Share News

TS Cabinet Meeting: తెలంగాణ కేబినెట్ భేటీ నేడు..

ABN , Publish Date - May 20 , 2024 | 12:50 PM

హైదరాబాద్: రోజంతా కొనసాగిన ఉత్కంఠకు తెరదించుతూ.. రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్వాహణకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. అయితే కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో జూన్ 4వ తేదీలోపు చేయాల్సిన అత్యవసరమైన అంశలనే చర్చించాలని షరతు విధించింది. ముఖ్యంగా రైతు రుణమాఫీ, హైదరాబాద్ ఉమ్మడి రాజధాని వంటి అంశాలను భేటీలో చేపట్టకూడదని పేర్కొంది.

TS Cabinet Meeting: తెలంగాణ కేబినెట్ భేటీ నేడు..

హైదరాబాద్: రోజంతా కొనసాగిన ఉత్కంఠకు తెరదించుతూ.. రాష్ట్ర మంత్రివర్గ సమావేశం (Cabinet Meeting) నిర్వాహణకు కేంద్ర ఎన్నికల సంఘం (Central Election Commission) అనుమతి ఇచ్చింది. అయితే కోడ్ (Election Code) అమలులో ఉన్న నేపథ్యంలో జూన్ 4వ తేదీలోపు చేయాల్సిన అత్యవసరమైన అంశలనే చర్చించాలని షరతు విధించింది. ముఖ్యంగా రైతు రుణమాఫీ, హైదరాబాద్ ఉమ్మడి రాజధాని వంటి అంశాలను భేటీలో చేపట్టకూడదని పేర్కొంది. ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములైన అధికారులు సమావేశంలో పాల్గొనకూడదని స్పష్టం చేసింది. నిన్న ఈసీ (EC) నుంచి ఈ మేరకు సమాచారం రావడంతో వెంటనే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో ఈరోజు తెలంగాణ కేబినెట్ భేటి (Telangana Cabinet Meeting) జరగనుంది.


సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి మంత్రులతోపాటు ఆయా శాఖల ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. రాష్ట్రంలో ఈ నెల 13న లోక్ సభ ఎన్నికల పోలింగ్ ముగియడంతో శనివారం మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని ప్రభుత్వం భావించింది. కోడ్ ఉన్నందున అనుమతి కావాలంటూ సీఈసీకి లేఖ రాసింది. వారి నుంచి సమాచారం వస్తుందని, శనివారం మధ్యాహ్నం నుంచి సీఎంతోపాటు మంత్రులు సచివాలయంలో ఎదురు చూశారు. అనుమతి రాకపోవడంతో రాత్రి 7 గంటల తర్వాత వెనుదిరిగారు. ఈ రోజు వరకు చూసి స్పందన రాకుంటే మంత్రి వర్గమే ఢిల్లీకి వెళ్లి ఎన్నికల సంఘాన్ని కలుస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. అయితే రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ అధికారులతో చర్చించడం.. షరతులతో కూడిన అనుమతులు రావడంతో సస్పెన్స్ వీడింది.


జూన్ 4లోపు చేపట్టాల్సిన అంశాలే ఎజెండాగా భేటీ

సోమవారం సాయంత్రం మూడు గంటలకు జూన్ 4 లోపు చేపట్టాల్సిన అంశాలే ఎజెండాగా కేబినెట్ భేటీ జరుగుతుంది. ఈసీ షరతులను దృష్టిలో ఉంచుకుని ధాన్యం కొనుగోలు, అకాల వర్షాలు, వానాకాలం పంట ప్రణాళిక, రానున్న విద్యా సంవత్సరానికి సంబంధించిన అంశాలు, జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్పవ కార్యక్రమాలు వంటి వాటిపై మంత్రి వర్గం చర్చించనున్నట్లు సమాచారం. సీఎం రేవంత్ రెడ్డి రైతు రుణమాఫీపై చాలా పట్టుదలగా ఉన్నారు. ఆగస్టు 15లోగా రుణ మాఫీ చేసి తీరుతామని పదే పదే చెబుతున్నారు. ముందుగా అనుకున్న ప్రకారం కేబినెట్‌లో ఇదే కీలకాంశం అయ్యేది. కానీ సీఈసీ షరతులతో చర్చకు అవకాశం లేదు. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడి కోడ్ తొలగిన తర్వాత అంటే జూన్ 4వ తేదీ తర్వాతే చర్చించే వీలుంది. రాజకీయంగా లోక్ సభ ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు అవకాశాలపై మంత్రివర్గంలో సమీక్ష జరిగే అవకాశమున్నట్లు సమాచారం.


ఈ వార్తలు కూడా చదవండి..

యాదాద్రికి పోటెత్తిన భక్తులు.. ఫోటో గ్యాలరీ

తిరుపతి గంగమ్మ జాతర దృశ్యాలు.. ఫోటో గ్యాలరీ

సిట్ దర్యాప్తులో అసలు వాస్తవాలు..!

జగన్ ఓటమి తధ్యం.. మరోమారు స్పష్టం చేసిన పీకే

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - May 20 , 2024 | 01:38 PM