ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Seethakka: అప్పుడు ఎన్నో అవమానాలు.. మంత్రి సీతక్క ఆవేదన

ABN, Publish Date - Nov 04 , 2024 | 02:18 PM

కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పుల వల్ల గంటకు మూడు కోట్లు వడ్డీ చెల్లించాల్సి వస్తుందని మంత్రి సీతక్క చెప్పారు. ఎన్నో ఆర్థిక సమస్యలు ఉన్నా.. తమ ప్రభుత్వం ఉద్యోగులు, విద్యార్థులకు మేలు చేస్తోందని అన్నారు.

హైదరాబాద్: గిరిజన విద్యార్థులను అన్ని రకాలుగా ప్రోత్సహిస్తామని మంత్రి సీతక్క తెలిపారు. తాను ఏ శాఖలో ఉన్నా తన మనసు గిరిజన సంక్షేమం మీద ఉంటుందని చెప్పారు.తన ప్రాణం ఆదివాసీ, గిరిజనులు, చెంచుల గురించి కొట్టుకుంటుందని అన్నారు. వారి సమస్యలను తెలుసుకునేందుకు అచ్చంపేట వంటి ప్రాంతాలకు వెళ్తుంటానని గుర్తుచేశారు. ఉన్నత విద్యాసంస్థల్లో సీట్లు సంపాదించిన పలువురు విద్యార్థులకు మంత్రి సీతక్క ల్యాప్ టాప్‌లు బహుకరించారు.


ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ... సీఎం రేవంత్ రెడ్డి ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న టీచర్ల పదోన్నతులు కల్పించారని.. బదిలీల ప్రక్రియను పూర్తి చేశారని అన్నారు. దీనివల్ల 5000 మంది ఆశ్రమ పాఠశాల టీచర్లకు ప్రయోజనం జరిగిందని తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పుల వల్ల గంటకు మూడు కోట్లు వడ్డీ చెల్లించాల్సి వస్తుందని చెప్పారు. ఎన్నో ఆర్థిక సమస్యలు ఉన్నా.. తమ ప్రభుత్వం ఉద్యోగులు, విద్యార్థులకు మేలు చేస్తోందని అన్నారు.


‘నాది కూడా హాస్టల్ జీవితమే..

‘ప్రభుత్వానికి ప్రజలకు ఉద్యోగులు, టీచర్లు వారధులు. టీచర్లు మనసుపెట్టి పని చేయాలి. కష్టాన్ని ఇష్టంగా చేసుకుని పని చేయాలి. అప్పుడే పనిలో సంతృప్తి కలుగుతుంది.విద్యార్థులను సొంత పిల్లల్లాగా చూసుకోవాలి. సొంత పిల్లల్లాగానే వారిని తీర్చిదిద్దాలి. అందరిలో కెల్లా గిరిజన విద్యార్థులను ముందంజలో నిలిపేలా పనిచేయాలి. అప్పుడు విద్యార్థులు మిమ్మల్ని జీవితాంతం గుర్తు పెట్టుకుంటారు. నాది కూడా హాస్టల్ జీవితమే చిన్నప్పుడు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాను. హాస్టల్ పిల్లలంటే చులకన భావం ఉంటుంది. మనల్ని అవహేళన చేసేవారికి గుణపాఠం చెప్పేలా కసితో కష్టపడాలి..అప్పుడే ఎదుగుతాం.తండాలు నుంచి వచ్చిన పిల్లలు జాతీయ, అంతర్జాతీయ క్రీడ పోటీల్లో పథకాలు సాధిస్తున్నారు. మంచిగా పని చేసిన అధికారులను దేవుడు లాగా కొలుస్తారు. ఎక్కడైతే విద్యా వ్యవస్థ సరిగ్గా లేదో అక్కడే అద్భుతాలు సృష్టించగలగాలి. ఎక్కడైతే ప్రజలకు అవసరం ఉంటుందో అక్కడే అధికారులు పనిచేశాలి. వేయిలో ఒకరిగా కాకుండా సమాజం గుర్తు పెట్టుకునేలా పనిచేయాలి. 16 ఇళ్ల తర్వాత కాస్మోటిక్ చార్జీలను మూడు రేట్లు పెంచాము. ఏడేళ్ల తర్వాత డైట్ చార్జీలను 40 శాతం పెంచాం. బీఆర్ఎస్ ప్రభుత్వం విద్య వ్యవస్థకు చేసిదేం లేదు’’ అని మంత్రి సీతక్క పేర్కొన్నారు.


‘నాసిరకం వస్తువుల కొనుగోలుపై విచారణ ..

‘హాస్టళ్ల కోసం గతంలో కొనుగోలు చేసిన వస్తువులు సరిగా లేవు. నాసిరకం వస్తువుల కొనుగోలుపై విచారణ జరిపిస్తాం. హాస్టల్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి. చిన్న చిన్న సమస్యలు సృష్టించి బయట శక్తులు మనకు అపఖ్యాతి తెచ్చే కుట్రలు చేస్తున్నారు. .. అలర్ట్‌గా వ్యవహరించాలి.ఐటీడీఏ పనితనాన్ని మెరుగుపరచాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గిరిజనుల సంక్షేమం కోసం రూ. 17 వేల కోట్లు కేటాయించారు. సమగ్రంగా బడ్జెట్‌ను వినియోగించుకోవాలి. వచ్చే నిధులను సక్రమంగా ఖర్చు చేసి ఆణిముత్యాలను బయటికు తీసి విద్యావేత్తలుగా తయారు చేయాలి. ఐటీడీఏ పీవోలు చాలా పవర్‌ఫుల్. ఆ ప్రాంతాల పరిపాలకులు మీరే. విస్తృతంగా పర్యటిస్తేనే ప్రజల సమస్యలు తెలుస్తాయి. కాలానికి అనుగుణంగా ప్రజల అవసరాలను తీర్చే విధంగా పనిచేయాలి. మానవతా హృదయంతో పనిచేయాలి. గిరిజన సంక్షేమ శాఖలో పనిచేయడాన్ని అదృష్టంగా భావించాలి.అంకిత భావంతో పనిచేసి గిరిజన జీవితంలో వెలుగులు నింపాలి. మారిన కాలానికి అనుగుణంగా డిమాండ్ ఉన్న కోర్సుల వైపు పిల్లలను మళ్లించాలి. ఇతరులతో కలిసిపోయేలా గిరిజన సమాజంలో అవగాహన పెంచాలి. ఉపాధి అవకాశాల కోసం మన ప్రాంతాన్ని దాటి వెళ్లేలా తీర్చిదిద్దాలి. ఉన్న ఊరిలోనే ఉపాధి రావాలంటే కష్టం. హెల్త్ మానిటరింగ్ యాప్‌ను తీసుకు రావడం అభినందనీయం’’ అని మంత్రి సీతక్క వెల్లడించారు.

Updated Date - Nov 04 , 2024 | 02:25 PM