ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Sukhesh Vs Kavitha: బయటపడే మార్గమే లేదక్కా.. కౌంట్‌డౌన్ మొదలైంది!

ABN, Publish Date - Mar 19 , 2024 | 09:40 AM

ఎమ్మెల్సీ కవిత అరెస్టుపై జైలు నుంచి సుఖేశ్ చంద్రశేఖర్ సంచలన లేఖ రాశారు. ఇప్పటి వరకూ కవితను టార్గెట్ చేస్తూ ఆయన ఎన్నో లేఖలు విడుదల చేశారు. కవితకు.. తనకు మధ్య జరిగిన ఛాటింగ్ వివరాలను సైతం సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇన్నాళ్లుగా తప్పుడు కేసులు, తప్పుడు ఆరోపణలు, రాజకీయ కక్ష సాధింపు అంటూ చెప్పినవన్నీ అబద్ధాలని తేలింది.

ఢిల్లీ: ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) అరెస్టుపై జైలు నుంచి సుఖేశ్ చంద్రశేఖర్ (Sukhesh Chandrasekhar) సంచలన లేఖ రాశారు. ఇప్పటి వరకూ కవితను టార్గెట్ చేస్తూ ఆయన ఎన్నో లేఖలు విడుదల చేశారు. కవితకు.. తనకు మధ్య జరిగిన ఛాటింగ్ వివరాలను సైతం సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇన్నాళ్లుగా తప్పుడు కేసులు, తప్పుడు ఆరోపణలు, రాజకీయ కక్ష సాధింపు అంటూ చెప్పినవన్నీ అబద్ధాలని తేలింది. ఇన్నాళ్లకు నిజం బయటికొచ్చిందని.. చేసిన పనుల కర్మ ఫలం ఇప్పుడు వెంటాడుతోందని సుఖేష్ లేఖలో పేర్కొన్నారు.

Bhadrachalam: భద్రాద్రి రామయ్య భక్తులకు శుభవార్త..

‘‘నిజం శక్తి ఏంటో తెలుసుకోవాలి. ఎదుర్కోవాల్సి ఉంటుంది. నన్ను ఎవరూ ఏమి చేయలేరని అనుకునేవారు. కానీ కొత్త భారతదేశంలో చట్టమే అన్నింటికన్నా శక్తివంతమైంది. నేను గతంలో మీడియాకు విడుదల చేసిన లేఖల్లో 2 అంశాలు పొందుపరిచాను. అందులో ఒకటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలవుతుంది.. రెండోది తిహార్ (Teehar Jail) క్లబ్‌లో చేరేందుకు కవితకు కౌంట్ డౌన్ మొదలైంది. ఈ రెండూ ఇప్పుడు నిజమయ్యాయని అనిపిస్తోంది. కవిత అరెస్టుతో అవినీతి పండోరా బాక్స్ ఓపెన్ అయింది. కవితతో పాటు ఆమె అవినీతి సహాయకులు, అవినీతి రాజు అరవింద్ కేజ్రీవాల్ చేసిన అక్రమాలన్నీ బయటపడతాయి.

కేజ్రీ, సిసోడియాతో కవిత కుమ్మక్కు

వేలాది కోట్ల రూపాయల ప్రజాధనం లూటీ చేసి సింగపూర్, హాంగ్‌కాంగ్, జర్మనీ వంటి దేశాలకు పంపిన విషయాలు బయటికొస్తాయి. ఇది ఎవరికి అర్థం కావాలో వారికి అర్థమైందని అనుకుంటున్నాను. అక్కా!..నేను వాట్సాప్ చాట్ స్క్రీన్ షాట్ల ద్వారా బయటపెట్టిన నెయ్యి డబ్బాల కథలు, రేంజ్ రోవర్ కలెక్షన్ కథలు, గోవా కథలు, కాంట్రాక్ట్ కథలు దర్యాప్తులో నిజమని తేలాయి. బయటపడే మార్గమే లేదు అక్కా. ఇప్పటికైనా నా విన్నపం ఒక్కటే.. అవినీతి సూత్రధారి అరవింద్ కేజ్రీవాల్‌ను కాపాడేందుకు నిజాన్ని దాచే ప్రయత్నం చేయవద్దు. ఎందుకంటే ఈ దేశ ప్రజలు, న్యాయస్థానాలు నిజం తెలుసుకున్నాయి. ఇందుకు కావాల్సినంత సాక్ష్యాలు, ఆధారాలు ఉన్నాయి.

రూ.300 కోట్ల ఘరానా మోసం!

ఏదేమైనా ఈడీ (ED), సీబీఐ (CBI) కన్‌ఫ్రంటేషన్ లో భాగంగా మిమ్మల్ని త్వరలోనే ముఖాముఖి చూస్తాను అక్కా.. మా గ్రేటెస్ట్ తిహార్ జైలుకు స్వాగతం అక్కా.. మీ మరో సోదరుడు, అవితిని సూత్రధారి అరవింద్ కేజ్రీవాల్ (Aravind Kejriwal) మీకు జైల్‌లో లగ్జరీ జీవితం అందంచేందుకు అన్ని ఏర్పాట్లు చేసి ఉంటారు. ఈ లేఖను ముగించే ముందు మరొక్క మాట చెప్పదల్చుకున్నా.. ‘సినిమా ఇంకా మిగిలే ఉంది’. కేజ్రీవాల్ జీ.. తదుపరి ఇక మీరే. ఎంత ప్రయత్నించినా సాధ్యం కాదు. సినిమా క్లైమాక్స్‌కు చేరుకుంది. కేజ్రీవాల్ జీ.. నా సోదరసోదరీమణులకు తిహార్ క్లబ్‌కు స్వాగతం పలుకుతున్నాను’’ అని సుఖేష్ చంద్రశేఖర్ లేఖలో పేర్కొన్నారు.

Delhi Liquor Scame: సుప్రీం కోర్టులో కవిత పిటషన్.. నేడు విచారణ..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 19 , 2024 | 09:58 AM

Advertising
Advertising