CM Revanth Reddy Security: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. సీఎం సెక్యూరిటీలో కీలక మార్పులు..
ABN, Publish Date - Oct 28 , 2024 | 04:19 PM
తెలంగాణ రాష్ట్ర స్పెషల్ పోలీసులు( టీజీఎస్పీ) నిరసనల నేపథ్యంలో ఇంటెలిజెన్స్ అధికారులు అప్రమత్తం అయ్యారు. దీంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసం వద్ద భద్రతా సిబ్బందిలో కీలక మార్పులు చేశారు.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర స్పెషల్ పోలీసులు(TGSP) నిరసనలు చేస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) కీలక నిర్ణయం తీసుకుంది. బెటాలియన్ పోలీసుల నిరసనలు, ధర్నాలతో హోరెత్తిస్తుండడంతో ఇంటెలిజెన్స్ పోలీసులు అలర్ట్ అయ్యారు. ఇంటెలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి సెక్యూరిటీలో ఉన్నతాధికారులు కీలక మార్పులు చేశారు. ముఖ్యమంత్రి నివాసం వద్ద ఆర్మ్‌డ్ రిజర్వు పోలీసులతో పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. సమస్యలు పరిష్కరించాలంటూ టీజీఎస్పీ పోలీసులు కుటుంబసభ్యులతో కలిసి పెద్దఎత్తున నిరసనలు చేస్తున్న సంగతి తెలిసిందే.
దీంతో నిరసనలు చేస్తూ నిబంధలకు విరుద్ధంగా వ్యవహరించారంటూ క్రమశిక్షణా చర్యల పేరుతో 39 మంది హెడ్‌కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లను శనివారం నాడు పోలీస్ ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఆదివారం నాడు ఏఆర్ ఎస్సై, మరో హెడ్ కానిస్టేబుల్ సహా ఏకంగా 10 మందిని ఉద్యోగాల నుంచి శాశ్వతంగా తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయినప్పటికీ వీరి ఆందోళనలు మాత్రం ఆగడం లేదు. తమకు వెట్టిచాకిరీ నుంచి విముక్తి కల్పించాలని బెటాలియన్ పోలీసులు ఆందోళనలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి నివాసం వద్ద ఆర్మ్‌డ్ రిజర్వు పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఈ ఏడాది జనవరిలోనూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భద్రతా సిబ్బందిని మార్చివేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అప్పుడు ఉన్న భద్రతా సిబ్బందిలో ఎక్కువ మంది గత సీఎం కేసీఆర్ వద్ద పని చేసిన వారే. అయితే ముఖ్యమంత్రి కార్యాలయం, ఆయనకు సంబంధించిన వ్యక్తిగత, అధికారిక సమాచారం బయటకు వెళ్తోందని మార్పులు చేశారు. పాత వారిని తొలగిస్తూ కొత్త భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేశారు. అయితే సమాచారం బయటకు వెళ్లడంపై సీఎంవో, ఇంటెలిజెన్స్ అధికారులపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఈ మేరకు అప్పుడు భారీగా మార్పులు చేశారు. అలాగే ప్రస్తుతం టీజీఎస్పీ పోలీసుల నిరసనల నేపథ్యంలో ఉన్నతాధికారులు ముందుగానే అప్రమత్తం అయ్యారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Raj Pakala: పోలీసుల నోటీసులపై రాజ్‌పాకాల స్పందన
Vemula: కేసీఆర్ సూచించిన వారికి పీఏసీ చైర్మన్ ఇవ్వాలి
TG News: హైదరాబాద్‌లో ఫుడ్ పాయిజన్
Read Latest Telangana News And Telugu News
Updated Date - Oct 28 , 2024 | 04:37 PM