ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Minister Uttam: ఎన్డీఎస్ఏ నివేదిక వచ్చిన తర్వాత చర్యలు చేపడుతాం

ABN, Publish Date - Mar 06 , 2024 | 05:44 PM

మేడిగడ్డ బ్యారేజ్‌ పిల్లర్లు గత ఏడాది అక్టోబర్ 21వ తేదీన కుంగిపోయిందని.. ఈ విషయాలను ఎన్డీఎస్‌ఏ నిపుణుల కమిటీకి వివరించామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Minister Uttam Kumar Reddy) అన్నారు. బుధవారం నాడు సచివాలయంలో నిపుణుల కమిటీకి కాళేశ్వరం ప్రాజెక్టు వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.

హైదరాబాద్: మేడిగడ్డ బ్యారేజ్‌ పిల్లర్లు గత ఏడాది అక్టోబర్ 21వ తేదీన కుంగిపోయిందని.. ఈ విషయాలను ఎన్డీఎస్‌ఏ నిపుణుల కమిటీకి వివరించామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) అన్నారు. బుధవారం నాడు సచివాలయంలో నిపుణుల కమిటీకి కాళేశ్వరం ప్రాజెక్టు వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ... తాము కోరిన వెంటనే జలాశక్తి శాఖ కమిటీ వేసి పరిశీలనకు పంపినందుకు హర్షం వ్యక్తం చేశారు. మేడిగడ్డ పిల్లర్లు కుంగిపోయిన అంశంలో పునరుద్ధరణకు చేయాల్సిన అంశంలో ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం అందిస్తామని చెప్పారు. సాధ్యమైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని కోరుతున్నామని అన్నారు.

కమిటీ సలహాలను పాటించి మేడిగడ్డను తిరిగి ఉపయోగంలోకి తెస్తామని అన్నారు. రాష్ట్రానికి ఎన్డీఎస్‌ఏ(NDSA) టీం వచ్చిందని చెప్పారు. మూడు రోజుల పాటు కాళేశ్వరం ప్రాజెక్టుపై ఫీల్డ్ వర్క్ చేయనుందని చెప్పారు. ఎన్డీఎస్‌ఏ టీంకు అన్ని రకాల సహాయ సహకారాలు అందజేస్తామని తెలిపారు. ఇరిగేషన్, కాళేశ్వరం అవినీతిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాత్ర ఉందని అన్నారు. కాంగ్రెస్ విచారణ చేయడం కాదని.. మేడిగడ్డ విషయంలో కేంద్రం ఏం చేసిందో చెప్పాలని ప్రశ్నించారు. ఎన్డీఎస్‌ఏ కమిటీకి నాలుగు నెలల టైం ఉందని చెప్పారు. వీలైనంత త్వరగా తాత్కాలిక నివేదిక అడుగుతున్నామని, నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 06 , 2024 | 05:45 PM

Advertising
Advertising