TG GOVT: పార్లమెంటులో మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్టు ప్రస్తావన
ABN, Publish Date - Nov 27 , 2024 | 03:48 PM
రాష్ట్ర ప్రభుత్వానికి మానస పుత్రిక మూసీ నది అభివృద్ధి ప్రాజెక్టును త్వరలోనే పట్టాలెక్కించేందుకు అధికార యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ పరిధిలోని తాత్కాలిక, శాశ్వత నిర్మాణాలను త్వరలోనే తొలగించనున్నారు. మూసీపై పార్లమెంట్‌లో చర్చ జరిగింది.
ఢిల్లీ: పార్లమెంటులో మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్టు ప్రస్తావన వచ్చింది. నదీ పునర్జీవనం కోసమే మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టు చేపట్టినట్లు కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టు కోసం పెద్ద ఎత్తున కూల్చివేతలు ఉండవని రాష్ట్ర ప్రభుత్వం సమాచారం ఇచ్చింది. పెద్దఎత్తున ప్రజలను నిరశ్రాయులు చేయమని కూడా రాష్ట్ర ప్రభుత్వం తెలిపిందని అన్నారు. అవసరం మేరకు మాత్రమే తొలగింపులు తరలింపు చేస్తామని పేర్కొంది.తొలగింపులు, తరలింపులు చెస్తే బాధిత కుటుంబాలకు తగిన విధంగా సహాయ పునరావాస చర్యలు చేపడతామని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.
నదీ పునర్జీవనం కోసం భూసేకరణకు, భూములు కోల్పోయే బాధిత కుటుంబాలకు విషయంలో సంబంధిత చట్టాల ప్రకారం ముందుకు వెళ్తామని కూడా రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. మూసీ నదీ గర్భం నుంచి, బఫర్ జోన్ నుంచి తరలించే వారికోసం మానవతా దృక్పథంతో 15 వేల ఇళ్లను కేటాయించినట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. నదీ పునర్జీవం, కాలుష్య నివారణ , వరదల బారి నుంచి కాపాడేందుకే మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. బాధిత కుటుంబాల కోసం వారి జీవన ప్రమాణాలకు మద్దతు కోసం ఒక కమిటీని కూడా నియమించినట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు, ప్రజల నుంచి వస్తున్న ఆందోళనలు గురించి రాజ్యసభలో బీఆర్ఎస్ ఎంపీ కేఆర్ సురేష్ రెడ్డి ప్రస్తావించారు. సురేష్ రెడ్డి అడిగిన ప్రశ్నకు రాతపూర్వక సమాధానంలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి టోకెన్ సాహు వివరాలు వెల్లడించారు.
మాసీ ప్రాజెక్టుపై అధికార యంత్రాంగం సన్నాహాలు
కాగా.. రాష్ట్ర ప్రభుత్వానికి మానస పుత్రిక మూసీ నది అభివృద్ధి ప్రాజెక్టును త్వరలోనే పట్టాలెక్కించేందుకు అధికార యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ పరిధిలోని తాత్కాలిక, శాశ్వత నిర్మాణాలను త్వరలోనే తొలగించనున్నారు. దీనిపై మూసీ రివర్ ఫ్రంట్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎంఆర్‌ఎఫ్‌డీసీఎల్) సన్నాహాలు చేస్తోంది. ఈ తొలగింపులో సర్వం కోల్పోయే కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. సంబంధిత కుటుంబాల జాబితాను కొద్ది రోజుల్లో ప్రకటించనున్నారు.
మూసీ నది ప్రక్షాళన, పునరుజ్జీవ ప్రాజెక్టును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం రెండు దశల్లో ప్రాజెక్టును పూర్తి చేయాలన్న ఆలోచనతో ఉంది. మొదటి దశలో మూసీ ప్రవహిస్తున్న ప్రాంతాన్ని మాత్రమే అభివృద్ధి చేస్తారు. అంటే దీని పరిధిలో ప్రస్తుతం నదీగర్భం.. మూసీకి అటూ ఇటూ ఉన్న ప్రాంతం (కట్టలు) మాత్రమే వస్తాయి. రెండో దశలో మూసీ నదికి అటూ ఇటూ 50 మీటర్ల పరిధిలోని బఫర్‌జోన్ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారు. అయితే డీపీఆర్‌ను మాత్రం ఒకే ప్రాజెక్టు కింద రూపొందిస్తారు. పనులు నిరంతరాయంగా, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సాగేందుకే ప్రాజెక్టును రెండు దశల్లో పూర్తిచేయాలని సర్కారు ఆలోచిస్తున్నట్లు సమాచారం. అందునా.. మొదటి దశ పనులు మొదలుపెట్టిన కొద్దిరోజులకే రెండోదశకు అవసరమైన కార్యాచరణ మొదలు పెడతారని సమాచారం.
మూసీ నది గర్భంలో కొన్ని ఇళ్లే ఉండటం, బఫర్‌జోన్ పరిఽధికొచ్చేసరికి ఎక్కువ ఇళ్లు ఉండటమూ రెండు దశల్లో ప్రాజెక్టును చేపట్టేందుకు ప్రధాన కారణం అన్న భావన వ్యక్తమవుతోంది. మూసీ నది గర్భంలో ప్రభుత్వం గుర్తించిన దాని ప్రకారం 1600 ఇళ్లు ఉన్నాయి. ఈ కుటుంబాల్లో చాలామందిని ఇప్పటికే ఖాళీ చేయించి అక్కడి నుంచి తరలించారు. ఫలితంగా ప్రాజెక్టు తొలి దశను త్వరితగతిన ప్రారంభించుకునేందుకు వీలు కలుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. బఫర్‌జోన్‌తో కలుపుకొంటే సుమారు 13వేల మంది వరకు ఇళ్లను కోల్పోతున్నారని అంచనా వేశారు.
దీనిపై సీఎం రేవంత్‌రెడ్డితో కూడా చర్చించారని సమాచారం. కాగా ఈ ప్రాజెక్టు డీపీఆర్ తయారీకి ఏడాదిన్నర సమయం పడుతుందని... మొత్తం ప్రాజెక్టును ఆరేళ్లలో పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిసింది. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టులో భాగంగా తొలి దశలో ప్రస్తుతం మూసీకి అటూ ఇటూ రిటెయినింగ్ వాల్ నిర్మించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది. వాల్ మధ్యలో ఉన్న మూసీ నదిని శుద్ధి చేసి.. అటూ ఇటూ కట్టలను సుందరీకరణ చేయాలని భావిస్తోంది. ఇక బఫర్‌జోన్‌లో మూసీ నది వెంబడి 55 కిలోమీటర్ల మేర రెండు వైపులా విశాలమైన రహదారిని నిర్మిస్తారు. అటూ ఇటూ రహదారుల ప్రక్కన ఇతర అభివృద్ది కార్యక్రమాలు చేపడతారు.
ఈ వార్తలు కూడా చదవండి
KTR: తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వారిని మోసం చేసింది: కేటీఆర్..
TG Politics: టచ్‌లో ఆ ఎమ్మెల్యేలు.. మరో బాంబు పేల్చిన భట్టి
High Court: మాగనూర్ ఫుడ్ పాయిజన్‌పై హైకోర్టు సీరియస్.. అధికారులకు పిల్లలు లేరా అంటూ ప్రశ్న..
For Telangana News And Telugu News
Updated Date - Nov 27 , 2024 | 03:53 PM