Jani Master Case: కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు..
ABN, Publish Date - Sep 18 , 2024 | 11:08 AM
అత్యాచార వేధింపుల కేసు తెలుగు సినిమా ఇండస్ట్రీని కుదిపేస్తోంది. జానీ మాస్టర్‌కు వ్యతిరేకంగా చిత్ర పరిశ్రమ స్వరం పెంచింది. ఘటనపై పోలీసులతోపాటు టాలీవుడ్ లైంగిక వేధింపుల పరిష్కార ప్యానల్ విచారణ జరుపుతోంది.
హైదరాబాద్: అత్యాచారం, లైంగిక వేధింపుల కేసులో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ చుట్టూ ఉచ్చుబిగుస్తోంది. నార్సింగి పోలీసులు కేసు విచారణను వేగవంతం చేశారు. ఇప్పటికే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్, బాధితురాలి స్టేట్మెంట్‌ను పోలీసులు రికార్డు చేశారు. మరోవైపు సఖీ, భరోసా బృందాలు కూడా ఆమె నుంచి సమాచారం సేకరించాయి. అత్యాచార ఆరోపణల నేపథ్యంలో యువతికి ఇప్పటికే వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. మరికొన్ని ఆధారాల కోసం ఇవాళ(బుధవారం) బాధితురాలి ఇంటికి పోలీసులు వెళ్లనున్నారు. అనంతరం కుటుంబసభ్యులను నుంచీ మరికొంత సమాచారం సేకరించనున్నారు.
సినీ ఇండస్ట్రీ మద్దతు..
మరోవైపు అత్యాచార వేధింపుల కేసు తెలుగు సినిమా ఇండస్ట్రీని కుదిపేస్తోంది. జానీ మాస్టర్‌కు వ్యతిరేకంగా చిత్ర పరిశ్రమ స్వరం పెంచింది. ఘటనపై "టాలీవుడ్ లైంగిక వేధింపుల పరిష్కార ప్యానల్" విచారణ జరుపుతోంది. ఇప్పటికే బాధితురాలి ఫిర్యాదును ప్యానల్ సభ్యులు విచారణలో భాగంగా రికార్డు చేశారు. కొన్ని ఆధారాలు సైతం సేకరించినట్లు ప్యానల్ సభ్యులు వెల్లడించారు. జానీ మాస్టర్ వ్యవహారంలో నివేదిక సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. మరోవైపు టాలీవుడు నిర్మాతలు ఆమెకు అండగా నిలిచారు. యువతి వర్క్ టాలెంట్ చూసి సినిమా అవకాశాలు ఇచ్చేందుకు సిద్ధమైనట్లు సమాచారం. మరో అగ్రహీరో సైతం బాధితురాలికి మద్దతుగా నిలిచినట్లు తెలుస్తోంది.
అసలేం జరిగిందంటే?
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తనపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డారంటూ యువతి ఫిర్యాదు మేరకు ఈనెల 16న రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. సెక్షన్ 376 రేప్ కేసుతోపాటు క్రిమినల్ బెదిరింపు (506), గాయపరచడం(323) క్లాజ్ (2) సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. అత్యాచారంతోపాటు బెదిరించి కొట్టాడంటూ బాధితురాలు తన ఫిర్యాదులో ఆరోపించింది.
ప్రస్తుతం తన వయసు 21సంవత్సరాలని, తాను మైనర్‌గా ఉన్నప్పట్నుంచీ జానీ మాస్టర్ లైంగిక దాడులకు పాల్పడుతున్నాడని పేర్కొంది. చెన్నై, ముంబైలలో ఔట్ డోర్ షూటింగ్స్‌లతోపాటు హైదరాబాద్ నార్సింగిలోని తన ఇంటిలో సైతం తనపై జానీ మాస్టర్ పలుమార్లు లైంగిక దాడి చేశాడని పేర్కొంది. కాగా ఘటన నార్సింగి పరిధిలో జరగడంతో కేసుని రాయదుర్గం పోలీసులు అక్కడికి బదిలీ చేశారు. ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు వేగవంతం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Hyderabad: కొనసాగుతున్న నిమజ్జన ప్రక్రియ.. పరిశీలిస్తున్న జీహెచ్ఎంసీ కమిషనర్
MP Eatala: దివ్యాంగుల అభ్యున్నతికి కేంద్ర ప్రభుత్వం కృషి..
Read LatestTelangana News andNational News
Updated Date - Sep 18 , 2024 | 11:18 AM