Razakar Movie: బండి ఎంకరేజ్.. కిషన్ రెడ్డి మౌనం.. బీజేపీలో ‘రజాకార్’ పంచాయతీ
ABN, Publish Date - Mar 22 , 2024 | 01:11 PM
Telangana: భారత్ జనతా పార్టీ (బీజేపీ)లో ‘‘రజాకార్’’ సినిమా పంచాయితీ నెలకొంది. రజాకార్ సినిమా విషయంలో కమలం పార్టీ నేతలు రెండు వర్గాలుగా విడిపోయిన పరిస్థితి. రజాకార్ సినిమాను చూడాలని బీజేపీ ఎంపీ బండి సంజయ్ ఎంకరేజ్ చేశారు. చెప్పడమే కాకుండా కరీంనగర్‌లో స్వయంగా థియేటర్‌కు వెళ్లి మరీ రజాకార్ సినిమాను ఎంపీ చూశారు.
హైదరాబాద్, మార్చి 22: భారత్ జనతా పార్టీ (బీజేపీ)లో (BJP) ‘‘రజాకార్’’ సినిమా ('Rajakar' movie) పంచాయితీ నెలకొంది. రజాకార్ సినిమా విషయంలో కమలం పార్టీ నేతలు రెండు వర్గాలుగా విడిపోయిన పరిస్థితి. రజాకార్ సినిమాను చూడాలని బీజేపీ ఎంపీ బండి సంజయ్ (BJP MP Bandi Sanjay) ఎంకరేజ్ చేశారు. చెప్పడమే కాకుండా కరీంనగర్‌లో స్వయంగా థియేటర్‌కు వెళ్లి మరీ రజాకార్ సినిమాను ఎంపీ చూశారు. అయితే రజాకార్ సినిమా విషయంలో రాష్ట్ర పార్టీ అధినేత కిషన్ రెడ్డి (Telangana BJP Chief Kishan Reddy) సైలెంట్‌గా ఉండిపోయారు.
Chennai: ఎన్నికల బరిలో ‘ఎలక్షన్ కింగ్’.. 239వసారి నామినేషన్ వేసిన పద్మరాజన్
నిర్మాత ఆవేదన...
గతంలో కాశ్మీర్ ఫైల్స్, కేరళ స్టోరీ సినిమాలను కిషన్ రెడ్డి, ఇతర నేతలు స్వయంగా థియేటర్‌కు వెళ్ళి చూశారు. అయితే రజాకార్ సినిమా విషయంలో మాత్రం అధ్యక్షుడు కిషన్ రెడ్డి వర్గం మౌనం వహిస్తోంది. రజాకార్ సినిమాను పార్టీ క్యాడర్ చూసేలా.. పిలుపునివ్వాలని పార్టీకి బండి సంజయ్ సలహా ఇచ్చినట్లు సమాచారం. అయితే తన సినిమాకు పార్టీ నుంచి మద్దతు లేదన్న అసంతృప్తిలో నిర్మాత, బీజేపీ నేత గూడూరు నారాయణరెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ నాయకత్వం నుంచి కనీస మద్దతు లేదని గూడూరు నారాయణరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అయితే రజకార్ సినిమా విషయంలో ఒక వర్గం ఎంకరేజ్ చేస్తుంటే.. మరోవర్గం వెనక్కి లాగుతోందని బీబేపీలో జోరుగా చర్చ వినిపిస్తోంది.
AAP Ministers Detained: పోలీసుల అదుపులో ఢిల్లీ ఆప్ మంత్రులు.. కాంగ్రెస్ రియాక్ట్
ఇదీ సినిమా...
కాగా.. యాటా సత్యనారాయణ దర్శకత్వంలో రాజ్ అర్జున్, మకరంద్ పాండే ప్రధాన పాత్రలో నటించిన రజాకార్ సినిమా ఈనెల 15న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నిజాం పాలనకు, ఖాసిం రజ్వీ తన రజాకార్ సైన్యంతో చేసిన మతోన్మాద మారణ హోమానికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు ఎటువంటి సాయుధ పోరాటం చేశారు, ప్రజలు ఎలా తిరగబడ్డారు అనేది చరిత్ర పుటల్లో, పుస్తకాల్లో అందరికీ తెలిసిందే. ఇప్పుడిదే కథ ‘‘రజాకార్’’ పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఇవి కూడా చదవండి..
Drugs: ఇందులో ఏ రాజకీయపరమైన కోణాలు లేవ్..: విశాఖ డ్రగ్స్ వ్యవహారంపై సీపీ
AP Politics: వైసీపీకి మరో షాక్.. పార్టీని వీడుతున్న కౌన్సిలర్లు
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Mar 22 , 2024 | 03:20 PM