ACB Raids: రంగారెడ్డి జాయింట్ కలెక్టర్ భూపాల్ రెడ్డి అరెస్ట్
ABN, Publish Date - Aug 13 , 2024 | 10:12 AM
రంగారెడ్డి జాయింట్ కలెక్టర్ భూపాల్ రెడ్డిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. భూపాల్ రెడ్డితో పాటు మరొకరిని అరెస్టు చేశారు. రంగారెడ్డి కలెక్టర్ ఆఫీస్, భూపాల్ రెడ్డి నివాసంతో పాటు సీనియర్ అసిస్టెంట్ మదన్ మోహన్ నివాసాల్లోనూ సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి.
రంగారెడ్డి: రంగారెడ్డి జాయింట్ కలెక్టర్ భూపాల్ రెడ్డిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. భూపాల్ రెడ్డితో పాటు మరొకరిని అరెస్టు చేశారు. రంగారెడ్డి కలెక్టర్ ఆఫీస్, భూపాల్ రెడ్డి నివాసంతో పాటు సీనియర్ అసిస్టెంట్ మదన్ మోహన్ నివాసాల్లోనూ సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. భూపాల్ రెడ్డి ఇంట్లో రూ.16 లక్షల నగదు, పెద్ద ఎత్తున ఆస్తి పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బాధితుడు జక్కిడి ముత్యంరెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో జాయింట్ కలెక్టర్‌ను ఏసీబీ ట్రాప్ చేసింది.
ధరణి వెబ్‌సైట్‌లో ప్రొహిబిటెడ్ భూముల నుంచి 14 గుంటల భూమిని తొలగించాలని బాధితుడు కోరాడు. ఈ పని చేసేందుకు రూ. 8 లక్షలను సీనియర్ అసిస్టెంట్ మధుమోహన్ రెడ్డి డిమాండ్ చేశాడు. బాధితుడు కారులో డబ్బులు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. జాయింట్ కలెక్టర్ భూపాల్ రెడ్డి చెబితేనే తాను డబ్బులు తీసుకున్నట్లు ఏసీబీకి సీనియర్ అసిస్టెంట్ చెప్పారు. ఏసీబీ అధికారుల ముందే జాయింట్ కలెక్టర్‌కు సీనియర్ అసిస్టెంట్ ఫోన్ చేశాడు. పెద్ద అంబర్‌పేట్ ఔటర్ రింగ్ రోడ్డు వద్దకు డబ్బులు తీసుకురావాలని ఫోన్లో జాయింట్ కలెక్టర్ మాట్లాడారు. రంగంలోకి దిగి భూపాల్ రెడ్డితో పాటు, సీనియర్ అసిస్టెంట్ మధుమోహన్‌ను ఏసీబీ అధికారలు అరెస్ట్ చేశారు
Updated Date - Aug 13 , 2024 | 10:12 AM