణయుగాన్ని తలపించిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వాణిదేవి తెలిపారు. సోమాజీగూడ ప్రెస్ క్లబ్‌లో ఇవాళ(శనివారం) తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, ప్రభుత్వ మాజీ సలహాదారు రమణాచారి, జూలూరి గౌరీశంకర్, ఆయాచితం శ్రీధర్, తేలు విజయ, దేవీప్రసాద్, కవులు, కళాకారులు, మేధావులు, కవులు, కళాకారులు, ప్రొఫెసర్లు, ఉద్యమకారులు, ఎస్సీ,ఎస్టీ, బీసీ సంఘాల నేతలు హాజరయ్యారు.


సోమాజీగూడా ప్రెస్ క్లబ్ లో ఉదయం 11గంటలకు సమావేశం ప్రారంభమైంది. తెలంగాణ తల్లి విగ్రహం రూపాన్ని మార్చడం, తెలంగాణ అస్తిత్వం వంటి అంశాలపై జాగృతి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశంలో చర్చించారు. అమరవీరుల స్థూపం, ఉద్యమ తెలంగాణ తల్లి విగ్రహానికి ఎమ్మెల్సీ కవిత నివాళులర్పించారు. ఉద్యమ తెలంగాణ తల్లి రూపాన్నే కొనసాగించాలని కవిత డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వాణిదేవి తెలంగాణ జాగృతి రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఏడాది కాంగ్రెస్ పాలన పాత చీకటి రోజులను గుర్తు చేస్తుందని అన్నారు. శిల్ప శాస్త్రం ప్రకారం కేసీఆర్ తెలంగాణ తల్లి విగ్రహాన్ని తయారు చేయించారని చెప్పారు. తెలంగాణ తల్లి గొప్పగా ఉండాలి.. కానీ బీదగా ఉండవద్దని తెలిపారు. ప్రజల భావోద్వేగాలను కాంగ్రెస్ ప్రభుత్వం దెబ్బతీసే కుట్ర చేస్తోందని వాణిదేవి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.


రాష్ట్ర ప్రజలను అవమానించేలా ఆ జీవో : కవిత

తెలంగాణ తల్లి విగ్రహం రూపాన్ని ఇష్టం వచ్చినట్లు మార్చడమే కాకుండా.. ఎవరైనా ఇదే విగ్రహం పెట్టాలి.. లేదంటే కేసులు పెడతాం అంటూ రేవంత్‌ రెడ్డి సర్కార్‌ రాష్ట్ర ప్రజలను అవమానించేలా జీవో తెచ్చిందని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. గెజిట్‌ ఇవ్వడం వెనుక ఉద్దేశం ఏమిటని, అసలు తెలంగాణ తల్లి రూపాన్ని ఎలా మారుస్తారని ఆమె ప్రశ్నించారు. ప్రభుత్వం ఎన్ని జీవోలిచ్చినా.. ఉద్యమస్ఫూర్తితో గతప్రభుత్వం రూపొందించిన విగ్రహాన్ని ఊరూరా ఊరేగించి.. నిలుపుకొంటామని కవిత తెలిపారు.


తెలంగాణ జాగృతి, బీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపడతామని, వేలసంఖ్యలో తెలంగాణ తల్లి విగ్రహాలను ఆవిష్కరించుకుంటామన్నారు. ఆడబిడ్డలకు ఆత్మగౌరవమైన బతుకమ్మను అవమానిస్తూ.. కించపరిచి మాట్లాడిన మంత్రులు, కాంగ్రెస్‌ నాయకులకు ఏశిక్ష వేస్తారో సీఎం రేవంత్‌రెడ్డి చెప్పాలని కవిత డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ నాయకులు ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని ఎమ్మెల్సీ కవిత హెచ్చరించారు.


ఈ వార్తలు కూడా చదవండి

Allu Arjun: చంచల్‌గూడ జైలు నుంచి అల్లు అర్జున్‌ విడుదల

Hyderabad: సీఎం రేవంత్‏కు ఎమ్మెల్యే రాజాసింగ్‌ లేఖ.. దాంట్లో ఏమున్నదంటే..

For Telangana News And Telugu News

Updated Date - Dec 14 , 2024 | 02:24 PM