TG Politics: సిద్దిపేట జిల్లా కేంద్రంలో పొలిటికల్ హీట్
ABN, Publish Date - Aug 20 , 2024 | 11:34 AM
Telangana: సిద్దిపేట జిల్లా కేంద్రంలో పొలిటికల్ హీట్ పెరిగింది. పోటా పోటీగా సమావేశాలకు బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. గత కొన్ని రోజుల నుంచి ఇరు పార్టీల మధ్య రుణమాఫీ వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈరోజు (మంగళవారం) సిద్దిపేటలోని మైనంపల్లి అంబేడ్కర్ చౌక్‌లో మైనంపల్లి హనుమంతరావు మీడియా సమావేశం నిర్వహించనున్నారు.
సిద్దిపేట జిల్లా, ఆగస్టు 20: సిద్దిపేట జిల్లా కేంద్రంలో పొలిటికల్ (TG Politics) హీట్ పెరిగింది. పోటా పోటీగా సమావేశాలకు బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. గత కొన్ని రోజుల నుంచి ఇరు పార్టీల మధ్య రుణమాఫీ వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈరోజు (మంగళవారం) సిద్దిపేటలోని మైనంపల్లి అంబేడ్కర్ చౌక్‌లో మైనంపల్లి హనుమంతరావు (Mynampally hanumantha rao) మీడియా సమావేశం నిర్వహించనున్నారు.
Congress VS BRS: రాజీవ్‌గాంధీ విగ్రహం.. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య రభస
మరోవైపు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రుణమాఫీపై బీఆర్‌ఎస్ ఇంటర్నల్ సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశంలో తాజా మాజీ బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి పార్టీ బాద్యులు పాల్గొనున్నారు. పోటా పోటీగా సమావేశాలతో జిల్లాలో రాజకీయ వేడి చెలరేగింది. పరస్పర దాడులు చేసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఇరు పార్టీల కార్యాలయలు, ప్రధాన కూడలిలో పోలీసులు భారీగా మోహరించారు. భారీగా పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇవి కూడా చదవండి..
Rains: వర్షాలపై విద్యాశాఖ అలర్ట్.. పాఠశాలలకు సెలవు
Rain Alert: ప్రమాదకర స్థితిలో ముసారంబాగ్ బ్రిడ్జి
Read Latest Telangana News And Telugu News
Updated Date - Aug 21 , 2024 | 09:09 AM