ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: హైదరాబాద్‌లో నకిలీ డాక్యుమెంట్ల దందా.. తీగ లాగితే డొంక కదిలిన వైనం..

ABN, Publish Date - Oct 04 , 2024 | 04:13 PM

హైదరాబాద్‌లో ఖాళీ స్థలం కనిపిస్తే చాలు అక్రమార్కులు వాటిని కబ్జా చేసేందుకు గద్దల్లా వాలిపోతున్నారు. తాజాగా అలాంటి ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ డాక్యుమెంట్ల దందా వ్యవహారాన్ని పోలీసులు ఛేదించారు.

హైదరాబాద్: జీడిమెట్ల(Jeedimetla) పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ డాక్యుమెంట్ల(Fake Documents) తయారీ ముఠా గుట్టురట్టు అయ్యింది. ఓ కేసులో భాగంగా విచారణ చేపట్టిన జీడిమెట్ల పోలీసులు నకిలీ డాక్యుమెంట్లు తయారు చేసి భూములు కబ్జాలు చేస్తున్న ముఠా సభ్యులను పట్టుకున్నారు. ఏకంగా బతికున్న వారినే చనిపోయినట్లు మరీ పత్రాలు సృష్టించి అడ్డంగా భూములు కొల్లగొడుతున్న వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. డబ్బు ఆశ చూపి వ్యవస్థలను మేనేజ్ చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్న ముఠా సభ్యులను పోలీసులు కటకటాల వెనక్కి పంపించారు.


నగరవ్యాప్తంగా ఖాళీ స్థలం కనిపిస్తే చాలు అక్రమార్కులు వాటిని కబ్జా చేసేందుకు గద్దల్లా వాలిపోతున్నారు. తాజాగా అలాంటి ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ డాక్యుమెంట్ల దందా వ్యవహారాన్ని పోలీసులు ఛేదించారు. జీడిమెట్ల సుభాష్ నగర్‌లో తమ 200గజాల స్థలం కబ్జాకు గురైందంటూ సురేశ్ అనే బాధితుడు ఇటీవల జీడిమెట్ల పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. కేసు దర్యాప్తులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. పద్మాజారెడ్డి అనే మహిళ నకిలీ పత్రాలతో స్థలాన్ని కొట్టేసేందుకు పక్కా పథకం వేసినట్లు పోలీసులు తెలిపారు. ఇందులో భాగంగా కరుణాకర్ అనే వ్యక్తి ద్వారా నకిలీ పత్రాలు సృష్టించిందని తెలిపారు.


నకిలీ పత్రాల తయారు చేసేందుకు రూ.3.5లక్షలకు కరుణాకర్ అనే వ్యక్తి పద్మాజారెడ్డితో ఒప్పందం కుదుర్చుకున్నట్లు పోలీసులు తెలిపారు. పథకం ప్రకారం తన ముఠాతో కలిసి కరుణాకర్ డాక్యుమెంట్లు తయారీ చేపట్టినట్లు వెల్లడించారు. భూ యజమాని సురేశ్ 1992లోనే చనిపోయినట్లు ఫేక్ డెత్ సర్టిఫికెట్, లీగల్ హెయిడ్ సర్టిఫికెట్ సృష్టించారని పేర్కొన్నారు. ఆధార్ సెంటర్‌లో పని చేసే హరీశ్ అనే వ్యక్తి సహాయంతో ల్యాండ్ ఓనర్ పేరుతో నకిలీ ఆధార్ తయారు చేయించినట్లు పోలీసులు వెల్లడించారు. అనంతరం వాటి సహాయంతో కుత్బుల్లాపూర్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో పద్మాజారెడ్డి తన చెల్లి పేరుతో 200గజాల స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయించినట్లు తెలిపారు. విచారణలో భాగంగా పూర్తి ఆధారాలతో ముఠా మెుత్తాన్ని పట్టుకున్నట్లు వెల్లడించారు. నగరంలో ఎవరైనా భూ కబ్జాలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు హెచ్చరించారు.

ఇవి కూడా చదవండి..

KTR: రుణమాఫీపై ముఖ్యమంత్రివన్నీ డొల్ల మాటలే..

TG highcourt: హైడ్రాపై హైకోర్టుకు కేఏపాల్..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 04 , 2024 | 04:13 PM