Hyderabad: ఏసీబీకి లేఖ రాసిన సీఎస్ శాంతి కుమారి.. విషయం ఏంటంటే..
ABN, Publish Date - Dec 17 , 2024 | 10:12 PM
ఫార్ములా-ఈ కార్ రేస్ కేసు వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. కేసుపై లోతుగా దర్యాప్తు చేయాలని కోరుతూ ఏసీబీకి తెలంగాణ సీఎస్ శాంతికుమారి లేఖ రాశారు. విచారణకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతి ఇవ్వడంతో కాంగ్రెస్ ప్రభుత్వం దూకుడు పెంచింది.
హైదరాబాద్: ఫార్ములా-ఈ కార్ రేస్ కేసు వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. కేసుపై లోతుగా దర్యాప్తు చేయాలని కోరుతూ ఏసీబీకి తెలంగాణ సీఎస్ శాంతికుమారి లేఖ రాశారు. విచారణకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతి ఇవ్వడంతో కాంగ్రెస్ ప్రభుత్వం దూకుడు పెంచింది. ఈ మేరకు గవర్నర్ ఇచ్చిన అనుమతిని సీఎస్ తాను రాసిన లేఖకు జత చేసి ఏసీబీకి పంపించారు. ఫార్ములా-ఈ కార్ రేస్ వ్యవహారంలో నిధుల దుర్వినియోగంపై పూర్తి విచారణ జరపాలని ఏసీబీని సీఎస్ కోరారు.
రేసింగ్‌కు సంబంధించిన పూర్వాపరాలు, దీని నిర్వహణకు అప్పటి బీఆర్ఎస్ మంత్రి కేటీఆర్ తీసుకున్న చర్యలపైనా సమగ్ర దర్యాప్తు చేయాలని సీఎస్ శాంతి కుమారి విజ్ఞప్తి చేశారు. అలాగే ఆర్బీఐ అనుమతి లేకుండా విదేశీ కరెన్సీ చెల్లించడం, ప్రజాధనం దుర్వినియోగం, నిబంధనల ఉల్లంఘన వంటి అంశాలపైనా దర్యాప్తు చేయాలని కోరారు. అలాగే ఒప్పందానికి రెండు వారాల ముందే డబ్బు చెల్లించడం, ఆ తర్వాత ఒప్పందం చేసుకోవడంపైనా విచారణ చేయాలని కోరారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘన సహా తదితర అంశాలపై పూర్తిగా దర్యా్ప్తు చేయాలని కోరుతూ ఏసీబీకి సీఎస్ శాంతి కుమారి లేఖ రాశారు.
ఈ వార్తలు కూడా చదవండి:
KTR: సీఎం రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగిన కేటీఆర్..
Hyderabad: ఆ ఘటనపై శాసన మండలిలో మాట్లాడతా: తీన్మార్ మల్లన్న..
Updated Date - Dec 17 , 2024 | 10:14 PM