ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Telangana Assembly : 8వ రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

ABN, Publish Date - Aug 01 , 2024 | 10:23 AM

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 8వ రోజు గురువారం ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యాయి. బుధవారం సభ వాడీ వేడీగా జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి తనను అవమానకంగా మాట్లాడారని, శాంతి భద్రతలు ప్రశ్నించినందుకే మమ్మల్ని టార్గెట్ చేశారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. అయితే సీఎం ఎవరిని కించపరచలేదని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పేర్కొన్నారు.

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు (Telangana Assembly Budget Meetings) 8వ రోజు (8th Day) గురువారం ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యాయి. బుధవారం సభ వాడీ వేడీగా జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తనను అవమానకరంగా మాట్లాడారని, శాంతి భద్రతలు ప్రశ్నించినందుకే మమ్మల్ని టార్గెట్ చేశారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి (Sabita Indra Reddy) అన్నారు. అయితే సీఎం ఎవరిని కించపరచలేదని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు (Congress MLAs) పేర్కొన్నారు. ఈ క్రమంలో అధికార, విపక్షాల మధ్య మాటల తూటాలు పేలాయి.


కాగా.. ఈ రోజు కూడా ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని సభాపతి రద్దు చేశారు. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం మూడు బిల్లులను ప్రవేశపెడుతుంది. తెలంగాణ సివిల్ కోర్టు అమెండ్‌మెంట్ బిల్లు, తెలంగాణ లా డిపార్ట్మెంట్( చేంజ్ ఆఫ్ ఆక్రోనేమ్స్) బిల్లు, తెలంగాణ ద్రవ్య వినిమయ బిల్లు-2లను సభలో ప్రభుత్వం పెట్టనుంది. అలాగే సాంప్రదాయ ఇంధనం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ వార్షిక నివేదికను ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క టేబుల్ చేయనున్నారు. ఇంకా తెలంగాణ స్టేట్ హ్యాండీక్రాఫ్ట్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ 2వ వార్షిక నివేదికను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు టేబుల్ చేయనున్నారు.


కాగా ఇవాళ అసెంబ్లీలో పలు అంశాలపై స్వల్పకాలిక చర్చ జరుగుతుంది. హైదరాబాద్‌ సుస్థిర పట్టణాభివృద్ధి కార్యక్రమాలు, స్కిల్‌ యూనివర్శిటీ, సివిల్‌ కోర్టుల చట్ట సవరణపై చర్చ జరుగుతుంది. సభ ప్రారంభం కాగానే బీఆర్ఎస్ వాయిదా తీర్మానం ఇచ్చింది. నిన్న శాసనసభలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై చర్చకు కోరుతూ వాయిదా తీర్మానం ఇచ్చింది. అలాగే మహిళా ఎమ్మెల్యేలను అవమానపరిచిన ముఖ్యమంత్రి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నల్ల బ్యాడ్జీలు ధరించి శాసనసభ సమావేశాలకు హాజరయ్యారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పారిశ్రామిక రంగంపై సీఎం కీలక నిర్ణయం..

సీఎంకు తలపోటుగా ఆ నియోజకవర్గం..!

యూపీ సీఎం యోగి సంచలన నిర్ణయం..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Aug 01 , 2024 | 11:14 AM

Advertising
Advertising
<