ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Bike Racing: హైదరాబాద్‌లో బైక్ రేసర్లపై కొరడా ఝుళిపించిన పోలీసులు..

ABN, Publish Date - Jun 18 , 2024 | 08:06 PM

నగరంలో బైక్ రేసర్లపై పోలీసులు కొరడా ఝుళిపించారు. బైక్ రేసింగ్‌(Bike Racing)కు పాల్పడుతూ నగరవాసులను భయభ్రాంతులకు గురిచేస్తున్న 10మందిని అరెస్టు(Arrest) చేసి రిమాండ్‌కు తరలించారు.

హైదరాబాద్: నగరంలో బైక్ రేసర్లపై పోలీసులు కొరడా ఝుళిపించారు. బైక్ రేసింగ్‌(Bike Racing)కు పాల్పడుతూ నగరవాసులను భయభ్రాంతులకు గురిచేస్తున్న 10మందిని అరెస్టు(Arrest) చేసి రిమాండ్‌కు తరలించారు. టీ హబ్, ఐటీ క్యారిడార్, నాలెడ్జ్ సిటీ సత్య బిల్డింగ్ రోడ్డు ఏరియాల్లో ద్విచక్రవాహనాలపై విన్యాసాలు చేస్తూ రేసర్లు రెచ్చిపోయారు. ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు కలిగించారు. సమాచారం అందుకున్న రాయదుర్గం పోలీసులు వెంటనే దాడులు చేశారు. పోలీసులను చూసి బైకులు వదిలేసి పారిపోతున్న 10మంది యువకులను పట్టుకుని అరెస్టు చేశారు. మరో నలుగురు తప్పించుకోగా వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 10 బైకులు సీజ్ చేశారు. A1గా అబ్దుల్ మతిన్, A2 చితుకుల సాయికిరణ్, A3 చప్పిడి శరణ్, A4 నాయిని భానుచందర్, A5 ఈశ్వర్ కుమార్, A6 కొఠారి కృష్ణగా గుర్తించి కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. రోడ్లపై విన్యాసాలు చేస్తూ ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాయదుర్గం పోలీసులు హెచ్చరించారు.

ఇది కూడా చదవండి:

Hyderabad: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు..

Updated Date - Jun 18 , 2024 | 08:06 PM

Advertising
Advertising