TG NEWS: బీజేపీ కార్పొరేటర్ల నిరసన.. ఎందుకంటే..
ABN, Publish Date - Nov 30 , 2024 | 05:36 PM
బీఆర్ఎస్, కాంగ్రెస్, ఏంఐఏం పార్టీలు కలిసి బల్దియాను లూటీ చేస్తున్నారంటూ బీజేపీ కార్పొరేటర్లు నినాదాలు చేశారు. స్టాండింగ్ కమిటీ మీటింగ్‌కు వచ్చిన మేయర్‌ను బీజేపీ కార్పొరేటర్లు అడ్డుకున్నారు. స్టాండింగ్ కమిటీ సమావేశాన్ని అడ్డుకునేందుకు బీజేపీ కార్పొరేటర్లు యత్నించారు.
హైదరాబాద్: జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో బీజేపీ కార్పొరేటర్లు ఇవాళ(శనివారం) నిరసన చేపట్టారు. దీంతో కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. వెంటనే కౌన్సిల్ సమావేశాన్నినిర్వహించాలని బీజేపీ కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. ఇవ్వాళ జరగాల్సిన స్టాండింగ్ కమిటీ సమావేశాన్ని అడ్డుకుంటామని బీజేపీ కార్పొరేటర్లు తెలిపారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు కలిసి బల్దియాను లూటీ చేస్తున్నాయంటూ బీజేపీ కార్పొరేటర్లు నినాదాలు చేశారు. స్టాండింగ్ కమిటీ మీటింగ్‌కు వచ్చిన మేయర్‌ను బీజేపీ కార్పొరేటర్లు అడ్డుకున్నారు. స్టాండింగ్ కమిటీ సమావేశాన్ని అడ్డుకునేందుకు బీజేపీ కార్పొరేటర్లు యత్నించారు. దీంతో భారీగా పోలీసుల మోహరించారు. పోలీసులకు, బీజేపీ కార్పొరేటర్లకు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ తోపులాటలో కొంతమంది కొందపడిపోయారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష్యపూరితంగా వ్యవహరిస్తోందని బీజేపీ కార్పొరేటర్లు ఆరోపించారు.
బీజేపీ కార్పొరేటర్లను సమావేశంలో లోపలకు పోలీసులు అనుమతించలేదు. స్టాండింగ్ కమిటీలో బీజేపీ మినహా కాంగ్రెస్, ఎంఐఎం, బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఉన్నారని చెప్పారు. అన్ని డివిజన్లలో పన్నులు వసూలు చేసి.. కేవలం ఓల్డ్ సిటీ అభివృద్ధికి ఖర్చు చేస్తున్నారని చెప్పారు. అడ్వర్టైజ్‌మెంట్ డిపార్ట్‌మెంట్‌లో రూ. 500 కోట్ల స్కామ్ జరిగిందని ఆరోపించారు. శానిటేషన్, అడ్వర్టైజ్మెంట్ కమిటీలు ఏర్పాటు చేసినా ఇప్పటికీ ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేయలేదని అన్నారు. ఎంఐఎం, కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి బల్దియాను దోచుకుంటున్నాయని విమర్శించారు. కార్యాలయంలో కూర్చొని ప్రాపర్టీ టాక్స్ ఇష్టం వచ్చినట్లు పెంచారని మండిపడ్డారు. పెంచిన ప్రాపర్టీ టాక్స్‌లు తగ్గించాలనీ డిమాండ్ చేశారు. నగరం లో స్ట్రీట్ లైట్స్ కూడా వెలగడం లేదని తెలిపారు.
రేవంత్ రెడ్డి ఆయననే ఫాలో అవుతున్నారు: కిషన్‌రెడ్డి
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అహంకారిపూరిత వైఖరినే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫాలో అవుతున్నారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు డిపాజిట్ రాలేదని చెప్పారు. మోదీ నాయకత్వంలో తెలంగాణలో అధికారం బీజేపీదేనని తెలిపారు. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం అనేక రకాలుగా సహాయం అందించిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నేరుగా 15వ ఆర్థిక ప్రణాళిక సంఘం నుంచి నిధులు ఇస్తుందని.. ఇందులో రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ప్రజలు ఆందోళనలో ఉన్నారని తెలిపారు. ఇక కాంగ్రెస్‌కు ప్రజా ఉద్యమాల ద్వారానే బుద్ది చెప్పాలని కిషన్‌రెడ్డి హెచ్చరించారు.
ఈ వార్తలు కూడా చదవండి
Mahesh Kumar Goud: పార్టీ కేడర్‌కు పీసీసీ చీఫ్ కీలక సూచన
TG Govt: లగచర్ల భూసేకరణ... నిన్న రద్దు.. నేడు నోటిఫికేషన్
Read Latest Telangana News And Telugu News
Updated Date - Nov 30 , 2024 | 05:49 PM